ఈరోజు కొత్త
యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2024 యూనియన్ బడ్జెట్ వివరాలను ప్రకటించారు.
వరుసగా 7వ సారి
యూనియన్ బడ్జెట్ ను
నిర్మలా సీతారామన్
ప్రవేశపెట్టడం కూడా ఒక విశేషం.
కొత్త బడ్జెట్ నుండి
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) పైన
15% నుండి 20% వరకు
తగ్గింపు ప్రకటించారు.
గడిచిన 6 సంవత్సరాల లో పెరిగిన దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ మరియు ఎగుమతి దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCBs)
సుంకం తగ్గింపు వలన స్మార్ట్ ఫోన్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
ఇందులో ప్రైస్ స్లాబ్ ను పాటిస్తే, ప్రీమియం స్మార్ట్ ఫోన్ ధరలలో
పెద్దగా మార్పులు ఉండక పోవచ్చు.
ఈ కొత్త బడ్జెట్ ప్రకటన వలన
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు
లబ్ధి చేకూరే అవకాశం
మెండుగా కనిపిస్తోంది