మీకు ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుసుకునే అలవాటు ఉందా? అలవాటు గా లేకపోయినా ఏదైనా చదివినప్పుడు అర్థం తెలియక దాని మీద ఇంటరెస్ట్ పోయి వదిలేసిన సందర్భాలు ఉంటాయి ఏవరికైనా. అలాగే అర్థం తెలుసుకోవటానికి బ్రౌజర్ ఓపెన్ చేసి గూగల్ లో సర్చ్ చేయటానికి ఓపిక ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సింపుల్ గా ఒక బెస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ యాప్ ఉంది.
దీని పేరు న్యూస్ డిక్షనరీ - వర్డ్ స్నిచ్. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో ఉంది. సైజ్ - 13MB. 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఇది పేరుకి న్యూస్ డిక్షనరీ అని ఉంటుంది కానీ టైపింగ్ మెథడ్ లో దేనికైనా మీనింగ్స్ ఇస్తుంది.
ఇది రెండు రకాలుగా మీనింగ్స్ ను అందిస్తుంది. ఒకటి వర్డ్ ను కాపీ చేస్తే పాప అప్ ద్వారా చూపించటం. రెండవది వర్డ్ ను టైప్ చేస్తే మీనింగ్ చూపించటం.
ఇందులో పెద్ద విషయం ఏముందీ అనుకోకండి. కాపీ అంటే మీరు కొన్ని యాప్స్ వాడుతున్నప్పుడు వాటిలో వర్డ్ ను కాపి చేస్తే చాలు వెంటనే పాప అప్ వస్తుంది. మీరు ప్రత్యేకంగా మీనింగ్ వెతకటానికి బ్రోజర్ లేదా డిక్షనరీ దగ్గరకు వెల్లనవసరం లేదు. టైపింగ్ అంటే మీ మొబైల్ పై T అనే వర్డ్ తో రెడ్ కలర్ బటన్ ఎప్పుడూ ఉంటుంది. దాని పై టచ్ చేసి మీకు కావలసిన వర్డ్ ను టైప్ చేసి అక్కడ ఉండే సర్చ్ బటన్ పై ప్రెస్ చేస్తే వెంటనే పాప అప్ మెసేజ్ లో మీనింగ్ చదవగలరు.
కాపీ మెథడ్ కొన్ని యాప్స్ పైనే పనిచేస్తుంది. అది కూడా mostly న్యూస్ యాప్స్, ఇందులో న్యూస్ hunt కూడా ఉంది. అలాగే Quora లో కూడా వర్క్ అవుతుంది.
అదే టైపింగ్ మెథడ్ లో అయితే కేవలం యాప్ లో ఉంటేనే కాదు మొబైల్ లో ఎప్పుడైనా ఎక్కడైనా జస్ట్ ఫ్లోటింగ్ బటన్ పై టచ్ చేసి సర్చ్ చేయటమే.
సో కాపీ మెథడ్ కన్నా టైపింగ్ మెథడ్ useful గా ఉంది. యాప్ ఓపెన్ అయిన వెంటనే క్రింద ఆన్ ఆఫ్ బటన్ ను యాక్టివేట్ చేస్తే కాపీ మెథడ్ యాక్టివేట్ అవుతుంది. దాని పైన ఉన్న రౌండ్ గ్రీన్ సింబల్ పై టచ్ చేస్తే టైపింగ్ మెథడ్ ఆన్ అవుతుంది. ఫ్లోటింగ్ బటన్ డిసేబుల్ చేయటానికి బటన్ ను టచ్ చేసి క్రింద ఉండే క్రాస్ బటన్ పైకి డ్రాగ్ చేయాలి.
సర్చ్ చేసిన మీనింగ్స్ ను సేవ్ కూడా చేస్తుంది యాప్ లో.