వాట్స్ అప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ యాడ్ అయ్యింది. ఇది ప్రస్తుతం బీటా users కు మాత్రమే కనిపిస్తుంది. అందరికీ కనిపించదు. కంగారు పడకండి. బీటా ను ఏలా చేయాలో క్రింద చెప్పటం జరిగింది. రెండు నిమిషాల్లో చేయగలరు. మొబైల్ users క్రిందకు స్క్రోల్ చేయండి స్టోరీ చదవటానికి.
బీటా యూసర్ కు రిజిస్టర్ అయితే వెంటనే ఈ అప్ డేట్ కనిపిస్తుంది. సో దానిని మీరు అప్ డేట్ చేసుకుంటే ఇక వాట్స్ అప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ ను వాడుకోగలరు.
వాట్స్ అప్ బీటా యూసర్ అవ్వటానికి గతంలో ఒక ఆర్టికల్ వ్రాయటం జరిగింది. దానిని ఈ లింక్ లో చదవగలరు.
మేము బీటా లో ఉన్నాము, వీడియో కాలింగ్ ఫీచర్ ఎక్కడ ఉంది, ఏలా వాడాలి? మీరు కాంటాక్ట్ ఓపెన్ చేస్తే పైన రేగులర్ వాట్స్ అప్ కాలింగ్ సింబల్ ఉంటుంది. దాని పై టాప్ చేస్తే మీకు ఇప్పుడు డైరెక్ట్ గా కాల్ వెళ్ళకుండా, Voice or Video అని అడుగుతుంది. అక్కడ video ను సెలెక్ట్ చేసి వీడియో కాల్ చేసుకోగలరు.
ఇది పనిచేయాలంటే ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా?
ఆఫ్ కోర్స్ ఉంది. అవతల వ్యక్తి బీటా యూసర్ కాకపొతే, వారికి వీడియో కాలింగ్ ఫీచర్ ఉండదు. సో మీరు వాళ్ళకు కాల్ చేసిన వీడియో కాల్ వెళ్ళాదు. వాళ్ళను కూడా బీటా కు రిజిస్టర్ అవ్వమని చెప్పి, వీడియో కాలింగ్ ను ఆస్వాదించగలరు.
ఇది బీటా నుండి అందరికీ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియవలసి ఉంది.
ఆల్రెడీ బీటా యూసర్ అయ్యుండి, దాని నుండి బయట పడాలనుకుంటే ఏలా?
ప్లే స్టోర్ యాప్ పేజ్ ఓపెన్ చేసి క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు LEAVE అనే గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. దాని పై టాప్ చేయండి! గమనిక :డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. క్రింద మరొక స్లయిడ్ ఉంది.
వాట్స్ అప్ లో అందరూ తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ విషయాలను ఈ లింక్ లో తెలపటం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలందరికీ safety పరంగా ఇవి తెలియాలి అనే ఉద్దేశం తో వ్రాయటం జరిగింది. లేడిస్ అందరూ కచ్చితంగా ఆర్టికల్ చదవి తీరాలి.