ఆండ్రాయిడ్ కాకుండా విండోస్ ఫోన్ వాడుదామని అనుకుని, విండోస్ లో యాప్స్ ఎక్కువ ఉండవు అని మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకునే వారు ఉంటారు. అలాంటి వారి కోసం విండోస్ లో వారికి అవసరం అయ్యే యాప్స్ ఉన్నాయో లేదో చూపిస్తుంది మైక్రోసాఫ్ట్. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఒక యాప్ ను డెవలప్ చేసింది. ఇది మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఆధారంగా విండోస్ స్టోర్ లో ఆ యాప్స్ లేదా అలాంటి అవసరం తీర్చే యాప్స్ లిస్ట్ ను చూపిస్తుంది. దీని ఫీచర్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
దీని పేరు AppComparison. సైజ్ 2.8 MB, వెర్షన్ 1. నవంబర్ 20 న లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ పై ఉండే ఫోన్స్ లో పనిచేస్తుంది.
యాప్ ఓపెన్ చేసిన వెంటనే మిమ్మల్ని కేటగిరిస్ వైజ్ గా యాప్స్ ను సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేయండి.
నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే, ఇప్పుడు రెండు టాబ్స్ చూపిస్తుంది. ఒకటి మీరు ముందు స్క్రీన్ లో సెలెక్ట్ చేసిన కేటగిరిస్ వైజ్ యాప్స్ matches. రెండవది ఇతర పాపులర్ రికమెండ్ యాప్స్ చూపించే టాబ్.
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో యాప్ ను డౌన్లోడ్ చేయటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. గతంలో కూడా మైక్రోసాఫ్ట్ స్విచ్ టు విండోస్ ఫోన్ అని యాప్ డెవలప్ చేసింది ఇదే purpose కోసం. కాని అది ఆండ్రాయిడ్ యాప్స్ కు matches బదులు విండోస్ కు డైరెక్ట్ లింక్స్ provide చేసింది.