భారత టెలికాం ప్రపంచంలో డేటా పేరు తో తీవ్రతరమైన కాంపిటిషన్ నడుస్తుంది . ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే , అది త్వరలోనే ముగుస్తుందని అనిపించడం లేదు. జియో వచ్చిన తరువాత మిగతా టెలికామ్ కంపెనీలు అతి తక్కువ ధరకే ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రతి రోజు యూజర్స్ కి అందిస్తున్నాయి . ఏదేమైనా కానీ వినియోగదారుడు లాభపడుతున్నది,అనేది నిజం . దీనికంతటికీ ముఖ్య కారణం జియో మాత్రమే అని చెప్పాలి . ఇప్పుడు తాజా గా వోడాఫోన్ తన కొత్త ఆఫర్ తో యూజర్స్ ముందుకు వచ్చేసింది . మరి ఆ ప్లాన్ లోని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
వోడాఫోన్ దాని సూపర్ వీక్ ప్లాన్ ను ప్రారంభించిన తర్వాత మరో పెద్ద ప్లాన్ తో యూజర్స్ ముందుకు వచ్చింది. ఈ కొత్త ప్లాన్ ని 496 రూపాయలలో కంపెనీ ప్రారంభించింది. ఈ ప్లాన్ పూర్తి గా 84 రోజుల వాలిడిటీ తో వస్తుంది. కంపెనీ ఎవరైతే యూజర్స్ మాటి మాటికీ రీఛార్జ్ చేయటానికి ఇష్టపడరో అటువంటి వారికోసం మరియు వారి సమయం సేవ్ చేసేందుకు ప్రవేశపెట్టింది .
ఈ కొత్త ప్లాన్ కంపెనీ ప్రస్తుత వినియోగదారులకు అలాగే MNP వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ పేర్కొంది. 496 యొక్క ఈ ప్లాన్ లో, వినియోగదారులు 84 రోజుల వాలిడిటీ పొందుతారు. ఈ 84 రోజులలో, వినియోగదారులు ప్రతి రోజు 1 GB డేటాను మరియు అపరిమిత కాల్స్ కూడా పొందుతారు.
కంపెనీ ప్లాన్ గురించి చెప్పిన మరో విషయం ఏమిటంటే రోజువారీ లేదా వారపు క్యాప్ లేదని కంపెనీ వివరించింది. యూజర్స్ కావాలంటే అనేక కాల్స్ చేయవచ్చు. ఈ కాల్స్ ఎక్కడైనా, ఏదైనా నెట్వర్క్లో అయినా చేయవచ్చు.
వోడాఫోన్ యొక్క రూ 177 ప్లాన్ కూడా కొన్ని ఇలాంటి లాభాలతో వస్తుంది. యూజర్లు ఈ ప్రణాళికలో 28 రోజులపాటు అపరిమిత కాలింగ్ ని పొందవచ్చు. వినియోగదారులు ప్రతిరోజూ 1 GB డేటాను పొందుతారు.
రిలయన్స్ జీయో యొక్క టారిఫ్ ప్లాన్త అప్డేట్ తర్వాత కరెక్ట్ గా ఒక వారానికి, వోడాఫోన్ ఈ ప్లాన్ ను తెచ్చిపెట్టింది. స్పష్టంగా, తెలుస్తున్నదేమిటంటే కంపెనీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు మరింత మంది వినియోగదారులను ఆకర్షించాలని కోరుకుంటుంది.
ఇంతకుముందర వోడాఫోన్ ఇండియా ఈరోజు సూపర్ వీక్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది . వోడాఫోన్ నుంచి సూపర్ వీక్ ప్లాన్ లో ,69రూపీస్ లో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 500 MB డేటా లభిస్తాయి .
ఈ ప్లాన్ లో యూజర్స్ కి 69 రూ లో ఒక వారానికి ఏ నెట్వర్క్ పైనైనా అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ 500 MB డేటా లభ్యం
ఇటువంటి ధర లో ముందు ఈ ఆఫర్ ఎన్నడూ ఇవ్వలేదు. అదనంగా, యూజర్లు 'అన్లిమిటెడ్ రిపీట్ పర్చేజ్ ఆఫ్ ప్యాక్' ఆప్షన్ కింద ప్రతి వారం (వీక్) ఒక సూపర్ వీక్ తయారు చేయవచ్చు.
వోడాఫోన్ SuperNetTM అనుభవాన్ని ఆస్వాదించడానికి వినియోగదారులను ఆహ్వానిస్తూ వొడాఫోన్ ఇండియా యొక్క అసోసియేట్ డైరెక్టర్ "అవినాష్ ఖోస్లా"ఇలా అన్నాడు, "బెస్ట్ నెట్వర్క్ను, నెట్ వర్క్ ను బెస్ట్ సర్వీస్ చేయడంలో, అన్లిమిటెడ్ మరియు లో కాస్ట్ ప్లాన్ , వంటివి ఇవ్వటం తో సులభంగా ప్రీపెయిడ్ వినియోగదారులని ఆకర్షించగలము . "