YU యుఫోరియా స్మార్ట్ ఫోన్ పై విడుదలైన మొదటిరోజునే టెక్ యూజర్స్ ను ఆకర్షించింది. Rs 6,999 లకు లభించనున్న యుఫోరియా గట్టి పోటీ ఇచ్చేలవుంది. యుఫోరియ పై రివ్యూ వ్రాసేలోపు ఫోన్ కెమేరా మరియు పెర్ఫార్మెన్స్ తెలుసుకుందాం.
పెర్ఫార్మెన్స్:
స్పెసిఫికేషన్స్ చుస్తే ఈ మూడు ఫోనులు స్నాప్ డ్రాగన్ 410 SoC మరియు ఎడ్రేనో 306 జిపియు లతో లభిస్తున్నాయి. యుఫోరియ మరియు లెనోవో లకు 2జిబి రామ్ ఉండగా, మోటో ఇ మాత్రం 1జిబి రాం తో లభిస్తుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం తదుపరి స్లయిడ్ కు వెళ్ళండి.
Antutu బెంచ్మార్క్:
బహుశా లెనోవో కు సొంత యూజర్ ఇంటర్ఫేస్ ఉండటంతో పాటు లెనోవో అనవసర అప్లికేషన్స్(బ్లోట్ వేర్) ఉండటం వలన మోటో మరియు యుఫోరియా ల కన్నా లెనోవో తక్కువ బెంచ్మార్క్ తో నిలుచుంది.
Geekbench 3:
గీక్ బెంచు 3 లో యుఫోరియా కొద్దిగా ఎక్కువ స్కోర్స్ ఇచ్చినప్పటికీ, మూడు ఫోన్లు దాదాపుగా ఒకే పెర్ఫార్మెన్స్ ను చూపించాయి.
Gfx బెంచ్ మాన్హాటన్:
ఆసక్తికరంగా గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ విషయంలో అడ్రినో 306 మోటో E 4జి పై ఎక్కువ సామర్థ్యం చూపించింది. దీనికి కారణం మోటో E కు చిన్న మరియు తక్కువ రిజల్యూషన్ డిస్ప్లే ఉండటం వలన. అందువలన మాన్హాటన్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ లో మూడు ఫోన్లు స్కోర్స్ అతి దగ్గరగా వచ్చాయి.
3D మార్క్ ఐస్ స్టార్మ్ ఎక్స్ట్రీమ్:
3D మార్క్ అనేది జిపియు కన్నా లోతుగా ఉండే బెంచ్మార్క్ స్కోరింగ్. 3D మార్క్ స్కోర్ విషయంలో మోటో యుఫోరియా మరియు లెనోవో కన్నా వెనుకబడింది. దీనికి కారణం మోటో E కన్నా వాటికి డబుల్ ఎక్సట్రా రామ్ ఉండటం వలనే.
కెమేరా:
మోటో E కు 5ఎంపి కెమేరా ఉండగా, యుఫోరియా మరియు లేనోవో A6000 ప్లస్ లకు 8ఎంపి వెనుక కెమేరాలు ఉన్నాయి. కెమేరా క్వాలిటీ గురించి మరింత తెలుసుకోవాలంటే తదుపరి స్లయిడ్లను చుడండి.
గమనిక: రాబోయే కెమేరా స్లయిడ్ చిత్రాలు క్రాప్ చేయబడినవి.
ఇండోర్ ఫ్లోరోసెంట్ లైట్లు:
ఎడమ నుండి కుడికి: మోటో E, లెనోవో A6000 ప్లస్, యు యుఫోరియా
మోటో E కన్నా కలర్ రిప్రోడక్షన్ మరియు ఫోటో లోని వివరాలను చూపించటంలో యు యుఫోరియా మెరుగైనది. కాని లెనోవో A6000 ప్లస్ ను దాటలేకపోయింది. xiaomi రెడ్మీ 2 తో కూడా సరితూగే ఫలితాలను ఇవ్వలేదు. మొత్తానికి యుఫోరియా కెమేరా ఈ టెస్ట్ లో నిరాశ పరిచింది.
కలర్స్:
పై నుంచి క్రిందకు: మోటో E(4జి), లెనోవో A6000 ప్లస్, యు యుఫోరియా.
యుఫోరియా నుండి తీసిన అన్ని ఫోటోలు మబ్బుగా కనిపిస్తున్నాయి. మీరు ఈ పిక్చర్స్ లో గమనిస్తే కచ్చితంగా యెల్లో, పింక్ మరియు రెడ్ కలర్స్ లో కాస్త క్వాలిటీ తగ్గుమొఖం పట్టినట్టు కనిపిస్తుంది.
బిల్డ్ మరియు డిజైన్:
డిజైన్ పరంగా కచ్చితంగా యుఫోరియా మిగతా రెండు ఫోన్ల కన్నా బాగుంది. యుఫోరియా అన్ని వైపులా, చుట్టూ ఉన్న మెటల్ ఫోన్ కి ప్రీమియం ఫీల్ తీసుకువచ్చింది. బిల్డ్ క్వాలిటీ విషయంలో అన్నిటికంటే మోటో E 4జి దే పైచేయి.
మందం మరియు సైజు:
మూడు ఫోన్లు పట్టుకోవటానికి సులభంగా ఉంటాయి కాని మోటో E మాత్రం చాలా కాంపాక్ట్ ఉంది. యుఫోరియా చుట్టూ నాలుగు కార్నర్ లలో రౌండ్ ఎడ్జ్ లు ఉన్నప్పటికీ, పట్టుకోవటానికి గ్రిప్ రబ్బర్ ఉండటం వలన మోటో E ఫోన్ బాగుంది.
సమస్యలు:
యుఫోరియా బలాలతో పాటు, బలహీనతలు ఉన్నప్పటికీ, ఈ ఫోన్ పై పూర్తిస్థాయి రివ్యూ చేసేవరకూ ఎటువంటి కొలిక్కి రాలేము. కాని యుఫోరియా లో కొన్ని ఇతర సమస్యలను తెలుసుకున్నాము.
డిస్ప్లే సమస్యలు:
యుఫోరియా డిస్ప్లే లో పింకిష్ రంగు కనిపిస్తుంది. మాములుగా యుఫోరియా షార్ప్ డిస్ప్లే తో లభిస్తుంది కాని, పింకిష్ రంగు అనేది దీర్ఘంగా చుస్తే కచ్చితంగా మీరు ఇబ్బందిగా పరిగణిస్తారు.
బటన్లు:
యుఫోరియా పవర్ బటన్ వాల్యూం బటన్స్ మధ్యన ఇవ్వటం జరిగింది. వాల్యూం బటన్స్ కన్నా పెద్దదిగా ఇవ్వటం వలన పవర్ బటన్ మా టెస్ట్ రివ్యూ ఫోన్ పై కాస్త బెంట్ అయ్యింది. దీర్ఘ కాల వాడుకలో ఇది మిమ్మల్ని విచార పరుస్తుంది.