oneplus 2 ఫోన్ మిడ్ ర్యాంజ్ బడ్జెట్ సెగ్మెంట్ లో టాప్ ఫోన్. అయితే దీనికి తలదన్నేలా మంచి ఫోన్ తయారు చేస్తున్నామని పబ్లిసిటీ చేస్తూ మన ఇండియన్ కంపెని - YU కొత్త మోడల్ yutopia ను లాంచ్ చేసింది అదే ప్రైస్ కు కాని దాని కన్నా ఒక రెండు మూడు ఎక్కువ ఫీచర్స్ తో. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు అందరూ దీనిపై కొన్ని questions తో ఉన్నారు. వీటికి ఇక్కడ answers ఇవటం జరిగింది. Q & A కోసం క్రిందకు స్క్రోల్ చేయండి.
YUtopia ఫ్లాగ్ షిప్ killer అని అనుకోవచ్చా?
కాదు. మైక్రోమాక్స్ సబ్ బ్రాండింగ్ లో వచ్చిన yutopia ఇప్పటివరకూ కంపెని నుండి వచ్చిన ఫోన్స్ లో బెస్ట్. కాని oneplus 2 వలె yutopia కూడా ఫ్లాగ్ షిప్ కిల్లర్ కాలేకపోయింది.
సేమ బడ్జెట్ లో ఉన్న oneplus 2 తీసుకోవాలా లేక yutopia తీసుకోవాలా?
oneplus 2. yutopia లో గ్రేట్ కెమేరా ఉంది. కాని సాఫ్ట్ వేర్ బాగా buggy గా ఉంటుంది. అందుకే వెనక బడింది.
yutopia ప్లస్ అండ్ మైనస్ లు ఏంటి?
ప్లస్ - 21MP కెమేరా
మైనస్ - os - cyanogen -చాలా బగ్స్ ఉన్నాయి.
దీనిలో ఉన్న స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్ heat అవుతుందా?
గేమ్స్ ఆడుతున్నప్పుడు మరియు వీడియోస్ ఎక్కవు సేపు షూట్ చేస్తున్నప్పుడు హిట్ అవుతుంది.
మరొక ఫోన్ తో కంపేర్ చేయకుండా దీనిని individual గా పరిగణిస్తే, yutopia మంచి ఫోనా కాదా?
కాదు. ఎందుకంటే - os లో బగ్స్ ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ కూడా క్రాష్ అవుతుంది. ఈ రెండూ చాలా ఇంపార్టంట్. ఫోన్ లో వాడేది అవే. ఫోన్ పెర్ఫార్మన్స్ ను కూడా బాగా ఆప్టిమైజ్ చేయలేదు సాఫ్ట్ వేర్. కాని ఇవి సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తో పోతాయి కదా?
ఇవి సాఫ్ట్ వేర్ బగ్స్ మాత్రమే కాబట్టి, అవుతాయి. కాని 25 వేలు పెట్టి ఫోన్ కొనేముందు సాఫ్ట్ వేర్ తో అన్నీ సాల్వ్ అవుతాయి అని మీరు నమ్మకంగా ఉంటే తీసుకోవచ్చు.
కాని YU బ్రాండ్ ఎటువంటి ఇండియన్ కంపెని చేయని మంచి attempt చేసింది. కచ్చితంగా ఇలాంటి మరిన్ని ఫోన్స్ ను తయారు చేయనుంది అనే నమ్మకం పెరుగుతుంది YU పై. ఇది ఇండియన్ కంపెని ను disappoint చేయటం కాదు, కేవలం దాని పనితనం పై రివ్యూ. పైన చెప్పినవి కూడా సాఫ్ట్ వేర్ బగ్స్ మాత్రమే. ఫోన్ హార్డ్ వేర్ లో కాదు. అతి త్వరలో కంప్లీట్ రివ్యూ వస్తుంది.