మారిన కాలంతో ప్రజల అవసరాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కలిగివ్ ఉండడం అనేది ఒక అవసరంగా మారిపోయింది. అయితే, బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ ఫోన్ ను ఎంచుకోవడం ముఖ్యమైన విషయం. అందుకే, ఈరోజు కేవలం రూ.7,000 రూపాయల బడ్జెట్ కేటగిరిలో ఇండియన్ మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను గురించి వివరంగా చూడనున్నాము.
టెక్నో పాప్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన డాట్ నోచ్ IPS డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Helio A22 ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 12 OS ఆధారితమైన HiOS 11.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
పోకో C3 స్మార్ట్ ఫోన్ 6.53 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G35 ప్రోసెసర్ కి జతగా 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 13MP+2MP+2MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 10 OS ఆధారితమైన MIUI 12 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
మైక్రోమ్యాక్స్ 2C స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన చిన్న నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T610 SoC ప్రోసెసర్ కి జతగా 3GB LPDDR4X ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 11 OS పైన పనిచేస్తుంది.
జియోనీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన 2.5D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc 986A SoC కి జతగా 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 13MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 6,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 10 OS పైన పనిచేస్తుంది.
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ C50 పెద్ద 6.5 ఇంచ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ తో వచ్చింది. ఇందులో, 8MP మెయిన్ కెమేరాతో మరొక కెమెరాతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (Go Edition) ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.
లావా X3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్ Helio A22 చిప్ సెట్ మరియు జతగా 3GB ర్యామ్ తో మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, 512GB వరకూ స్టోరేజ్ ను విస్తరించే సామర్ధ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP ప్రధాన కెమెరా మరియు మరొక కెమెరా ఉన్నాయి. ముందు, 5MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 4000mAh బిగ్ బ్యాటరీని సాదారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 12 GoEdition పైన పనిచేస్తుంది.
షియోమి రెడ్‌మి 9A స్పోర్ట్ 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే కలిగి ఉంది. Redmi 9A Sport ఫోన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ పనిచేస్తుంది మరియు 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. ఇది MIUI 12 సాఫ్ట్ వేర్ పైన Android 10OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 13MP సింగల్ రియర్ కెమేరా మరియు 5 ఎంపి సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్‌లో ఉన్నాయి. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. షియోమి రెడ్‌మి 9A లో 5,000WAA బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ వేగంతో ఉంటుంది.
షియోమి రెడ్‌మి ఎ1 పెద్ద 6.52-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. Redmi A1 మీడియా టెక్ హెలియో జి 22 ప్రాసెసర్ కి జతగా 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది మరియు అందులో 8MP మెయిన్ కెమెరాని మరియు ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.
టెక్నో పాప్ 5 LTE స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన చిన్న నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc SC9863A ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 11 Go OS పైన పనిచేస్తుంది.
రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.
Redmi 6A స్మార్ట్ ఫోన్ 13 MP వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 1440x720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 5.45-అంగుళాల HD+ డిస్ప్లేని 295 పిక్సెల్ డెన్సిటీతో మరియు 18:9 ఎస్పెక్ట్ రేషియాతో కలిగి ఉంది. ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Helio, 2.0Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు Android v8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
JioPhone Next ఫోన్ 5.45-అంగుళాల HD(720x1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు. ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.
రియల్ మి C11 2021 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన చిన్న నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc SC9863A ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP AI ప్రైమరీ కెమేరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని సాధారణ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ వాటర్ డ్రాప్ డిస్ప్లేతో వస్తుంది. ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ మరియు 6జిబి ర్యామ్ తో జతగా వస్తుంది. SD కార్డు సహాయంతో 256 జిబి వరకూ స్టోరేజ్ మరితంగా విస్తరించవచ్చు. ఈ ఫోన్ 13MP +2MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి పెద్ద 5000 mah బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో కలిగివుంది.
నోకియా 1 స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ MT6737 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 1.1GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 1GB RAM ఇవ్వబడింది. ఈ హ్యాండ్‌సెట్ 4.5-అంగుళాల 218 PPI, IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఇందులో మీకు 5MP ప్రైమరీ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా మరియు LED ఫ్లాష్ అందుతాయి. ఈ ఫోన్‌లో 2150 mAh రిమూవల్ బ్యాటరీ సపోర్ట్ మరియుమైక్రో-USB పోర్ట్ ఉన్నాయి.
CAT B26 ఫోన్ Spreadtrum SC6531F ప్రాసెసర్ శక్తిని పనిచేస్తుంది. దీనితో పాటు, ఫోన్ 8MB RAM మరియు 8MB స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని SD కార్డ్ సహాయంతో 32GB వరకు పెంచవచ్చు. ఇది కాకుండా, ఈ ఫోన్ 2MP వెనుక కెమెరాను కలిగి ఉంది, ఇది మీ చాలా ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ ఫోన్ లో మీకు 1500mAh బ్యాటరీని అందిస్తుంది.
గమనిక: ఈ చిత్రం కల్పితం!
టెక్నో పాప్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Helio A22 ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 8MP+AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగివుంది. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పెద్ద 5,000mAh బ్యాటరీతో వచ్చింది.
Realme Narzo 50i Prime లో 8MP ప్రైమరీ కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్ LED ఫ్లాష్ ఉన్నాయి. ఇది 1.82GHz, డ్యూయల్ కోర్ + 1.8GHz, హెక్సా కోర్ వద్ద క్లాక్ చేయబడిన Unisoc T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు జతగా 3GB RAM ఉంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల 270 PPI, IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, మైక్రో-USB పోర్ట్ తో కలిగి ఉంది.
నోకియా సి01 ప్లస్ స్మార్ట్ ఫోన్ 5.45 ఇంచ్ HD డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ 1.6 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అలాగే, 2జిబి ర్యామ్ మరియు 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అవస్తుంది.ఈ నోకియా బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS (గో ఎడిషన్) తో వస్తుంది మరియు రెండు సంవత్సరాల వరకూ అప్డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 5MP సింగిల్ కెమెరా HDR సపోర్ట్ వుంది మరియు ఫ్రెంట్ 2MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 3000 mAh రిమూవబుల్ బ్యాటరీని మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ ను కూడా కలిగివుంది.
షియోమి రెడ్ మి గో ఫోన్ 5-ఇంచ్ LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో పనిచేస్తుంది. 8GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజికి జతగా 1 జీబి ర్యామ్ తో ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెల్ఫీ కెమేరాని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 5.3 ఇంచ్ HD + రిజల్యూషన్ డిస్ప్లే వుంది. గెలాక్సీ M01 కోర్ ఫోన్ మీడియాటెక్ MT6739 క్వాడ్-కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 జిబి ర్యామ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ వెనుక సింగల్ 8MP కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 8MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో ఫ్రెంట్ 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ 2 జిబి ర్యామ్ మరియు 2GB వర్చువల్ ర్యామ్ / 64 జిబి స్టోరేజ్ తో హీలియో A22 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ XOS 7.6 సాఫ్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.
మోటో సి ప్లస్ స్మార్ట్ ఫోన్ 5 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Mediatek MTK6737 క్వాడ్ కోర్ ప్రొసెసర్ మరియు 2జిబి ర్యామ్ తో జతగా వస్తుంది మరియు 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 8MP రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 2MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మోటోరోలా స్మార్ట్ ఫోన్ 4000 mah బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో కలిగివుంది.
రూ.8,000 లోపల బెస్ట్ వాల్యూ ఫర్ మని స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే Click Here