Xiaomi రెండు కొత్త స్మార్ట్ ఫోనులు లాంచ్ చేసింది. చైనాలో. Mi MIX మరియు Mi Note 2. అయితే దురదృష్టవశాత్తూ ఇవి ఇండియన్ మార్కెట్ లోని ఎంటర్ అవటం లేదు అని తెలిపింది కంపెని. అయితే మేము చైనా లోని లాంచ్ ఈవెంట్ లో ఉండటం వలన వాటి పిక్స్ మీకు షేర్ చేయగలగుతున్నాము. Mi Mix బెజేల్ లెస్ స్క్రీన్ తో వస్తున్న కాన్సెప్ట్ ఫోన్, Mi Note 2 డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో డ్యూయల్ edge స్క్రీన్ కలిగి ఉంది. మొబైల్ రీడర్స్.. క్రిందకు స్క్రోల్ చేయండి పిక్స్ చూడటానికి.
ముందుగా Mi Mix ఫోన్ గురించి చూద్దాం. firstly కంపెని దీనిని లాంచ్ కాన్ఫరెన్స్ లో కాన్సెప్ట్ మోడల్ గా విడుదల చేసింది. కానీ వెంటనే ఫోన్ ప్రొడక్షన్ లో కూడా ఉంది అని తెలిపింది. అంటే ఈ కాన్సెప్ట్ ఫోన్ ను కొనటానికి కూడా అవుతున్నట్లు తెలిపింది. టోటల్ రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 4GB RAM and 128GB storage మరొకటి 6GB RAM, 256GB of storage. Prices Rs.34,000 రూ నుండి స్టార్ట్.
MI Mix - క్రింద స్పెక్స్ చూడగలరు..
Display: 6.4-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 821
RAM: 4/6GB
Storage: 128/256GB
Camera: 16MP
Battery: 4400mAh
Mi Mix ఫోన్ లో ఉన్న మెయిన్ highlight edge to edge డిస్ప్లే. 91.3 స్క్రీన్ to బాడీ రేషియో ఉంది ఫోన్ లో..
ఫోన్ స్లిమ్ గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా ను పైన నుండి క్రిందకు షిఫ్ట్ చేశారు.
పైన పూర్తిగా బాడీ లేకపోవటం వలన cantilever piezoelectric technology ద్వారా ear స్పీకర్ ఆడియో ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. ఇటువంటిదే గూగల్ గ్లాస్ లో వాడటం జరిగింది.
256GB వేరియంట్ లో 18K గోల్డ్ accents ఉంటాయి కెమెరా module మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ చుట్టూ. మిగిలిన ప్రదేశం అంతా glossy Piano black ఫినిషింగ్ ఉంది.
దీనితో పాటు రిలీజ్ అయిన మరొక పెద్ద లాంచ్ - Mi Note 2. ఇది Note రేంజ్ ఫోనుల్లో Xiaomi నుండి వచ్చిన రెండవ Note మోడల్.(రెడ్మి నోట్స్ వేరు, ఇది Mi నోట్). 5.7-inch display తో stylus లేకుండా వస్తుంది ఫోన్.
Mi Note 2 specifications
Display: 5.7-inch, 1080 x 1920
SoC: Qualcomm Snapdragon 821
RAM: 4/6GB
Storage: 64/128GB
Camera: 22.56MP
Mi నోట్ 2 లో curved డిజైన్ ఉంది. అలాగే ఫ్రంట్ లో కూడా డ్యూయల్ edge curved డిస్ప్లే ఉంటుంది. చూడటానికి రీసెంట్ గా మూసివేయబడ్డ మోడల్... సామ్సంగ్ నోట్ 7 లా ఉంది.
5.7-inch 2K డిస్ప్లే లోమంచి బ్రైట్ నెస్ మరియు కలర్ saturation ఉంది. డిస్ప్లే క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.. ఇది home బటన్ లా కూడా పనిచేస్తుంది.
Mi Note 2 లో చాలా క్లిన్ డిజైన్ ఉంది. గతంలో Mi నోట్ 2 డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని అన్నారు. కాని దీనిలో సింగిల్ కెమెరా సెట్ అప్ మాత్రమే ఉంటుంది.
వెనుక వైపు 22.56MP Sony IMX318 sensor ఉండగా ఫ్రంట్ లో 8MP ఉంది కెమెరా. వెనుక కెమెరా లో PDAF ఉంది కాని OIS (optical image stabilization) లేదు.. దీనికి బదులు EIS (Electronic image stabilization) ఉంది ఫోన్ లో. 4K వీడియో షూటింగ్ కూడా చేయగలరు.