jio ధనా ధన్ ఆఫర్ వచ్చేసి ఇప్పుడు టెలి' కామ్ మార్కెట్ లో ఒక హాట్ టాపిక్ , ఇప్పటివరకు దీనికి సంభందించిన పోస్ట్ లు న్యూస్ లు వందలలో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయ్.
ఇది ఇంత క్రేజ్ సంపాదించుటకు గల కారణం సామాన్యుల రక్తం పీల్చే మిగతా టెల్కో మాదిరి కాకుండా దీని ధరలు సామాన్యమానవుణ్ణి సంతృప్తి పరిచేవిధముగా ఉండుట దీనికి అసలు కారణం .
అసలు ముందుగా వచ్చిన jio సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కి ఈ ధనా ధన్ ఆఫర్ కి పెద్ద తేడాలు లేవు ఇంచుమించు ఒకే విధముగా వున్నాయి .
jio ప్రైమ్ కస్టమర్ 309 పెట్టి రీఛార్జ్ చేస్తే 3 మంత్స్ ఫ్రీగా ఇస్తున్నారు.
మీరు ఇంకా ఎక్కువ డేటా లాభాలు పొందాలనుకుంటే కనుక
509 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది.
అంతే కాకుండా నాన్ ప్రైమ్ మెంబర్స్ కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు. మరియు కొత్త ఆక్టివేట్ అయ్యేవారికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మార్కెట్ లో అన్ని టెలి కామ్ లు
అనేక డేటా ప్లాన్స్ ని విడుదల చేశాయి కానీ ఇంత తక్కువ కాస్ట్ కి మరియు సంతృప్తికరంగా ఇప్పటివరకు ఏ కంపెనీ ఇవ్వలేదు. ఎయిర్టెల్
గత నెలలో ఇటువంటి ఆఫర్ లాంటిదే అంటే ఇంచుమించు దగ్గరగా ఇలాంటి ప్లాన్ ను రిలీజ్ చేసినప్పటికీ జనాదరణ సంపాదిందుకోలేకపోయింది. ప్రస్తుతం
ఎయిర్టెల్ చేతిలో ఎటువంటి ప్లాన్స్ కూడా లేవు . భవిష్యత్తులో ఎటువంటి అడుగు వేయబోతుందనే సమాచారం లేదు.