బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Dec 14 2016
బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

జేబులోంచి కాష్ తీయకుండా ఇంటర్నెట్ లేదా స్వైపింగ్ పద్దతుల్లో cashless transactions చేయటం గురించి అందరికీ తెలిసిందే. కాని ఇంటర్నెట్ కూడా లేకపోయినా కేవలం బేసిక్ ఫోన్ ఉన్నా, కొంతమేరకు బ్యాంక్ లావాదేవీలు చేసుకోగలరు. అవేంటో తెలియజేయటానికే ఈ ఆర్టికల్. క్రింద స్క్రోల్ చేయగలరు..

బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

చేతిలో స్మార్ట్ ఫోన్ లేదా? ఇంట్లో పేరెంట్స్ వద్ద కేవలం బేసిక్ ఫోన్ ఉందా? అయినా ఫర్వాలేదు వాళ్ళ ఫోనులోనే బ్యాంకు పనులు చేసుకోగలరు ఈజీగా.

USSD కోడ్ ద్వారా ఒక పద్ధతి వాడుకలో ఉంది. అయితే కొన్ని సార్లు సర్వర్స్ డౌన్ అయ్యి సరైన ఫలితాలు రావటంలేదు.

బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

కాని ఏలా పనిచేస్తుంది, ఏమి ఏమి చేసుకోగలము అనే వివరాలు తెలుసుకొని, ఒక సారి ట్రై చేయండి మీ ఫోనులో..

బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

USSD కోడ్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగించటానికి ముందుగా మీరూ టైప్ చేయవలసిన కోడ్ ” *99# “. ఇది టైప్ చేసి డయల్ చేస్తే మీకు అన్నీ అర్థమవుతాయి.

బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

USSD పద్దతిలో ఏమి చేసుకోగలము?

  • మీ బ్యాంకు బాలన్స్,
  • IFSC బ్యాంకు అమౌంట్ transfer.
  • మినీ స్టేట్మెంట్.
  • MMID మనీ transfer.
  • SHOW MMID
  • MPIN

బేసిక్ ఇంటర్నెట్ లేని ఫోన్ ఉన్నా బ్యాంకు లావాదేవీలు చేసుకోగలరు ఇలా

దీనిని ట్రై చేసే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు:
1. మీరు ఏ బ్యాంకు డిటేల్స్ అయితే access చేద్దామని అనుకుంటున్నారో, ఆ బ్యాంక్ కు మీరు రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ లోనే మీరు USSD ను డయల్ చేయాలి. ఆ నంబర్ లోనే సర్వీసెస్ పూర్తి స్థాయిలో పనిచేస్తాయి.

2. 24 గంటలు 7 రోజులు అందుబాటులో ఉండే USSD లో 5000 రూ వరకూ transfer చేసుకోగలరు. అయితే transaction కు 50 పైసులు చార్జ్ అవుతుంది.