jioమార్కెట్లోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకోవటం తో రోజు ఎదో ఒక టెలికాం కంపెనీ ఎదో ఒక ఆఫర్ ను విడుదల చేస్తున్నాయి. రిలయన్స్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి 2016 సెప్టెంబర్ లో 4G సర్వీస్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన తరువాత యూజర్స్ కోసం వెల్కమ్ ఆఫర్ ద్వారాగా డేటా , వాయిస్ కాల్స్ అని ఇలా ఎన్నో ఉచిత సేవలు అందించింది
ఇప్పుడు కొత్తగా టెలికాం కంపెనీ వోడాఫోన్ (Vodafone) మార్కెట్ లో తమ యూజర్స్ కోసం ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది. ఈ సరికొత్త ప్లాన్ యొక్క ధర Rs.145 మరియు ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి 2GB డేటా మరియు వోడాఫోన్ తన నెట్వర్క్ ఫై అన్లిమిటెడ్ కాల్స్ పొందే సౌకర్యం కలదు.
వోడాఫోన్ వారి ఈ కొత్త ప్లాన్ ఈ మద్యనే వచ్చిన ఎయిర్టెల్ ప్లాన్ కి దగ్గరగా ఉంటుంది.
వోడాఫోన్ (Vodafone) వారి ఈ కొత్త ప్లాన్ వాలిడిటీ 28 రోజులు . అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ వోడాఫోన్ యొక్క కొంతమంది యూజర్స్ కోసం మాత్రమే . అయితే, వోడాఫోన్ ఇటీవల ఒక ప్రణాళిక ప్రవేశపెట్టింది.
ఈ రూ 346 లేదా రూ 348 ధర కలిగిన ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి రోజూ 1GB 4G/3G డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం కలదు. ఈ కొత్త ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
ఇప్పటికే మార్కెట్లో ఎయిర్టెల్ (airtel) ఇటీవల ప్రవేశపెట్టిన రెండు కొత్త ప్రణాళికలు ఉన్నాయి. Rs 145-149 ధర కలిగిన ప్లాన్ లో యూజర్స్ కి 2GB 4G డేటా తో పాటుగా ఎయిర్టెల్ తమ నెట్వర్క్ లో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకొనే సౌకర్యం కూడా కలిపిస్తుంది. అదే
ఎయిర్టెల్ వారి మరొక 345-Rs 349 ధర కల ప్లాన్ లో రోజూ 28 రోజులకి 1GB 4G డేటా లభిస్తుంది.
కేవలం jio వల్లే మిగతా టెలికాం కంపెనీలు దిగి వచ్చి ప్రజలకి ఇటువంటి ఆఫర్స్ ను ఇస్తున్నాయి. ఒక విధముగా jio వలన ప్రజలకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు.