స్మార్ట్ ఫోన్! ఇది శరీరం లో ఒక భాగం అయిపోయిందా అనేటట్లుగా ఉంది ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచం. స్మార్ట్ ఫోన్ కొనటం అనే అనుభవం లేని వారు ఉండటం ఆశ్చర్యం. అంతగా నిత్య జీవితంలో అవసరం గా మారిపోయింది. కాని చాలామందికి స్మార్ట్ ఫోన్ తీసుకోవటంలో కొన్ని మెలుకువలు తెలియక అనవసర ఖర్చు మరియు కొన్న తరువాత ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటున్నారు. సో అలాంటి ఇబ్బందులు పడే వారికీ ఇక్కడ కొన్ని తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు. క్రిందకు స్క్రోల్ చేయండి. నోట్: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
TIME :
చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ విషయం time. మీరు స్మార్ట్ ఫోన్ కొందామనుకుంటే ఖచ్చితంగా దానికంటూ కొంత సమయం కేటాయించాలి. డబ్బులు సమకూరాయి కదా అని వెంటనే బండి స్టార్ట్ చేసి బయటకు వెళ్లి ఫోన్ కొనటం కరెక్ట్ కాదు, అలాగే ఆన్ లైన్ అయినా సరే అనుకున్న వెంటనే కొనటం మంచిది కాదు. మీరు ఆన్ లైన్ లో కొత్తగా లాంచ్ అయిన మరియు వివిధ రిలేటివ్ budget ఫోన్లపై రీసర్చ్ చేయాలి. మీరు హార్డ్ కోర్ స్మార్ట్ ఫోన్ users అయితే మినిమమ్ one month రీసర్చ్ చేయాలి. రీసర్చ్ లేకుండా ఫోన్ కొనటం వందకి వంద శాతం కరెక్ట్ కాదు. ఓపిక గా ఉండి అలవాటు చేసుకుంటే ఎక్కువ కాలం సంతృప్తిగా గడిపే ఫోన్ సొంతం చేసుకోగలరు.
SPECIFICATIONS :
స్పెక్స్ high గా ఉంటే స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ గా ఉంటుంది అనేది 70% కంప్లీట్ గా కరెక్ట్ జడ్జిమెంట్ కాదు. పెర్ఫార్మన్స్ అనేది హార్డ్ వేర్, OS అండ్ రామ్ management వంటి వివిధ విషయాలపై ఆధారపడి ఉంటుంది. సో కేవలం high specs ఉన్నాయని ఎటువంటి రీసర్చ్ లేకుండా క్రేజీగా వేలు పెట్టి ఫోన్ తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇందుకు ఉదా oneplus 2 (హార్డ్ వేర్ బాగుంటుంది, కాని ఆక్సిజన్ OS వలన చాలా ఇబ్బందులు వచ్చేవి అప్పట్లో), అండ్ Xiaomi ఫోనులు. MIUI OS చాలా కస్టమైజేషన్ తో వస్తుంది. అందువలన వాటిలో 3GB రామ్ ఉన్నప్పటికీ, ఫ్రీ రామ్ చాలా తక్కువగా ఉంటుంది. కాని ఎటువంటి customization లేకుండా ఒరిజినల్ stock ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ తో వచ్చే 2GB ఫోనుల్లో ఫ్రీ రామ్ బాగుండే అవకాశాలుంటాయి. ఫ్రీ రామ్ ఎంత ఎక్కువ ఉంటే మీరు యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు మరియు ఇతర విషయాల్లో అంత ఫాస్ట్ గా ఉంటుంది ఫోన్. హార్డ్ వేర్ తో సాఫ్ట్వేర్ బాగా optimise అవ్వాలి. సో ఈ విషయం తెలియటం వలన నెక్స్ట్ టైం మీరు కొంచెం high end స్పెక్స్ ఉన్నా, ఆ ఫోన్ మీకు కంప్లీట్ గా నచ్చక, మరో వైపు కొంచెం తక్కువ స్పెక్స్ ఉండి, మీకు బాగా నచ్చిన ఫోన్ ఉన్నప్పుడు, రెండింటిలో ఏది తీసుకోవాలో కన్ఫ్యూషన్ ఉంటే, క్లియర్ గా మీ చాయిస్ ను కన్ఫ్యూషన్ లేకుండా ప్రిఫర్ చేసుకోగలరు..
