ఇంతకుముందర 23 న విడుదల అయిన ఈ రెడ్మి నోట్ 4 ఒక సంచలం సృష్టించి నిముషాలలో అవుట్ అఫ్ స్టాక్ అయ్యిన విషయం అందరికి తెలిసిన విషయమే ,
అప్పుడు మిస్సయిన వారికి ఇదిఒక మంచి అవకాశం . ఈ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ 30 తారీఖు 12 గంటలనుండి స్టార్ట్ అయ్యాయి . వీటికి ఎటువంటి రెజిస్ట్రేషన్స్ అవసరం లేదు . స్టాక్ వున్నంతవరకు సేల్స్ కొనసాగుతాయి . దీనియొక్క ఫీచర్స్ చూడండి
నోట్ 3 లాగానే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 లాగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐ
క్యాండీ బార్ డిజైన్‌తో వస్తోంది. యునిమెటల్ బాడీ డిజైన్‌తో ఇటీవల మార్కెట్లోకి వస్తోన్న చాలా వరకు ఫోన్‌లలో ఈ తరహా డిజైన్‌ను మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ అంచులు మరింత గుండ్రంగా అనిపిస్తాయి. రెడ్మీ నోట్ 4 ఫోన్ ను 174 గ్రాముల బరువు తో పొందుపరిచారు
ఈ స్మార్ట్ ఫోన్‌లో మెటల్ డిజైన్, 2.5డీ కర్వ్ డ్ గ్లాస్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉన్న సంగతి తెలిసిందే. 2 జీబీ ర్యామ్ 32 జీబీ మెమొరీ ఉన్న ఫోన్ ధర రూ. 9,999 కాగా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ధర రూ. 10,999గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంటాయి .
2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.
రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది.5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.
రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది మరియు 3 వ విడత సేల్స్ ఫెబ్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి