పాస్‌వర్డ్ ఏమిటి వాటితో మాకు ప్రమాదం ఏమిటి అనుకుంటున్నారా? విషయం వింటే మీరే ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే, ప్రతిఒక్కరూ కూడా వారి వారి పాస్‌వర్డ్ లను సెట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటారు.
అయితే, మనలో చాలామంది వారి ఫోన్, ఇమెయిల్, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో సహా మరిన్ని వాటికి ఒకేవిధమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు.
అవి ఏమిటి అని ఆలోచనలో పడ్డారా? దీని కోసమే ఒక సెక్యూరిటీ సంస్థ గుర్థించిన అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్ జాబితాను వెల్లడించింది.
మరి, ఆ ప్రమాదకరమైన పాస్‌వర్డ్ లిస్ట్ మరియు వాటి కథ ఏమిటో తెలుసుకుందామా..!
యునైటెడ్ కింగ్డమ్ (UK) యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది.
వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించింది. అసలు కారణం ఏమిటంటే, కేవలం గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండడానికి ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది.
వాస్తవానికి, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందని చాలా సులభంగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ప్రమాదకరం అని కూడా ఈ సంస్థ పేర్కొంది.
లిస్ట్ లో అందించిన అత్యంత ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌లను ఈ క్రింద చూడవచ్చు.