AFTER SALES SERVICE :
దాదాపు 90% అన్ని ఫోనులకు సర్వీస్ సెంటర్స్ ఉంటున్నాయి(అని చెబుతున్నాయి కంపెనీలు). వాళ్ళు చెప్పేది నిజమే కావచ్చు, కాని సెంటర్స్ సంఖ్య రాష్ట్రానికి 1 నుండి 5 ఉండటం ఏ మాత్రం ఉపయోగకరం కాదు. సో మీ ఏరియా లో మీకు అందుబాటులో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కప్పుడైతే ఫోన్ జాగ్రత్తగా వాడితే నిజంగా వన్ ఇయర్ లో ఎటువంటి కంప్లైంట్స్ వచ్చేవి కావు, కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా వాడుతున్నా, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ విషయాలలో వాటంతట అవే ఇబ్బందులకు గురవ్వతున్నాయి. ఎంత పాపులర్ ఫోన్ మోడల్ అయినా... ఎంత సక్సెస్ ఫుల్ అయినా ఎప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది తెచ్చిపెడుతుందో తెలియటం లేదు. ఇదంతా కంపెనిల్ల్లో ఉన్న పోటీ తత్వం మరియు మార్కెట్ లో ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అనే నవిధానాలు కారణంగా జరుగుతున్నాయి. ఫర్ eg: Xiaomi, కంపెని బాగా ఫేమస్, కానీ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్స్ విషయంలో బాగా పూర్ గా ఉంది.
FAMOUS PHONE MODEL :
కేవలం ఒక ఫోన్ "బాగా పాపులర్", "అందరూ కొంటున్నారు", "మంచి ఆఫర్స్ తో వస్తుంది" అని కొనటం కరెక్ట్ కాదు. ఫర్ eg: ఆపిల్ బ్రాండ్ బాగా పాపులర్ మరియు ఐ ఫోన్ 6S అన్ని విధాలుగా బెస్ట్ ఫోన్. సో మీరు ఐ ఫోన్ 6S ఎందుకు తీసుకోవటం లేదు? కారణం దాని high ప్రైస్ మరియు సింగిల్ సిమ్ వంటి బేసిక్ ఫంక్షన్స్ లేకపోవటం అనే మైనస్ విషయం చాలా క్లియర్ కనబడుతుంది. ఇదే కాన్సెప్ట్ మీ budget లో ఉన్న ఫోనులకు కూడా వర్తిస్తుంది. కాని అది మీకు అందుబాటులోని budget లో ఉండటం వలన దానిలో ఉన్న మైనస్ లు అంత క్లియర్ గా కనిపించవు..fade out అయిపోతాయి.
మీరు కొందామని అనుకునే ఫేమస్ ఫోన్ లేదా మోడల్ లో మీకు అవసరం అయ్యే విషయాలు అన్నీ ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? అవసరం లేనివి ఎన్ని ఉన్నాయి? అని కంపేరిజన్ చేసుకొని తీసుకోవాలి.
ఫోన్ ఏదైనా అన్ని చోట్లా దానిలోని ప్లస్ పాయింట్స్ నే చెబుతారు అందరూ, కాని ప్లస్ కన్నా ముందుగా ఆ ఫోనులోని నెగటివ్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకోవటం మీకు ఎవ్వరూ చెప్పని బెస్ట్ స్మార్ట్ బయింగ్ సిక్రెట్. అందుకే నేను మీకు కొన్ని ఫోనుల్లో "కొనకపోవటానికి ఉన్న కారణాలు" అనే ఆర్టికల్స్ తెలియజేయటం జరుగుతుంది.
WRONG TIME :
చాలావరకూ స్మార్ట్ ఫోనులను కొనేటప్పుడు టైమింగ్ ను పట్టించుకోవాలి. అంటే సెంటిమెంట్స్ కాదు. ప్రతీ budget లో ప్రతీ సిరిస్ ఫోనులకు, కంపెనీలు ప్రతీ ఇయర్ కొత్త మోడల్స్ ను లాంచ్ చేస్తూ ఉంటాయి. సో మీరు కొత్త మోడల్/వేరియంట్ రిలీజ్ అయ్యే ముందు అప్పటికీ రిలీజ్ అయ్యి మార్కెట్ లో ఉన్న ఫోన్ కొనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త మోడల్ రిలీజ్ అయిన తరువాత, అఫీషియల్ గా పాత మోడల్ ప్రైస్ తగ్గిస్తాయి కంపెనీలు. సో ప్రైస్ డ్రాప్ అయిన తరువాత వాటిని తీసుకోవటం మంచిది కదా!
సెకెండ్ పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ సిరిస్ లో రిలీజ్ కాబోయే కొత్త మోడల్ లో కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్(ఫర్ eg: మన ఇండియాలో ఇప్పుడు VoLTE లేటెస్ట్) ఉంటాయి. అలాగే ప్రివియస్ మోడల్ కు కొత్త దానికి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ లేకుండా రిలీజ్ అవుతాయి. సో మీరు ఫోన్ కొనబోయే ముందు ఆ సిరిస్ లో నెక్స్ట్ మోడల్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకొని వెయిట్ చేయటం కరెక్ట్. 4 నుండి 6 నెలలు తరువాత రిలీజ్ అవుతున్నట్లయితే మీరు కరెంట్ మోడల్ కొనవచ్చు.
