ఈ వారం లో రిలీజ్ అయిన గాడ్జెట్స్ వివరాలు సింపుల్ గా సుత్తి లేకుండా ఇక్కడ స్లైడ్ షో లో చూడగలరు.
ఆండ్రాయిడ్ M రిలీజ్
గూగల్ నిన్న రాత్రి ఆండ్రాయిడ్ నెక్స్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ M ను అనౌన్స్ చేసింది. దీని డెవలపర్ ప్రివ్యూ అందుబాటులో ఉంది. ఫైనల్ వెర్షన్ నవంబర్ నెలలో రావచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏ మార్పులు చేయలేదు, కాని సెక్యురిటీ మరియు బ్యాటరీ లైఫ్ కు సంబందించి కొన్ని అదనపు ఫీచర్స్ ను జోడించింది ఆండ్రాయిడ్ M లో.
ఆండ్రాయిడ్ M లో ఉన్న టాప్ ఫీచర్స్ ను ఇక్కడ చదవగలరు.
గూగల్ ఫోటోస్ ఆప్ కు అన లిమిటెడ్ ఇమేజెస్ మరియు వీడియోస్ స్టోరేజి బ్యాక్ అప్ ను లాంచ్ చేసింది. ఫోటోస్ సర్విస్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐ ఓస్ మరియు వెబ్ సర్వీసు లో కూడా లభ్యమవుతుంది.
కూల్ ప్యాడ్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లొకి ఎంటర్ అయ్యింది. Dazen x7 ధర 17,999 రూ, Dazen1 ధర 6,999 రూ. ఇవి స్నాప్ డీల్ వెబ్ సైటు లో జూన్ 9 నుండి అమ్ముడు కానున్నాయి.
అధిక సమాచారం.
మైక్రోమ్యాక్స్ యునైట్ 3 ను 6,569 రూ లకు infibeam.com సైటు లో లాంచ్ చేసింది. దీని గురించి అధిక సమాచారం ఇక్కడ చదవగలరు
Huawei కంపెని ఎసేండ్ P8 మోడల్ ఫోన్స్ మూడు రిలీజ్ చేసింది. బడ్జెట్ తో పాటు హై ఎండ్ ఫ్లాగ్ షిప్ డివైజ్ ల గురించి ఇక్కడ చదవగలరు
HP కంపెని గేమింగ్ లాప్టాప్ తో పాటు రెండు పెవిలియన్ సిరిస్ లాప్టాప్స్ మరియు ఒక నోట్ బుక్ ను తాజాగా లాంచ్ చేసింది. ధర 40,000 వేల పైనే. వీటి గురించి ఇక్కడ ఎక్కువ చూడగలరు
లెనోవో కంపెని ప్రొజెక్టర్ స్మార్ట్ ఫోన్ తో పాటు లెనోవో కాస్ట్ స్ట్రీమింగ్ డివైజ్ మరియు స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసాయి. అధిక సమాచారం ఇక్కడ పొందగలరు.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 4 స్మార్ట్ ఫోన్ ను 9,499 రూ లకు లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై టీజర్ ను విడుదల చేసిన కంపెని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంటు చేయలేదు.
అధిక సమాచారం
సోనీ ఈ వారం ఎక్స్పిరియా z3+ ను లాంచ్ చేసింది. ౩జిబి ర్యామ్ స్నాప్ డ్రాగన్ 810 ఆక్టో కోర్ 64బిట్ ప్రాసెసర్ దీని సొంతం.
అధిక సమాచారం
ఎక్పిరియా M4 Aqua ను రూ. 24,990 లకు లాంచ్ చేసింది సోని. ఇది ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతుంది. దీనితో పాటు C4 పేరుతో సేల్ఫీ లవర్స్ కోసం మరో ఫోన్ అనౌన్స్ చేసింది సోని. ఇది వచ్చే నెల అమ్మకాలు ప్రారంభించుకోనుంది.
అధిక సమాచారం
Xiaomi 16000mah మరియు 5000mah పవర్ బ్యాంక్ లను లాంచ్ చేసింది ఈ వారం. జూన్ 9వ తారిఖు నుండి ఈ రెండు మి పవర్ బ్యాంక్ లు మి కంపెని అధికారిక సైటు లో అమ్మకాలు మొదలుపెట్టనున్నాయి.