ప్లే స్టోర్ లో చాలా యాప్స్ ఉంటాయి. వాటిలో useful గా ఉండేవి మీకు పరిచయం చేయటమే ఈ "మీకు తెలియని యాప్" సిరిస్ ఉద్దేశం. ఈ రోజు మీరు తెలుసుకోనున్న యాప్, Mubble.
Mubble డెవలపర్ పేరు, యాప్ పేరు Prepaid bill & Mobile balance. ప్లే స్టోర్ లో దీని సైజ్ 3.2MB 4.3 స్టార్ రేటింగ్ కలిగి ఉంది.
మీకు ఆల్రెడీ పేరు చూస్తే యాప్ use ఏంటో కొంచెం అర్థమై ఉంటుంది. కాని ఇది మీరు అనుకునే యాప్ కాదు. ఏమి చేస్తుంది?
మీ ఫోన్ లోని సిమ్ బ్యాలన్స్ ను నోటిఫికేషన్ బార్ లో చూపిస్తుంది ఎప్పుడూ. కాల్స్ చేసిన తరువాత కూడా వెంటనే అప్ డేట్ అవుతుంది బ్యాలన్స్.
ప్లస్ పాయింట్స్:
1. డ్యూయల్ సిమ్ బ్యాలన్స్ లను చూపిస్తుంది.
2. కేవలం కాల్స్ ఒకటే కాదు ఇంటర్నెట్ కూడా.
3. ఫోన్ లాంగ్వేజ్ ను తెలుగు లోకి కూడా మార్చుకోగలరు. నోటిఫికేషన్ లో తెలుగు లో బ్యాలన్స్ ను చదవటానికి బాగుంటుంది.
4 .ఇంటర్నెట్ డేటా ను యాప్ by యాప్ కూడా ట్రాక్ చేస్తుంది డైలీ. డేటా ప్లాన్స్, ఆఫర్స్ పై డిటేల్స్ కూడా తెలుసుకోగలరు.
5. బ్యాలన్స్ చూపించ టానికి ఇంటర్నెట్ అవసరం లేదు.
6. అన్నీ సిమ్ లను సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో తయారు అయిన యాప్ ఇది.
మన మొబైల్ లో డేటా లేదా కాల్స్ బ్యాలన్స్ ఎంత ఉంది అనేది ఎవ్వరికీ కోడ్స్ డైల్ చేస్తేనే కాని తెలియదు. సో ఇది వినటానికి సింపుల్ గా ఉన్నా ఆ విషయంలో నోటిఫికేషన్ బార్ లోనే ప్రతీ రోజు ఎంత బ్యాలన్స్ ఉంది అనే విషయాలను చూపిస్తుంది. యాప్ సైజ్ కూడా 3MB కాబట్టి ఒకసారి ట్రై చేయటానికి ఇబ్బందిగా అనిపించదు. కాని ఇంస్టాల్ చేస్తే వాడటం కచ్చితం. చాలా మందికి బ్యాలన్స్ లవీ ఎలా తెలుసుకోవాలో కోడ్స్ తెలియవు. యాప్ లింక్