4,999 రూ లకు మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ YU Yunique అనే మొబైల్ లాంచ్ చేసింది ఇండియాలో రెండు రోజులు క్రితం. ఇది రెడ్మి 2 కు సిమిలర్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. కంప్లీట్ రివ్యూ అందించే లోపు yunique పై మేము చేసిన క్విక్ రివ్యూ ను చూడండి.
రివ్యూ లోకి వెళ్ళే ముందు Key స్పెక్స్ చూడండి..
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410 RAM: 1GB డిస్ప్లే: 4.7 అంగుళాల 720 నిల్వ: 8GB కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమేరా, బ్యాటరీ: 2000mAh
డిజైన్ పరంగా ఇది xiaomi మి 4i అండ్ యుఫోరియా తో కంపేర్ చేస్తున్నాము.. మూడు ఓవర్ ఆల్ బాడీ డైమెన్షన్స్ చూడగలరు.
3 ఫోనులు సింగిల్ హ్యాండ్ లో వాడటానికి ఈజీగా ఉన్నాయి. కాని yunique లో ఉన్న 4.7 in డిస్ప్లే కారణంగా ఇది ఎక్కువ కాంపాక్ట్ గా రెండింటి కన్నా.
బటన్స్ layout కూడా చాలా ఫ్రీ గా అనిపిస్తుంది మూడింటిలో. యు సిరిస్ ఫోనులకు పవర్ కీ కొంచెం భిన్నంగా ఉంది. రెండు వాల్యూమ్ బటన్స్ మధ్యలో.
బిల్డ్ డిపార్ట్ మెంట్ లో యుఫోరియా టాప్ లో ఉంది. ఎందుకంటే దానికి మెటల్ బాడీ వస్తుంది ఫోన్ చుట్టూ. yunique కు ప్లాస్టిక్ బిల్డ్, కాని బాగుంది. మి 4i కు పోలి కార్బనేట్ బాడీ ఉంది. ధర పరంగా yunique బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది.
గీక్ బెంచ్ మల్టీ కోర్ synthetic కంపేరిజన్
యు yunique - 21422
యు యుఫోరియా - 23774
xiaomi మి 4i - 39741
AnTuTu synthetic బెంచ్ మార్క్ కంపేరిజన్
యు yunique - 1418
యు యుఫోరియా - 1476
xiaomi మి 4i - 2764
కెమేరా విషయాని వస్తే..
కలర్స్ accurate గా కనిపిస్తున్నాయి కొంచెం. Ample లైటింగ్ సన్ లైట్ కండిషన్స్ లో మంచి ఫోటోలను ఇస్తుంది.
అవుట్ డోర్ కాని డైరెక్ట్ సన్ లైట్ లేదు
డైనమిక్ ర్యాంజ్ లేదు అని చెప్పాలి. కానీ మళ్ళీ ప్రైస్ తో పోలిస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది.
Low లైట్
ఫోకస్ స్లో గా ఉంది. noise కనిపిస్తుంది.
మిగిలిన విషయాలలో యు yunique..
టాప్ లో ear piece అండ్ నోటిఫికేషన్ led ఉంది. 2MP ఫ్రంట్ కెమేరా కూడా ఉంది.
4.7 in HD 720P డిస్ప్లే. 4,999 రూ బడ్జెట్ లో HD డిస్ప్లే తో వస్తున్న ఫోన్ ఇదే.
8MP సింగిల్ led ఫ్లాష్ కెమేరా. యుఫోరియా ఫోన్ డిజైన్ కెమేరా లెన్స్ లా ఉంది.
బ్యాక్ సైడ్ matte ఫినిషింగ్ ఉంది. ఫింగర్ ప్రింట్ లను ఆకర్షిస్తుంది.
3.5 mm హెడ్ ఫోన్ జ్యాక్ టాప్ సైడ్ ఉంది. మైక్రో usb పోర్ట్ బాటమ్ లో ఉంది.
రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేస్తే, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్స్ తో వస్తుంది. 32gb మైక్రో sd కార్డ్ కూడా ఉంది.
2000 mah బ్యాటరీ మాత్రం నాన్ రిమూవబుల్. కంపెని మాటలు ప్రకారం 7 గంటలు పాటు టాక్ టైమ్ బ్యాక్ అప్ తో వస్తుంది ఇది.