ఈ వారం మీడియా టెక్ డెకా కోర్ ప్రోసెసర్ తో పాటు మొబైల్స్ మరియు ఫిట్ బ్యాండ్ లు, లాప్టాప్ లు విడుదల అయ్యాయి. మీ కోసం సింపుల్ గా వాటిని ఒకే దగ్గర జత కలిపి చూపిస్తున్నాం. చూడటానికి నెక్స్ట్ నొక్కండి.
ఇండియాలో లాంచ్ అయిన లూమియా 540, దాని ముందు మోడల్ 535 కి ఇది అప్గ్రేడేడ్ మోడల్. 9.4mm మందం తో, 152 గ్రాముల బరువు ఉన్న 540, లుమియా 535 కన్నా కొంచెం ఎక్కువ బరువుగా మరియు మందం గా ఉంది.
మైక్రోమ్యాక్స్ ఈ వారం యుఫోరియా మొబైల్ తో పాటు, యు ఫిట్ బాండ్ మరియు యుహేల్త్ కార్డ్ లను విడుదల చేసింది. వాటి గురించి ఎక్కువుగా తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి.
బ్లాక్ బెర్రీ లీప్
బ్లాక్ బెర్రీ కొత్త ఫోన్, లీప్ ను లాంచ్ చేసింది. ఫుల్ టచ్ తో వస్తున్న ఈ ఫోన్ సరికొత్త బ్లాక్ ఎర్రీ OS తో వస్తుంది.
Xolo Prime
Xolo ప్రైమ్ 3G కనెక్టివిటీ, క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు 5MP కెమెరాతోబడ్జెట్ లో విడుదల అయిన స్మార్ట్ఫోన్. ఫోన్ తాజా Android లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది.
HTC J Butterfly
జపాన్ లో ఈ వారం విడుదలైన HTC J Butterfly తన ఫ్లాగ్ షిప్ మోడల్స్ నుండి హాయ్ ఎండ్ స్పెసిఫికేషన్స్ ను తీసుకుంది అను చెప్పవచ్చు. 5.2 అంగుళాల సూపర్ LCD3 QHD డిస్ప్లే కలిగిన ఇది స్నాప్డ్రాగెన్ 810 చిప్సెట్ మరియు 3GBర్యామ్ తో వస్తుంది.
Asus ZenBook UX305
13.3 ఇంచ్ ల మరియు QHD డిస్ప్లే కలిగిన ఇది ప్రపంచంలో అతి స్లిమ్ అయిన లాప్టాప్ అని చెబుతుంది ఆసస్. ఇంటెల్ కోర్ M-5Y10 ప్రాసెసర్ మరియు అల్ట్రా ఫాస్ట్ 512GB సాలిడ్డి స్టేట్ హార్డ్ డిస్క్ తో వస్తుంది ZenBook UX305.
MediaTek Helio X20 డెకా కోర్ ప్రాసెసర్
మీడియా టెక్ నుండి కొత్తగా డెకా కోర్ ప్రాసెసర్ విడుదల అయ్యింది. త్వరలోనే మీడియా టెక్ యొక్క భారీ పది కోర్ Helio X20 ప్రాసెసర్స్ తో స్మార్ట్ ఫోన్లు లభ్యం కానున్నాయి. ముక్కోణపు దిశలో క్లస్టర్ 10 కోర్లను అమర్చడం జరిగింది.
Xiaomi కొత్త పవర్ బ్యాంక్
ఇది గత సంవత్సరం విడుదలైన పవర్ బ్యాంక్ కి 21.4 శాతం మరింత సన్నగా మరియు 30 శాతం మరింత ఎనేర్జి కలిగి ఉన్న పవర్ బ్యాంక్. దీని ధర రూ.700 వరకూ ఉండవచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా.
ఆసుస్ ZenPower కొత్త పవర్ బ్యాంకు ను ప్రారంభించింది.10,050mAh కలిగిన ఈ పవర్ బ్యాంక్ Xiaomi పవర్ బ్యాంక్ కి పోటిగా ఉంది.
ఫేస్బుక్ ఇన్స్టాంట్ ఆర్టికల్స్
కొత్తగా ఎనౌన్స్ చేసిన ఈ ఫీచర్ తో ఫేస్బుక్ ఆప్ లో ఇక నుండి న్యూస్ ఆర్టికల్స్ కు సంబంధించి కొన్ని పోస్టులు మనం చూడవచ్చు. దీని గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ చుడండి.
CHIP అనేది నిజంగా కొత్త సంచలనం
CHIP ద్వారా మీరు వెబ్ సర్ఫ్, వైఫై ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ మరియు ఒక Bluetooth కంట్రోలర్ తో గేమ్స్ ప్లే చేయడానికి అవుతుంది. ఇది ఒక ఆల్ట్రా తక్కువ ఖర్చుతో వస్తున్న కంప్యూటర్. క్రౌడ్ ఫండింగ్ సైటు, Kickstarter లో ఇది దాదాపు రూ. 600 లకి అందుబాటులో ఉంది