Xiaomi రెడ్మి నోట్ 3 vs LeEco Le1S అండ్ రెడ్మి నోట్ 3 యొక్క specifications గతంలో చూశాము. అయితే వీటి indepth detailed comparison చేస్తున్నాము. ఈ లోపు డిజైన్ అండ్ బాడీ వైజ్ గా ఈ మూడింటి యొక్క కంపేరిజన్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
మూడు డిఫరెంట్ ప్రొసెసర్ లతో వస్తున్నాయి. అయితే మూడు 5.5 in FHD డిస్ప్లే లతో ఫుల్ మెటల్ బాడీ కలిగి ఉన్నాయి కామన్ గా.
డిస్ప్లే సెగ్మెంట్ లో మూడు 5.5 in IPS panels కలిగి ఉన్నాయి. స్క్రీన్ to body ratio లో విషయంలో Le 1S బాగుంది. మూడు మంచి వ్యూయింగ్ angles ఇవ్వగా రెడ్మి నోట్ 3 లో బ్రైట్ డిస్ప్లే కలిగి ఉంది.
మోడు మెటల్ వలన మంచి గ్రిప్ తో ఉన్నాయి కాని Le1S లో బెటర్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే మిగిలిన వాటి కన్నా thin బాడీ కూడా.
మూడింటికీ ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక ఉన్నాయి. రెడ్మి అండ్ Le 1S కు సర్కులర్ స్కానర్ ఉండగా హానర్ కు square షేప్ లో ఉంది. అయితే ఇది ఎటువంటి ఇబ్బంది ఇవటం లేదు.
ఫోన్స్ యొక్క బిల్డ్ mostly మెటల్. కాని పైకా క్రిందా రేడియో antenna ల కొరకు ప్లాస్టిక్ ఇవటం జరిగింది. అలాగే Le1s కు కెమేరా సెన్సార్ పైన ఉండగా మిగిలిన రెండింటికీ మధ్యలో ఉంది కెమేరా.
హానర్ అండ్ Le1s కు క్రింద స్పీకర్స్ ఉండగా రెడ్మి మాత్రం ఓల్డ్ డిజైన్ లోనే వెనుక ఇచ్చింది స్పీకర్స్ ను.
మూడింటిలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. కాని sd కార్డ్ స్లాట్స్ విషయంలో డిఫరెన్స్ ఉంది. LE1S లో sd కార్డ్ సపోర్ట్ లేదు, రెడ్మి నోట్ 3 లో ఉంది కాని హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది అంటే ఒకే స్లాట్ లో అయితే సెకెండ్ సిమ్ లేదా sd కార్డ్ పెట్టుకోగలరు. హానర్ 5x లో మాత్రం sd కార్డ్ కు ప్రత్యేకంగా స్లాట్ ఉంది. XIAOMI REDMI NOTE 3 కంప్లీట్ తెలుగు VIDEO రివ్యూ లింక్