తాజాగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైన Xiaomi మి 4i మరియు అసుస్ జెన్ ఫోన్ 2 రెండు మొబైల్స్ విపరీతమైన టాక్ ను తెచ్చుకున్నాయి. డిజిట్ టెస్ట్ ల్యాబ్ లోకి వచ్చిన ఆసుస్ జెన్ ఫోన్ 2 (2జిబి) ను xiaomi మి 4i తో కెమేరా మరియు బెంచ్ మార్క్స్ తో కంపేరిజన్ చేసాము.
AnTuTu బెంచ్ మార్క్ ఆసుస్ జెన్ ఫోన్ లో, Xiaomi మి 4i కన్నా కొంచెం ఎక్కువుగా వచ్చింది. రెండు ఫోన్లలో 1080P డిస్ప్లే లు ఉన్నాయి, కాని అసుస్ కి కొంచెం పెద్ద స్క్రీన్ ఉంది.
మి 4i ను 12,999 రూ. లకు ఇక్కడ కొనండి.
ఆసుస్ జెన్ ఫోన్ 2 ( 2 జిబి) 12,999 రూ. లకి ఇక్కడ కొనండి
గీక్ బెంచ్ 3 టెస్ట్ లో సింగిల్ కోర్ మరియు మల్టి కోర్ గా ప్రాసెసర్ టెస్టింగ్ డివైడ్ అవబడుతుంది. సింగల్ స్కోర్ లో అసుస్ ఎక్కువ స్కోర్ ను ఇచ్చింది. మల్టి కోర్ లో మి 4i అక్టో కోర్ ప్రాసెసర్ గెలిచింది.
GPU పెర్ఫార్మెన్స్ లో మి 4i ఆసుస్ కన్నా చాలా వెనుకబడి ఉంది. పవర్ వి ఆర్ ప్రాసెసర్ GPU ను వాడటం జరిగింది జెన్ ఫోన్ లో
3D మార్క్ టెస్ట్ అనేది గ్రాఫిక్స్ కోసం చేసుకునే టెస్ట్. మొత్తం ఫోన్ పెర్ఫార్మెన్స్ లో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆసుస్ లో మి4i కన్నా అధికంగా ఉంది.
కెమేరా
left సైడ్ - Xiaomi మి 4i , right సైడ్ - ఆసుస్ జెన్ ఫోన్ 2
కెమేరా విభాగంలో అసుస్ మి 4i ను మించలేకపోయింది. అసుస్ లో మి 4i ఫోటో లో ఉన్నంత డిటేలింగ్ క్వాలిటీ లేదు. మి 4i 15 వేల రూ. ఫోన్లలో బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ గా ఇంకా నిలిచే ఉంది. అలాగని అసుస్ బ్యాడ్ కెమేరా కాదు, కానీ మి 4i అంత బెస్ట్ కెమేరా అవుట్ పుట్ లేదు.
టాప్ - Xiaomi మి 4i, బాటమ్ - అసుస్
ఈ ఫోటోలో అసుస్ యెల్లో, పింక్ మరియు బ్లూ కలర్స్ లో లైట్ గా కలరింగ్ వాష్ అవుట్ అయింది. బహుశా ఫ్లోరోస్సెంట్ లైట్స్ లో ఫోటోని తీసేటప్పుడు అసుస్ ఇలా ఇబ్బంది పడుతున్నట్లు ఉంది.
విడియో టెస్ట్ లో అసుస్ బ్యాటరీ 14 గంటలు పాటు బ్యాక్ అప్ వచ్చింది. ఇది oneplus వన్ మరియు మి4i కన్నా ఎక్కువ బ్యాక్ అప్. ఇంటెల్ ప్రాసెసర్ విడియో స్ట్రీమింగ్ లో మంచి బ్యాటరి బ్యాక్ అప్ ఇస్తుంది.
గీక్ బెంచ్ 3 బ్యాటరీ టెస్ట్ లో రెగ్యులర్ యూసేజ్ లో మళ్ళీ జెన్ ఫోన్ మి 4i అంత బ్యాటరీ బ్యాక్ అప్ ఇవ్వలేకపోయింది.
రెండు ఫోన్లలో మేజర్ గా కెమేరా మరియు పెర్ఫార్మెన్స్ లో తేడాలు కనిపిస్తున్నాయి. త్వరలో మరింత డెప్త్ రివ్యూ తో మళ్ళీ వస్తాము.
మి 4i ను 12,999 రూ. లకు ఇక్కడ కొనండి.
ఆసుస్ జెన్ ఫోన్ 2 ( 2 జిబి) 12,999 రూ. లకి ఇక్కడ కొనండి