ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Feb 07 2020
ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చినప్పటినుండి ప్రతిఒక్కరు కూడా కాలింగ్ కంటే కూడా ఎక్కువగా డేటాని వాడుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఇందుకు కారణం,PUBG వంటి మరికొన్ని ఆన్లైన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ సినిమాలతో పాటుగా చాటింగ్ మరియు మరీముఖ్యంగా TikTok వంటి యాప్స్ ఎక్కువగా వాడుకలోకి రావడమే, అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే, ప్రస్తుత టెలికం ప్లాన్స్ గురించి చూస్తుంటే, ఈ మధ్యకాలంలో అన్ని ప్రధాన టెలికం సంస్థలు కూడా వాటి ధరలను పెంచేశాయి. అయితే, ఒక సంస్థ మాత్రం, మీకు అత్యంత చవక ధరకే, డేటాని అఫర్ చేస్తోంది. అదే, "Dabba WiFi" ఇది కేవలం 1 రూపాయికే 1GB డేటాని అదీకూడా 1Gbps స్పీడ్ తో అఫర్ చేస్తోంది. ఇంట మంచి అవకాశాన్ని అందిస్తున్న ఈ సంస్థ మరియు దీని యొక్క ఆఫర్లతో పాటుగా మరిన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

1. ఈ WiFi ఏమి అఫర్ చేస్తోంది    

ఈ డబ్బా WiFi గురించి మనం మాట్లడుకోవాల్సిన వాటిలో దీని ఆఫర్లు ముఖ్యమైనవి. ఈ డబ్బా వైఫై తో మీకు ఉచితంగా ఒక WiFi రౌటర్ ని ఆఫర్ల చేస్తోంది. వాస్తవానికి, మీరు ఇతర సంస్థల నుండి WiFi కనెక్షన్ కోసం ఆశిస్తే, దీనికోసం డిపాజిట్ రూపంలో కొంత మొత్తాన్ని లేదా రౌటర్ కోసం విడిగా డబ్బును చెల్లించాల్సి వస్తుంది. 

ఇక దీని కనెక్షన్ వివరాల్లోకి వెళితే, ఇది 1Gbps స్పీడ్ అందిచే విధంగా వస్తుంది మరియు దీనికి ఎటువంటి FUP పరిమితి కూడా లేదు. ఇక ఇనిస్టాలేషన్ గురించి చూస్తే, ఇది మీకు పూర్తి ఉచితంగా దొరుకుతుంది మరియు ఒక 1Gbps రౌటర్ కూడా ఉచితంగా లభిస్తుంది.

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

2. ఈ ఉచిత రౌటర్ ఎటువంటిది

 ఈ రౌటర్ ఒక క్వాల్కమ్ చిప్సెట్ తో వస్తుంది మరియు ఇది Dabba OS తో పనిచేస్తుంది. ఈ WiFi రౌటర్ 2.4ghz + 5ghz ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఇది అంతర్గత VPN, బ్యాండ్ విడ్త్ సేవర్ మరియు ప్రైవేసి గార్డ్ తో పాటుగా వస్తుంది. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

3. ఫ్రీ డేటా అఫర్ ఎలా వాడుకోవాలి

ఈ WiFi సర్వీస్ మీకు ఉచిత డేటా సర్వీస్ ను కూడా ఆఫర్ల చేస్తోంది. దీనిని పొందడం కోసం మీరు పజిల్ ని పూరించడం లేదా యాడ్స్ ని చూడడం వంటి పనులను చేయాల్సి ఉంటుంది. మరింత దాటని పొందాలంటే కూడా ఇదే విధంగా మరిన్ని పజిల్స్ లేదా యాడ్స్ ని చూడడం ద్వారా ఎక్కువ డేటాని పొందవచ్చు. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

