ఇండియాలో వాట్సప్‌కు 16 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు దాదాపు అన్ని భాషలలోను అందుబాటులో వుంది ,
వాట్స్ ఆప్ ఇప్పుడు మన జీవితం లో ముఖ్య భాగం . ఇప్పుడు ఒక ఫీచర్ తో మనకు దగ్గర అవబోతుంది
ఈ కొత్త ఫీచర్ ద్వారాగా మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో , ఎంత దూరం లో ఉన్నారనేది సులభంగా తెలుసుకోవచ్చు . వాబీటాఇన్ఫో ఈ విషయాన్ని తెలియ చేసింది
మెయిన్ గ వాట్స్ ఆప్ లో లైవ్ లొకేషన్ ఆప్షన్ ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకోసం ‘షో మై ఫ్రెండ్స్' అనే ఆప్షన్‌ను ఆడ్ చేస్తున్నారు .దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది
దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్దేశించుకునే వీలు కల్పిస్తున్నారు. స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది
దారి తెలియని సమయంలో స్నేహితుడు ఎక్కడున్నాడనే విషయం చాలా సులభంగా తెలుసుకోవచ్చని సమాచారం దీనికి ఇంకా సమయం వుంది ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫీచర్ ఐవోఎస్ బీటా వర్షన్ 2.17.3.28, ఆండ్రాయిడ్ 2.16.399, ఆపై వెర్షన్లలో పనిచేస్తుంది. కావాలంటే దీనిని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. వాబీటాఇన్ఫో ఈ విషయాన్ని తెలియ చేసింది