మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jan 10 2016
మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

లాక్ స్క్రీన్ ను అన్ లాక్ చేయకుండా మీకు నచ్చే అంశాలను, న్యూస్ అప్ డేట్స్ ను లాక్ స్క్రీన్ పై చూడటానికి ఇది బెస్ట్ యాప్. పేరు స్లైడ్. సైజ్ 3.5MB. 4.2 స్టార్ రేటింగ్. ప్లే స్టోర్ డౌన్లోడ్ లింక్. దీనిలోని ఫీచర్స్ చదవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండ్. 
గమనిక : ఇమేజెస్ కారణంగా కొంచెం లోడ్ అవటానికి టైమ్ పడుతుంది మీకు Low ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే. సో అది వెబ్ సైట్ ప్రాబ్లెం కాదని గమనించగలరు.

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

ఇంస్టాల్ చేసిన వెంటనే ఓపెన్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఫేస్ బుక్ లాగిన్ కూడా ఉంది. సో సింపుల్ గా దానిని ఇంటిగ్రేట్ చేయటం బెటర్.

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

నెక్స్ట్ స్క్రీన్ లో మీ ఇంటరెస్ట్ లను ఎంచుకోవాలి. బుక్స్, ఫుడ్, టెక్నాలజీ, మూవీస్ etc ఉన్నాయి. ఇక అంతే. మీ ఫోన్ కు లాక్ కోడ్/pattern ఉన్నా లేకున్నా ఫోన్ టచ్ చేస్తే స్లైడ్ ఆర్టికల్స్ చూపిస్తుంది.

 

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

మీకు నచ్చని ఆర్టికల్ ఉంటే, క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే కొత్త ఆర్టికల్ వస్తుంది. అదే స్క్రీన్ లో క్రింద arrow సింబల్ తో ఉన్న వైట్ సర్కిల్ ను రైట్ కు స్వైప్ చేస్తే అన్ లాక్, లెఫ్ట్ కు స్వైప్ చేస్తే ఆర్టికల్ ఓపెన్ అవుతుంది.

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్లైడ్

ఈ ఫీచర్ ఏ యాప్ ఇవ్వదు. స్పెషల్. మీరు ఆర్టికల్స్ చదివినా, అన్ లాక్ చేసినా, లేక యాప్ ను రేట్ చేసినా మీకు రివార్డ్స్ వస్తాయి. అంటే అమౌంట్ వస్తుంది డైరెక్ట్ గా. సో జస్ట్ దీనిని వాడితే మీకు ఇన్ఫర్మేషన్ తో పాటు మొబైల్ రీచార్జ్ లు , డిస్కౌంట్ చేసుకునే రివార్డ్స్ కూడా ఉన్నాయి. యాప్ UI కూడా బాగుంది సో వాడకపోవటానికి కారణం కనిపించదు except మీకు ఇలాంటి రివార్డ్స్ యాప్స్ వాడటం వలన ఏమీ రాదు అనే అభిప్రయం ఉంటే తప్ప.