SMART PHONE SPECS TRENDS :
పర్సనల్ గా నాకు రూల్స్ బ్రేక్ చేయటం అంటే ఇష్టం. అంటే రూల్ బ్రేక్ చేశాము అని చాటుకోవటానికి ఇతరులకు ఇబ్బందులు తెచ్చే విధంగా confident గా రాంగ్ ఆటిట్యూడ్ తో ప్రవర్తించడం కాదు. సమూహంతో పాటు వెళ్ళకుండా స్వతంత్ర నిర్ణయాలతో మనకంటూ ఒక అభిరుచి ఉండటం దానిలోని ఉద్దేశం. మన ఇష్టం ఎక్కువ శాతం మందికి ఇష్టం లేదు కదా అని దానిని ఎప్పుడూ భయపడి దాచుకోకూడదు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కూడా.... అప్పటికప్పుడు ఉన్న ట్రెండ్స్ నే ఫాలో అవుతూ 90% మంది ఫోనులు తీసుకుంటారు. ఆ తరువాత వాడుతున్నప్పుడు, "ఎవడు కనిపెట్టాడు ఈ స్మార్ట్ టెక్నాలజీలు" అని విముఖుత చూపిస్తారు. ఫోన్ కొనే ముందే, మీ అభిరుచి ఏంటో దానికి తగ్గట్టుగా తీసుకోవటం మీకు పర్సనల్ గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ eg: ప్రస్తుతం అందరూ 5.5 in స్క్రిన్ కలిగిన ఫోనులు కొంటూ ఉంటారు. కాని వాటిని నిత్య వాడుకలో వాడటం చాలా అసౌకర్యంగా ఉంటుంది. సింగిల్ హాండ్ తో వాడటం మరీ కష్టం. Trendy లేదా costly ఫోనులు.... చుట్టూ ఉండే వారిని మెప్పించటానికీ మరియు వారితో పాటు మనమూ అదే రేంజ్ (సైజ్ మరియు కాస్ట్ విషయంలో) లో ఉండటానికి కొంటున్నామా అనే ప్రశ్న అవసరం చాలా ఉంది. చాలామందికి 5.5 స్క్రీన్ ఫర్వాలేదా అని అడిగితే, "ఫర్వాలేదు", ఆ స్క్రీన్ సైజ్ లో ఫోన్ సజెస్ట్ చేయమని చెబుతారు. కాని కొంటేనే కాని వారికి తెలియదు దాని ప్రాక్టికల్ problems. ఇలా చాలా స్పెక్స్ ఉన్నాయి. వాటిని మీరు ఒక సారి ఆలోచించుకొని సమాధానాలు తెలుసుకోండి. సో ట్రెండ్ కోసం కాకుండా మీ సౌకర్యం కొరకు, మీ అభిరుచికి తగ్గట్లుగా తీసుకోవటం స్మార్ట్ బయింగ్.
మీరు ఏ ఏజ్ లో ఉన్నా, ఎంత బడ్జెట్ లో ఫోన్ కొందామనుకున్నా స్మార్ట్ ఫోన్స్ లో అతి ముఖ్యమైన స్పెసిఫికేషన్ బ్యాటరీ. అవును, మీకు నచ్చే ఫీచర్ ఉన్న ఇతర ఫోన్ కోసం బ్యాటరీ బాగున్న ఫోన్ ను compromise చేసుకోకండి. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుంటే బాగా స్మార్ట్ ఫోన్ వాడె వారికి మినిమమ్ 3000 mah ప్లస్ ఉన్న బ్యాటరీ బెస్ట్. ఎవరేజ్ యూసర్ కు 3000 mah బ్యాటరీ సరిపోతుంది. ఇప్పుడు 4000 mah కలిగిన ఫోనులు కూడా అండర్ 10K బడ్జెట్ లో లభిస్తున్నాయి. సో అవి ప్రాక్టికల్ use లో చాలా సంతృప్తికరమైన స్మార్ట్ ఫోన్ usage ను కలిగిస్తాయి.
ఎందుకు బ్యాటరీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే... మీకు నచ్చే ఫోటోగ్రఫీ లేదా గేమింగ్ లేదా సోషల్ నెట్ వర్కింగ్ వంటి వాటికీ అవసరమయ్యే high specs అన్నీ మన కోరికలకు సంబంధించినవి. అంటే అవి timepass కు రిలేటెడ్. బ్యాటరీ మాత్రం అవసరానికి సంబంధించిన specification. చాలా అర్జెంటు లేదా ఇంపార్టెంట్ సందర్భాలు రోజులో ఒక్క సారి కాకపోయినా రెండు రోజులకు ఒక సారైనా వస్తాయి, అలాంటి సందర్భాల్లో ఫోన్ use అయినప్పుడే మనం నిజంగా మంచి ఫోన్ కొన్నాము అని ఫీల్ అవుతాము. 4000 mah బ్యాటరీ కలిగిన ఫోన్ కొంటే ప్రతీ గంటకూ చార్జింగ్ పెట్టాలి అనే బ్యాక్ గ్రౌండ్ నాయిస్ మైండ్ లో లేకుండా రెండు రోజులు నిశ్చింతగా ఉండగలరు. 50 వేలు పెట్టె ఫోనుల్లో కూడా 4000 mah కలిగిన బ్యాటరీ లు ఉండవు.
గమనిక: ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలూ క్రింద మరియు ఫేస్ బుక్ లో తెలియజేయగలరు. అలాగే డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.