Whatsapp: ప్రపంచ వ్యాప్తంగా జనప్రిమ మెసేజింగ్ యాప్ గా ప్రజల మనసులను చోరగొన్న యాప్ వాట్సాప్, అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినియోగదారులకు అందిస్తున్న ఫీచర్లు, ప్రైవసీ మరియు సెక్యూరిటీ సిస్టమ్ వలన Whatsapp గొప్ప ఫాలోయింగ్ తో ముందంజలో వుంది. మరి ఇంత గొప్ప ప్రయోజనాలను అందిస్తున్న Whatsapp యొక్క లేటెస్ట్ బెస్ట్ ఫీచర్స్ మరియు బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ పైన ఒక లుక్కెద్దామా.
వాట్సాప్ యూజర్లు కేవలం ఒక ఫోన్ లో మాత్రమే వారి మొబైల్ నంబర్ తో వారి వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం వుంది. అయితే, వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ తో డ్యూయల్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ అకౌంట్ వాడకం మరింత సులభం అవుతుంది.
రెండు ఫోన్లలో ఒకే మొబైల్ నంబర్ తో వాట్సాప్ ను ఉపయోగించాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనికోసం మీ సెకండరీ మొబైల్ లో వాట్సాప్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. ముందు నుండే యాప్ ఉంటే దాన్ని డిలీట్ చేసి తిరిగి ఇన్స్టాల్ చేయండి.
ముందుగా యాప్ ను ఓపెన్ చేసి లాంగ్వేజ్ ను ఎంచుకోండి. తరువాత, Agree And Continue పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అప్షన్ లో పైన ఉన్న మూడు చుక్కల పైన నొక్కి ఇక్కడ కనిపించే 'Link a Device' ను ఎంచుకోండి. ఇక్కడ మీకు QR Code కనిపిస్తుంది.
ఇక్కడ మీరు మీ ప్రైమరీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ యాప్ నుండి ఈ QR Code ని స్కాన్ చేయండి. దీనికోసం, మీ వాట్సాప్ యాప్ లో కంటాక్స్ పైన ఉన్న మూడు చుక్కల పైన నొక్కాలి. ఇక్కడ మీకు link divice అప్షన్ కనిపిస్తుంది.
ఇంకేముంది, మొదటి ఫోన్ తో రెండవ ఫోన్ QR Code ను స్కాన్ చేయడం ద్వారా ఈ ఫోన్ కనెక్ట్ అవుతుంది. అంతే, ఇప్పుడు రెండు ఫోన్లలో కూడా ఒకే నంబర్ తో వాట్సాప్ పనిచేస్తుంది.
నంబర్ సేవ్ చేయకుండా Whatsapp లో మెసేజ్ సెండ్ చేసే బెస్ట్ ట్రిక్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఇక్కడ చూడండి. నంబర్ ను సేవ్ చెయ్యకుండగానే చాలా సింపుల్ గా మెసేజ్ ను సెండ్ చేసే మూడు ట్రిక్స్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అందించాను.
ముందుగా మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న నంబర్‌ను మీకు మీరే సెండ్ చేయండి. ఇప్పుడు మీరు సెండ్ చేసిన నంబర్‌పై ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఇందులో, చాట్, కాల్ మరియు యాడ్ నంబర్ 3 అప్షన్స్ ఉంటాయి. వీటిలో, మొదటి అప్షన్ Chat +(Number) ను ఎంచుకోండి.
మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న Whatsapp గ్రూప్ లోని వ్యక్తి పేరు పై ఒకసారి నొక్కండి. ఇప్పుడు మీ ముందు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మీ అవసరం ప్రకారం ఒక అప్షన్ ఎంచుకోండి.
ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://wa.me/country-code-phone-number అనిటైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కొత్త పేజీ తెరవబడుతుంది. ఇక్కడ Continue to chat పై నొక్కండి మరియు ఇప్పుడు whatsapp chat box ఓపెన్ అవుతుంది. అంతే, ఇక్కడ మీరు మీ చాట్ ను స్టార్ట్ చేయవచ్చు.
ప్రస్తుత కాలంలో మనం ఎక్కువగా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరికీ ఎక్కువ డేటా మరియు ఇంటర్నెట్ వేగం అవసరం అవుతాయి. అందుకే, దీనికోసం కొన్ని మంచి పరిష్కారాలను చూడడం మంచింది. తద్వారా వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.
మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి. ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.
అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు. దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.
అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.
Whatsapp యాప్ లో చాలా ఫీచర్లు త్వరలోనే జతచేయనున్నట్లు తెలుస్తోంది. తన వినియోగదారులకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీ మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జత చేసే వాట్సాప్ ఇప్పుడు కూడా అదే దారిలో కొత్త ఫీచర్లను జత చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే టెస్టింగ్ కూడా మొదలు పెట్టింది.
వాటప్ లో కొత్తగా పరిచయం చైయబోతున్న ఫీచర్లలో Search messages by date, వీడియో కాల్స్ కోసం PiP మరియు వాట్సాప్ డెస్క్ టాప్ పైన Call tab వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురావడానికి చూస్తోంది.
అంతేకాదు, డిసప్పియరింగ్ మెసేజీల పైన బుక్ మార్క్ ను గుప్పించే ఫీచర్ ను కూడా జత చేయాలనీ వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్లు కనుక వాట్సాప్ లో యాడ్ అయితే, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందుతుంది.
అలాగే, ఇప్పటి వరకూ డెస్క్ టాప్ మోడ్ పైన లేని 'Calling Tab' ను కూడా అందిస్తుంది. వీడియో కాల్స్ కోసం PiP మోడ్ ను తీసుకు వచ్చే పనిలో ఉన్నా ఇది iPhone యూజర్ల కోసం ముందుగా అందుబాటులోకి వస్తుంది.
అంతేకాదు, వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్ధం మరికొన్ని ఇతర కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ యాప్ లో జత చెయ్యాలని చూస్తునట్లు తెలుస్తోంది.
ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి ఆ స్మార్ట్ ఫోన్ల పూర్తి వివరాలు కోసం చూస్తున్నారా? అయితే, ఇక్కడ అందించిన లింక్ పైన క్లిక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం Click Here
ఆధార్ అప్డేట్: మీ పేరు మీద ID Proof లేకున్నా ఆధార్ కార్డ్ లో ఈ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.!
పూర్తి సమాచారం కోసం Click Here