zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Aug 27 2015
zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

లేటెస్ట్ గా మరొక చైనీస్ బ్రాండ్, zopo ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది. స్పీడ్ 7 అనే మోడల్ ను అనౌన్స్ చేసింది. ఇది మిడ్ ర్యాంక్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్. దీని ధర 12,999 రూ. Xiaomi mi 4i, అసుస్ జెన్ ఫోన్ 2 కు పోటీ. మేము దీనితో కొంత సేపు గడిపాము. సో zopo స్పీడ్ 7 ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇక్కడ చూడగలరు. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

Zopo స్పీడ్ 7 key స్పెక్స్ -
SoC:  మీడియా టెక్ 6753 ఆక్టో కోర్
RAM: 3GB
డిస్ప్లే: 5 అంగుళాల, 1080px
స్టోరేజ్: 16GB
కెమెరా: 13.2MP బ్యాక్, 5MP ఫ్రంట్ 
బ్యాటరీ: 2500mAh

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తున్న మిగిలిన ఫోనుల వలె, దీనిలో కూడా ఫుల్ HD 5 in డిస్ప్లే ఉంది. ఎక్కువ బ్రైట్ నెస్ లేదు. అలాగే reflection వస్తుంది కొంచెం.(పక్కన ఇమేజ్ లో చూడండి.) వ్యూయింగ్ angles బాగానే అనిపిస్తున్నాయి.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

డిస్ప్లే పైన 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా ఉంది. బ్యూతిఫై ఫీచర్ ఉంది కాని  ఇందులో ఫేన్సీ ఫీచర్స్ ఇంకేమి లేవు.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

ఫ్రంట్ నుండి ఫోన్ చూడటానికి చాలా ఆర్డినరీ అనిపిస్తుంది. కాని సైడ్ అండ్ బ్యాక్ కవర్ వలన లుక్స్ అండ్ డిజైన్ పరంగా కొంచెం బాగుంది. సైడ్స్ మెటల్ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది లుక్స్ వైస్ గా. కాని కాదు. సైడ్స్ మరియి బ్యాక్ కవర్ కూడా ప్లాస్టిక్ బాడీ. అసుస్ జెన్ ఫోన్ 2 కు దీని కన్నా బలమైన బిల్డ్ ఉంది.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

13.2 MP కెమేరా తో సింగిల్ led ఫ్లాష్ ఉంది దీనిలో. దీనితో కొన్ని ఫోటోస్ తీయటం జరిగింది. డిసెంట్ ఇమేజెస్ వచ్చాయి కాని కలర్స్ కొన్ని డల్ గా అనిపిస్తున్నాయి.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

zopo స్పీడ్ 7 మొబైల్ నుండి  13.2 MP కెమేరా తో డిఫాల్ట్ సెట్టింగ్స్ లో తీసిన ఫోటో ఇది.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

ఇది కూడా zopo స్పీడ్ 7 మొబైల్ తో తీసిన ఇమేజ్.

zopo స్పీడ్ 7 : ఫస్ట్ ఇంప్రెషన్స్

2,500 mah బ్యాటరీ రిమూవబుల్. ఇది చాలా లేటెస్ట్ ఫోనులకు భిన్నంగా ఉంది. అన్నీ నాన్ రిమూవబుల్ బ్యాటరీ లను ఇస్తున్నాయి. అయితే దీనిని కొంతమంది పెద్ద విషయం లా చూస్తారు, కారణం, ఫోన్ తో ఎప్పుడూ డెవెలపర్ ఫ్లాషింగ్ పనులకు మరియు చిన్న బ్యాటరీ వస్తే, వేరే ఎక్కువ mah ఉన్న బ్యాటరీ కొని వాడుకోవటానికి.