సరికొత్త ఫోన్లతో సందడి చేస్తున్న షియోమి నుంచి మరొక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుందని సమాచారం . కాకపోతే షియోమి Mi 6 ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో షియోమి షాకిచ్చింది.
యిపుడు కొత్తగా ఈ ఫోన్ ఇంకా లాంచ్ చేయటం లేదని తెలిపింది ,దీని యొక్క ధర మరియు ఫీచర్స్ గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తున్నాయి .
ఈ ఫోన్ 3 వేరియంట్ లలో వస్తుందని సమాచారం . ఆన్లైన్ లో పుకార్ల ప్రకారం దీని బాడీ విషయానికి వస్తే షియోమి Mi 6 ఫుల్ సిరామిక్ బాడీతో వస్తోంది, 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో 218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ లో రానుంది .
మరియు డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ గా రూపొందించింది.రెండు స్నాప్ డ్రాగెన్ 835 చిప్సెట్ , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి.ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8, 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ వుంది
దీని ధర చూసినట్లయితే స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్ సుమారుగా రూ. 24,800 కి మరియు డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ రూ 29,800 ధరకి మరియు మీడియా టెక్ ప్రాసెసర్ ఎంఐ 6 వేరియంట్ సుమారుగా రూ 19,800 ధరకి అందుబాటులోకి రానుంది.