4. నో పజిల్స్ & నో యాడ్స్

ఒకవేళ మీకు పజిల్స్ లేదా యాడ్స్ చూడం ఇష్టం లేకపోయినట్లయితే, మీరు డేటా కోసం రుసుమును చెల్లించాల్సి వుంటుంది. కానీ, దీని గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీరు కేవలం 540 రుపాయలతో 200GB హై స్పీడ్ డేటాని పొందవచ్చు మరియు దీని ఎటువంటి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

5. ఉచిత WiFi రోమింగ్

ఈ సంస్థ, అన్ని ప్రాంతాలలో కూడా తన సర్వీసును విస్తరించడం ద్వారా మీరు ఎక్కడికి నువెళ్ళినా కూడా మీకు నిరంతర డేటా నెట్వర్క్ సర్వీస్ అందించాడని మీకు యాక్సెస్ అందిస్తుంది. అయితే, దీనికి కొంత సంశయం పడుతుంది. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

6. ఈ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది

 సాధరణంగా ISP లు తమ సర్వీస్ ను అందించడానికి అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని అవలంభిస్తాయి మరియు ఇది కొంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా ఉంటుంది. అయితే ఏ డబ్బా WiFi మాత్రం తన నెట్వర్క్ టవర్లను నిర్మించడం ద్వారా ఒక చైన్ లాగా తమ సర్వీసును ఎటువంటి అంతరాయం లేకుండా అందిస్తునట్లు సంస్థ తెలిపింది. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

7. ఇంత వేగవంతమైన డేటా ఎలా అందిస్తుంది

ఈ సంస్థ తెలిపిన ప్రకారం, WiFi డబ్బా సూపర్ నోడ్స్ విధానము వాడుకుంటుంది. అంటే, ఇది ఒక సర్క్యూట్ పద్దతిలో తమ నెట్వర్క్ ను ఉపయోగించడం ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా మరియు వేగవంతమైన సర్వీస్ ఇస్తుంది. ఇది 20 కిలోమీటర్ల పరిధిపై వరకూ తమ నెట్వర్కును వెదజల్లే శక్తిని కలిగివున్నట్లు తెలుస్తోంది. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

8. టి షాపులు మరియు బేకరీలు

ఈ సంస్థ, భారతదేశ ప్రజల నాడిని తెలుసుకోండి. ఎక్కువగా ప్రజలు తమ టైం పాస్ చేసే ప్రాంతాలైనటువంటి తీ కోట్లు, బేకరీలు మరియు ఇటువంటి మరిన్ని ప్రాంతాలల్లో తమ WiFi డబ్బాలను ఉంచడం ద్వారా ఆ ప్రాంతంలో డేటా నెమ్మదించే సమస్యను అధిగమిస్తుంది. 

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

9. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది

ప్రస్తుతానికి, ఈసంస్థ తమ సేవలను కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం అంతటా అందిస్తోంది. బెంగుళూరు సిటీలో అతితక్కువ ధరకు వేగవంతమైన మరియు ఎటువంటి అంతరాయం లేకుండా WiFi డేటా సేవలను అందిస్తున్న సంస్థగా ప్రజల మన్ననలను అందుకుంటోంది

ఉచిత WiFi రౌటర్, 1 రుపాయికే 1GB డేటాని 1Gbps స్పీడ్ తో అఫర్ : దీని గురించిన టాప్ 10 ఫ్యాక్ట్స్

10. మన ప్రాంతానికి ఎప్పుడొస్తుంది

మీరు ఈ సర్వీసును మీ సిటీలో లేదా మీ ప్రాంతంలో పొందాలనుకుంటే, ఈ https://supernode.wifidabba.com వైబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఎక్కువ మీ ప్రాంతానికి సంభందించి ఎంత ఎక్కువ మంది ప్రజలు Register చేసుకుంటారో అంత త్వరగా మీకు ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. వాస్తవానికి, అన్ని ప్రధాన నగరాలలో తమ సర్వీస్ ను అందించానికి ప్రయత్నిస్తునట్లు అంచనావేస్తునారు.