మన ఓటుహక్కును వినియోగించుకోవడంతో పాటుగా, అనేకమైన అవసరాలకు ఉపయోగపడే, ఓటరు గుర్తింపు కార్డు సరైన వివరాలతో మరియు లేటెస్ట్ ఫోటో తో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, మీ ఓటరు కార్డు మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలు అన్ని కూడా ఒకే వివరాలతో ఉన్నాయా లేక ఏవైనా తప్పులు ఉన్నాయో గమనించడం మంచింది.
ఒకవేళ మీకు ఇటువంటి ఇబ్బంది మీ ఓటరు కార్డు మరియు ఇతర ద్రువీకర పత్రాలైన, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ మరియు ఇలాంటి మరిన్నివాటితో ఈ ఓటరు కార్డు వివరాలు సరిపోలి ఉండక పోయినట్లయితే, ఇక్కడ నేనందించిన వివరాల ప్రకారంగా, చాల సులభ పద్దతిలో మీరే సొంతంగా మార్చుకోవచ్చు.
ఓటరు కార్డులో వివరాలను సరిచేసుకునే పద్దతి
https://www.nvsp.in వెబ్సైటు ఎంచుకొని హోమ్ పేజిలోకి ప్రవేశించాలి. ఇక్కడ మీకు అకౌంట్ ఉన్నట్లయితే, LogIn చేయవచ్చు.
ఒకవేళ లేకపోతె మీకు అకౌంట్ లేకున్నట్లయితే, మీ మొబైల్ నబరుతో కొత్త అకౌంట్ క్రియేట్ చేయవచ్చు.
తరువాత, ఇక్కడ మీరు అనేకరకాల ఎంపికలను చూడవచ్చు, కానీ మీరు మాత్రం కన్ను గుర్తుతో చూపిస్తున్న "Form-8" పైన నొక్కండి
ఇక్కడ మీరు పైన ఎడమ భాగంలో మీకు కావాల్సిన లేదా మీకు నచ్చిన భాషను ఎంచుకోవడం ద్వారా ముందుకు సాగవచ్చు.
ఆతరువాత, ఇక్కడ మీరూ మీ రాష్ట్రము, తరువాత జిల్లా మరియు అసంబ్లీ లను ఎంచుకోండి. దాని క్రింద మీ వివరాలైనటువంటి, మీ పేరు మరియు ఇంటిపేరు ఇంగ్లీషులో రాయండి అది పక్కనున్న గళ్ళలో తెలుగులో వస్తుంది
మీ EPIC(ఓటరు కార్డు నంబర్) నంబరు కూడా సూచించిన దగ్గర ఎంటర్ చేయండి. తరువాత "ఫోటోగ్రాఫ్" అప్షన్ ఎంచుకొండి.
ఇక్కడ (e) కాలంలో మీరు సరిచేసుకోవాల్సిన వివరాలకై సంబంధించిన బాక్స్ దగ్గర టిక్ చేయాలి (ఒక్క సారి మూడు బాక్స్ మాత్రమే టిక్ చేయవచ్చు)
మీరు టిక్ చేసిన బాక్సుల ప్రకారంగా వివరాలను నమోదు చేయండి (ఉదా : పేరు, అడ్రస్, వయసు, పుట్టిన తేది, మొదలగునవి)
చివరిన సూచించిన బాక్స్ లలో మీ ఈమెయిలు ID మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. Place బాక్సులో మీ ప్రాంతం మరియు Captcha బాక్సులో అందించిన ఇంగ్లీష్ అక్షరాలను పక్కనున్న పెట్టెలో ఎంటర్ చేసి "Submit" చేయండి.