మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jun 30 2015
మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

ఇంటర్నెట్ ని తెలుగులో అంతర్జాలం అని అంటారు. ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరి అరచేతిలో ఇముడు పోయింది. ఇంటర్నెట్ కేవలం సరదాలకే కాక ఉపయోగాలకు చాల పెద్ద ప్లాట్ ఫారం గా తయారు అయ్యింది. అయితే ఇక్కడ మీకు తెలియని కొన్ని ఉపయోగపడే వెబ్‌సైట్లు లిస్ట్ నెక్స్ట్ స్లైడ్ లో చూడండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

MySmartPrice
మీరు స్మార్ట్ ఫోన్ లేదా ఎటువంటి వస్తువులైనా ఆన్ లైన్ లో కొనటానికి నిర్ణయం తీసుకున్నారా? కాని ఏ వెబ్ సైటు లో ఆ ఐటం తక్కువకి వస్తుందో తెలియటం లేదా అయితే, ఈ సైటు మీకు ఎక్కడ ఏ ఐటెం తక్కువకి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ప్రైస్ తో ఐటం సేల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ డిటేల్డగా ఇస్తుంది. మీరు జస్ట్ సైటు ఓపెన్ చేసి, కావలసిన ఐటం ను సెర్చ్ చేస్తే చాలు.
వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

Zerodollarmovies
యూట్యూబ్ లోని ఫుల్ లెంత్ మూవీస్ ను వెతికి ఇస్తుంది ఇది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అన్ని భాషల సినిమాలు ఉన్నాయి. జస్ట్ సెర్చ్ చేయండి చాలు. ఇదే పని యుట్యుబ్ లో చేయగలరు, కాని ఈ వెబ్ సైటు లో యుట్యుబ్ లో ఉండే డూప్లికేటు లింక్స్ మరియు ట్రయిలర్స్ వంటి మిగిలిన చిన్న చిన్న వీడియోలు ఏమీ ఉండవు. ఓన్లీ ఫుల్ లెంత్ మూవీస్ మాత్రమే.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

Gobol
తక్కువ రేట్లకు అఫిషియల్ కంపని తయారీ లో ప్రాబ్లమ్ ఉండి, మళ్ళీ వాటిని తిరిగి బాగుచేసి గాడ్జట్స్ ఇండియన్ వెబ్ సైటు ఇది.. దీనిని Refurbishing అని అంటారు. 6 మంత్స్ వారేంటి తో వస్తాయి. ధర సగం వరకూ తగ్గితే వీటిని తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

IFTTT.com
మీరు ఒక పని చేస్తే, వెంటనే దానికి అనుగుణంగా మరొక పని జరగాలా? దీని పని అదే. ఫర్ eg మీరు ఫేస్ బుక్ లో స్టేటస్ అప్‌డేట్ చేసిన వెంటనే ట్విట్టర్ లో అదే స్టేటస్ ఆటోమేటిక్ గా పోస్ట్ అవ్వాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటివి చాలా Recipes  ఉన్నాయి దీనిలో. ఒకసారి “బ్రౌజ్ ఛానల్స్” లోకి వెళ్లి చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఆటోమేటిక్ రిసిపీ ఒకటైనా ఉంటుంది.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

Google images
images.google.com లో మీ  దగ్గర ఉన్న ఇమేజ్ తో సేమ్ అటువంటి ఇమేజెస్ నే వెతకగలరు. ఇది గూగల్ వెబ్ సైటు. అంటే ఇది ఇమేజ్ సెర్చ్ సర్విస్.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

Youtube టివి మోడ్
యుట్యుబ్ లోని ఏ వీడియోని అయినా టి.వి మాదిరిగా వదిలేసి వెన్నకి జారబడి కూర్చొని చూడవచ్చు ఈ వెబ్ లింక్ లో.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.
 
మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

Opensubtitles.org
ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువుగా చూసేవారికి, క్రింద సబ్ టైటిల్స్ అవసరం అయితే, ఇది ఓన్లీ బెస్ట్ వెబ్ సైట్. దీనిలో 99 పర్సెంట్ అన్ని ఇంటర్నేషనల్ సినిమాల ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ దొరుకుతాయి.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

A Good Movie To Watch
మీరు ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువుగా చూస్తారా? కాని ఏది మంచి మూవీ అని తెలుసుకోవటానికి IMDB, యూట్యుబ్ వంటి సైట్లను గంటలు తరబడి వెతకనవసరం లేదు. ఈ వెబ్ సైటు మీకు కావలసిన మంచి సినిమాలను చెబుతోంది
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

10minutemail
మీరు ఆన్ లైన్ షాపింగ్ మరియు స్మార్ట్ ఫోన్ యాప్స్ లో ఫస్ట్ యూజర్ కు మాత్రమే అని వచ్చే ఆఫర్స్ ను ఎక్కువగా చూస్తుంటారా? కేవలం వాటికోసం కొత్త కొత్త ఈ మెయిల్ ID లను క్రియేట్ చేసుకుంటున్నారా? ఇక నుండి అవసరం లేదు, ఇది మీ కోసం ఒక వేలిడ్ మెయిల్ id ను క్రియేట్ చేసి, ఆటోమేటిక్ గా 10 మినిట్స్ లో expire చేస్తుంది. అయితే ఇది నార్మల్ కాంటాక్ట్ ఈ మెయిల్ ఎడ్రస్ లకు పనికిరాదు.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.

మీకు తెలియని యూజ్ఫుల్ ఇంటరెస్టింగ్ వెబ్ సైట్లు

GSMarena
మీరు స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ను స్పష్టంగా ఇక్కడ చూడగలరు. ఇది చాలా నమ్మకమైన వెబ్ సైటు. ఎటువంటి మొబైల్ అయినా, దాని టెక్నికల్ కన్ఫిగరేషన్ ను ఇక్కడ చూడండి. మీరు జస్ట్ ఏ స్మార్ట్ ఫోనును గూగల్ చేసినా చాలు మొదటగా ఈ వెబ్ సైటు లింకే కనపడుతుంది.
​వెబ్ సైటు కు వెళ్లటానికి పైన వెబ్ సైటు పేరు మీద క్లిక్ చేయండి.