మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ను వాడుతునట్లు అయితే, మీ నిత్య వాడుకులో ఉపయోగపడే అప్లికేషన్లను ఇవ్వటమే ఈ ఎడిషన్ లక్ష్యం. వీటిని వాడి, మీ అవసరాలను స్మార్ట్ గా తీర్చుకోండి.
Magna Radiation :
మొబైల్ ఫోన్ వాడుక వలన కనపడని అతి పెద్ద ప్రమాదం, రేడియేషన్. అయితే దీని గురించి పట్టించుకోవటమే మానేసారు. రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి కొన్ని ఏంటి రేడియేషన్ అతి చిన్న డివైజ్ లు మార్కెట్ లో ఉన్నా, మనం వాటిని కొనటానికి ఆసక్తి చూపం, ఎందుకంటే రేడియేషన్ వలన వచ్చే నష్టాలు మనకు కనపడవు, దానికి తోడు అది చాలా లేట్ గా ఎఫెక్ట్ చూపించేది అవటం వలన దీనిని అసలు ఎవరు సమస్య కింద భావించారు. సరే మీరు వాడుతున్న ఫోన్, సిమ్ నెట్వర్క్ లో ఎంత రేడియేషన్ ఉందో చూపించటానికి మాగ్నా రేడియేషన్ అనే ఆప్ ఆండ్రాయిడ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం మీరు రేడియేషన్ ఎంత ఉందో చెక్ చేద్దామని ఒకటి రెండు సార్లు చెక్ చేసి చూసుకోవటానికే కాదు, మీరు మీ ఫోన్ నుండి ఎవరికీ ఫోన్ చేస్తున్న డిస్ప్లే పై మీరు ఉన్న దగ్గర ఎంత తీవ్రతలో రేడియేషన్ ఉందో ప్రతీ సారి చూపిస్తుంది. ఎక్కువగా ఉంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకోమని చెబుతుంది. సెల్యులర్ సిగ్నల్, సెల్యులర్ ఇంటర్నెట్ డేటా సిగ్నల్, వైఫై సిగ్నల్, 3జి సిగ్నల్ ఇలా మన చుట్టూ రకరకాల రేడియేషన్లు పెట్టుకొని తిరుగుతాం. పూర్తిగా కాకపోయినా కొంతమేరకు ఈ ఆప్ మీకు కనిపించని హెల్ప్ చాలా చేస్తాది.
డౌన్లోడ్: Magna Radiation
We Line
మీ స్మార్ట్ ఫోన్ నుండి కంప్యుటర్ కు లేదా కంప్యుటర్ నుండి స్మార్ట్ ఫోన్ కు ఫైల్స్(ఇమేజెస్, ఆప్స్, సాంగ్స్, వీడియోస్) ఎటువంటి కేబుల్స్ లేకుండా పంపించటానికి ఇది అనువుగా ఉంటుంది. ట్రాన్స్ఫరింగ్ అప్పుడు రెండు డివైజు లు ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ పై ఉండనవసరం లేదు. అంటే మీరు ఎక్కడ నుండి ఎక్కడికైనా జస్ట్ బ్రౌజర్ లింక్ ఉపయోగించి ట్రాన్స్ఫరింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది ఈ ఆప్ లో. అంతేకాదు మొబైల్ లోని ఫైల్స్ ను కంప్యుటర్ స్క్రీన్ నుండి మూవ్, డిలిట్, ఎడిట్, కాపి వంటి ఆప్షన్స్ ను ఏక్సిస్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్: We Line
Power Button FlashLight /Torch
ఆండ్రాయిడ్ ఓస్ కి చాలా ఫ్లాష్ లైట్ ఆప్స్ ఉన్నాయి. అసలు ఫ్లాష్ లైట్ కోసం ఆప్ అవసరం లేదు. కాని ఈ ఆప్ మీరు స్క్రీన్ ను ఆన్ చేయకుండానే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని టార్చ్ లా ఉపయోగించవచ్చు. కేవలం పవర్ బటన్ ను మూడు సార్లు ప్రెస్ చేస్తే టార్చ్ ఆన్ అవుతుంది.
డౌన్లోడ్ - Power Button FlashLight /Torch
Smart News
స్మార్ట్ న్యూస్ ప్రత్యేకతలు ఇంటర్నెట్ (వైఫై లేదా మొబైల్ నెట్) ఉన్నప్పుడు, మీరు ఎంచుకున్న కేటగిరీలు వైజ్ గా న్యూస్ ఆప్ లోకి లోడ్ అయిపోయి మీరు ప్రయాణాలు లేదా ఫ్రీ గా ఉన్నప్పుడు చదువుకోవటానికి Smart News పనిచేస్తుంది.
డౌన్లోడ్ : Smart News
News In Shorts
ఇప్పుడు చాలా మందికి న్యూస్ ను చదివే అంత తీరిక లేదు, అలంటి వాళ్ళకి, చాలా సింపుల్ గా డైరెక్ట్ గా న్యూస్ ని మీకు ఇవ్వటానికి News In Shorts ఆప్ బాగా నచ్చుతుంది. సూటిగా సుత్తి లేకుండా మీకు అన్ని కేటగిరి ల న్యూస్ ను అందిస్తుంది. ఏదైనా న్యూస్ యొక్క విషయం ఇంకా చదవాలని అనిపిస్తే అక్కడ మీరు పొందవచ్చు.
News In Shorts