స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా స్టార్ట్ చేసిన సర్విస్ ఇది. వెబ్ సైట్ అండ్ ఆండ్రాయిడ్ రూపంలో ఉంది. పేరు స్టేట్ బ్యాంక్ rewardz. ప్లే స్టోర్ లో దీని సైజ్ 6.3MB. 4.2 స్టార్ రేటింగ్ తో ఉంది. యాప్ లింక్ కొరకు లాస్ట్ స్లైడ్ లో చూడండి.
ఏమి చేస్తుంది?
మీరు ఇప్పటివరకూ వాడిన sbi transactions కు బై డిఫాల్ట్ గా బ్యాంక్ కొన్ని పాయింట్స్ ఇస్తుంది మీ అకౌంట్ కు. అవి పాయింట్స్ బట్టీ మొబైల్ రీచార్జ్ నుండి షాపింగ్ వరకూ ఫ్రీ గా చేస్తుంది. మీరు చేసిన transactions కు రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు వస్తాయి అనేది వెబ్ సైట్ లో ఉంటాయి. మినిమమ్ రెండు రోజుల లోపు వస్తాయి.
ఎలా పనిచేస్తుంది?
మీరు ఎన్ని ఎక్కువ transactions చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మీరు అకౌంట్ ప్రారంభం చేసిన టైమ్ నుండి ఇప్పటి వరకూ అన్నీ పాయింట్స్ రూపంలో బ్యాక్ గ్రౌండ్ లో మీ అకౌంట్ లో యాడ్ అవుతూ ఉన్నాయి.
ముందుగా యాప్ ఇంస్టాల్ చేసి, అక్కడ చూపించే ఇన్ఫర్మేషన్ అంతా చదవండి. తరువాత అడిగిన sbi అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మీ మొబైల్ నంబర్ తో లాగిన్ ID క్రియేట్ చేయండి. అంతే! మీరు అకౌంట్ క్రియేట్ చేసే సరికి అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. దానికి తోడూ sbi ప్రారంభం ఆఫర్ క్రింద 100 పాయింట్స్ ను ఇస్తుంది.
ఫీచర్స్...
1. 200 రూ స్టాండర్డ్ transaction చేస్తే 1 పాయింట్స్ వస్తున్నాయి. వినటానికి తక్కువుగా ఉన్న డిఫరెంట్ transactions ప్రకారం డిఫరెంట్ calculation తో పాయింట్స్ ఇస్తుంది sbi. క్లారిటీ కొరకు పైన/సైడ్ లో ఉన్న ఇమేజ్ చూడండి.
2. 1 Point కు 4 రూ ఇస్తుంది SBI. అంటే చాలా బాగుంది అని చెప్పవచ్చు. పాయింట్స్ రావటం కష్టం అయినా పాయింట్ కు బ్యాంక్ ఇస్తున్న ప్రైసింగ్ బాగుంది.
ఈ యాప్ ను వాడే ముందు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు..
1. మీకు యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ రివార్డ్స్ లో మెంబర్ గా ఉన్నటే. కేవలం ఆ మెంబర్ షిప్ ను యాక్టివేట్ చేస్తున్నారు ఇప్పుడు.
2. SBI అయితే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఎటువంటి transactions చేసినా పాయింట్స్ వస్తాయి. SBI గ్రూప్ లో ఉన్న ఇతర బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉన్నవారికి మాత్రం డెబిట్ transactions కు మాత్రమే పాయింట్స్ యాడ్ అవుతున్నాయి ప్రస్తుతం.
3. కొన్ని పాయింట్స్ కు expiry డేట్ కూడా ఉంటుంది. సో అవి invalid అయ్యే లోపు వాడుకోవటం బెటర్. ప్లే స్టోర్ లో యాప్ ను ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేయగలరు. వెబ్ సైట్ లింక్
4. మీకు ఉన్న మిగిలిన డౌట్స్ కు FAQ సెక్షన్ చదవండి. సింపుల్ గా అన్నీ వివరించటం జరిగింది.