Xiaomi నుండి అస్సలు ఫోన్ కు ఇరువైపులా మరియు పైన ఎటువంటి బాడీ లేకుండా బెజెల్ లెస్ స్మార్ట్ ఫోన్ - Mi MIX లాంచ్ అయ్యింది. అయితే ఇది ఇండియన్ మార్కెట్ లోకి రావటం లేదు. అయినా మీరు ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో మరిన్ని కంపెనీలు ఇలాంటి ఫోనులను లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్ కేవలం నమూనాల గానే ఉండేవి, చైనా లో ఇప్పుడు ఈ ఫోన్ సేల్స్ కూడా అవుతుంది. క్రింద కు స్క్రోల్ చేయండి.
మంచి డిజైన్, బ్యూటిఫుల్ లుక్స్ with సిరమిక్ బాడీ + గ్రేట్ స్పెక్స్ దీని సొంతం.
DIsplay: 6.4-inch, 2040 x 1080p
SoC: Qualcomm Snapdragon 821
RAM: 6GB
Storage: 256GB
Camera: 16MP, 5MP
Battery: 4400mAh
OS: Android 6.0
ఫోన్ కు ప్రధాన హైలైట్ ఇప్పటివరకూ చెప్పుకున్నట్లు స్క్రీన్ కు పైనా, సైడ్స్ లో ఎటువంటి బాడీ ఉండదు, దీనిని bezel less అంటారు. దాదాపు 91.3% body to screen రేషియో.
బెజేల్స్ లేకపోవటం వలన ఫోన్ పెద్దది అయినా సింగిల్ హ్యాండ్ usage కు అనువుగా ఉండాలి. కాని ఈ ఫోన్ 6.4-inch display కలిగి ఉంది. అందువలన బెజెల్స్ లేనప్పటికీ వన్ హ్యాండ్ తో స్క్రీన్ ప్రతీ కార్నర్ కు మీ చేతి వ్రేళ్ళను పెట్టలేరు. ప్రత్యేకంగా 3 navigation keys కూడా అందటంలేదు. దానికి కొంతమేరకు సొల్యూషన్ ఇస్తూ (Quick Ball ఫీచర్ - సైడ్ నుండి నేవిగేషన్ కిస్ వాడుకోగలరు) ఇది ఒరిజినల్ aspect ratio(16:9) ను 17:9 కు మారుస్తుంది.
పైన కూడా బాడీ లేకపోవటం వలన ఫోన్ యొక్క కాల్ - ear piece ఉండదు, వెనుక నుండి స్క్రీన్ ద్వారా వినిపిస్తాయి అవతల వ్యక్తి మాటలు. ఇది peizoelectric ceramic actuator టెక్నాలజీ.
ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా కూడా ఫోన్ క్రింద భాగంలో బాడీ ఉంటుంది, అక్కడకు షిఫ్ట్ అయ్యింది. ఇది 5MP కెమెరా. మంచి ఫోటోస్ ఇస్తుంది. సేల్ఫీస్ తీసుకునేటప్పుడు ఫోన్ ను తలకిందులుగా పెట్టుకోగలరు.
ఫోన్ గ్లాస్ లేదా మెటల్ బాడీ తో కాకుండా సిరామిక్ బాడీ కలిగి ఉంది. సో టాబుల్ మీద నుండి చేతిలోకి ఫోన్ తీసుకుందాము అన్నా time పడుతుంది. బాగా slippery గా ఉంటుంది ఫోన్.
వెనుక 16MP కెమెరా ఉంది. అయితే ఇది అంతగా బాలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఫోన్ లో అతి వీక్ అయిన విషయం కెమెరా.
ఫోన్ లో 4400mAh battery ఉండటం వలన ఒక రోజు ఫుల్ గా వస్తుంది బ్యాక్ అప్. వెనుక బాడీ పైన చేతి వేలిముద్రలు బాగా కనిపిస్తుంటాయి.
ceramic టెక్నికల్ గా బాగా గట్టి పదార్థం. అంత తేలికగా విరగదు. కాని Mi Mix కు స్క్రీన్ డిస్ప్లే చివర్లలో ఏమి ఉండకపోవటం వలన ఫోన్ క్రింద పడితే డిస్ప్లే బ్రేక్ damage అవుతుంది. కంపెని ఈ విషయాన్ని ముందే గ్రహించి ఫోన్ తో పాటు ఫ్రీ గా leather case అందిస్తుంది. ఇది కూడా ప్రీమియం గా ఉంది.