ఎయిర్టెల్ తరువాత వోడాఫోన్ కూడా తమ యూజర్స్ కోసం ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పైడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటు.
ఈ ఆఫర్ క్రింద వోడాఫోన్ తన పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం 24GB 4G ఇస్తుంది. ఈ ఆఫర్ క్రింద 3 నెలలకు ప్రతి నెలా 8GB 4G డేటా ను
యూజర్స్ పొందవచ్చు.
కేవలం కొన్ని రోజుల క్రితం తన వినియోగదారులకు ఎయిర్టెల్ 30GB 4G డేటా ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ డేటా వినియీగదారులకు 3 నెలల వరకు ఉంటుంది.
మీకు తెలిసినట్లుగా jio
మార్కెట్లోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకోవటం తో రోజు ఎదో ఒక టెలికాం కంపెనీ ఎదో ఒక ఆఫర్ ను విడుదల చేస్తున్నాయి.
రిలయన్స్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి 2016 సెప్టెంబర్ లో 4G సర్వీస్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన తరువాత యూజర్స్ కోసం వెల్కమ్ ఆఫర్ ద్వారాగా డేటా , వాయిస్ కాల్స్ అని ఇలా ఎన్నో ఉచిత సేవలు అందించింది.
కేవలం jio వల్లే మిగతా టెలికాం కంపెనీలు దిగి వచ్చి ప్రజలకి ఇటువంటి ఆఫర్స్ ను ఇస్తున్నాయి. ఒక విధముగా jio వలన ప్రజలకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు.