టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jun 15 2015
టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

టాప్ బెస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్ ఎడిషన్ లో  యూస్ఫుల్ అప్లికేషన్స్ ఎడిషన్ 3 ను ఇక్కడ చూడగలరు. ఇది కంటిన్యుస్ గా మీకు తెలియని ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ గురించి  వ్రాయబడే ఆర్టికల్ ఎడిషన్.  దీనిని డైరెక్ట్ గా వెబ్ సైటు లో చూడాలని అనుకుంటే ఆప్స్ సెక్షన్ లో చూడగలరు. యూస్ఫుల్ ఆప్స్ ఎడిషన్ 1 మరియు ఎడిషన్ 2 ఇక్కడ చూడండి.

టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

IRCTC train WL, PNR prediction
ఇది మీరు ట్రెయిన్ టికెట్స్ ను తీసుకునేటప్పుడు లేదా తీసుకున్నాక వేటింగ్ లిస్టు కాని RAC కాని వస్తే, అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అని గతంలో అదే ట్రెయిన్ కి అదే WL నంబర్ కి ఏమి జరిగిందో బేస్ చేసుకొని మీ ప్రస్తుత WL ను  ప్రేడిక్ట్ చేసి చెబుతుంది. ఇలాంటి యూస్ కోసం Trainman అని మరో అప్లికేషన్ ఉంది.

డౌన్లోడ్ - IRCTC train WL, PNR prediction , Trainman 
 

టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

Chat With Brands and Businesses
షాపింగ్, ట్రావెలింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఎంటర్టెయిన్మెంట్, ఫుడ్ ఇలా కేటగిరి ఏదైనా మీకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలనిపిస్తే వెంటనే ఈ అప్లికేషన్ ను గుర్తుకుతెచ్చుకోండి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్పైస్ జెట్, BookMyShow, మీ దగ్గర లోని ఫుడ్ లేదా షాపింగ్ డీల్స్ అన్నింటికీ ఇది చాట్ రూపంలో మనతో మాట్లాడి సమాధానాలు ఇస్తుంది. మీకు ఏ కేటగిరి లో సమస్య వచ్చినా దానికి సంబందించిన కేటగిరి ని సెలక్ట్ చేసుకొని చాట్ చేయడమే. టెక్ సపోర్ట్ నుండి కూపన్స్ వరకూ అన్ని చెబుతుంది.

డౌన్లోడ్ లింక్ Chat With Brand and Businesses

టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

Around Me Places Tracker
మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మీకు కావలిసిన ATM, బ్యాంక్, హాస్పిటల్, మెడికల్ షాప్స్, థియేటర్లు, మరియు రెస్టారెంట్లు ఇంకా చాలా వాటిని వెతికి మీ చుట్టుపక్కల దగ్గరిలో ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.  ఈ అప్లికేషన్ లో ఏడ్స్ పాప్ ఆప్స్ ఎక్కువగా వస్తాయి, అదే యూస్ కు AroundMe పేరుతో మరొక అప్లికేషన్ ఉంది. అందులో ఏడ్స్ తక్కువ.

డౌన్లోడ్ - Around Me Places Tracker, AroundMe

టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

Daily Deals on Online Shopping
మీకు ఆన్లైన్ షాపింగ్ హ్యాబిట్ లాగ మారిపోయిందా? అయితే ఏ రోజు, ఏ వెబ్ సైటు ఏమి డీల్స్ పెట్టిందా అనే దానిపై సింపుల్ గా ఈ అప్లికేషన్ లో తెలుసుకోవచ్చు. ప్రతీ వెబ్ సైటు ను ఓపెన్ చేసి ఎక్కడ డీల్స్ ఉన్నాయా అని వెతుకుతూ టైమ్ ని వెస్ట్ చేయకుండా ఈ అప్లికేషన్ ను రోజు చూసుకుంటే చాలు. ఇది ఇంటర్నెట్ లో ఎక్కడ ఏ ఆఫర్స్, డీల్స్ ఉన్నా చూపిస్తుంది.

డౌన్లోడ్ -  Daily Deals on Online Shopping

టాప్ యూస్ఫుల్ ఆప్స్ - ఎడిషన్ 3

Indian rail train info hotels
పేరు చుస్తే దీని యూసేజ్ ఏంటో అర్థమవుతుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే దానికి కావలిసిన సమాచారాన్ని ఆప్ లో ఇస్తే మీరూ ట్రెయిన్ లో ప్రయాణం చేస్తుండగా మీ స్టేషన్ వచ్చే కొన్ని క్షణాలు ముందు మిమ్మల్ని అలారం తో లేపుతుంది. అంతే కాదు లైవ్ ట్రెయిన్ స్టేటస్, బెర్త్ ఎవైలబిలిటి మరియు సీట్ నంబర్ అమరిక చూపించడం దీని హై లైట్స్.  Ixigo డెవలపర్స్ నుండి వచ్చిన అప్లికేషన్ ఇది.

డౌన్లోడ్ - Indian rail train info hotels