చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jan 15 2020
చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

చాల తక్కువ ధరతో మంచి కెమెరాలతో, అదికూడా ఒకటి రెండూ కాదు ఏకంగా ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) వచ్చిన ఫోన్ల యొక్క జాబితా ఇక్కడ అందించాను. మీరు ఒక ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా సెటప్పుతో కూడిన ఒక ఫోన్ గురించి చూస్తున్నట్లయితే, ఈ సొగసైన ఫోన్లను చాలా తక్కువ ధరలో కొనవచ్చు. ఈ రోజు, ఈ కెమెరా సెటప్‌తో వచ్చే స్మార్ట్‌ ఫోన్లు మరియు వాటి గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ కెమెరా సెటప్‌ను కచ్చితంగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇవి తాజా సాంకేతికతతో వచ్చాయి.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

1. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ : Rs. 5,999

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.  ఇది 269ppi పిక్సెళ్ళ సాంద్రతను కలిగి, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు ఒక 88 శాతం బాడీ-టూ-స్క్రీన్ రేషియాతో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోను యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఇటీవల మీడియా టెక్ తాజాగా ప్రకటించిన 2.0GHz క్లాక్ స్పీడ్ చేయగల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో పాటుగా ఒక SD మెమొరీ కార్డ్ తో 256GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక ఇందులోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.8 అపర్చరు కలిగిన ఒక ప్రధాన కెమేరాతో పాటుగా ఒక 2MP కెమేరా మరియు మరొక లో లోట్ సెన్సార్ కలగలిపి అందించిన ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో ఒక 8MP AI కెమెరాతో వస్తుంది. అధనంగా, ఇది AI బొకే, AR స్టిక్కర్లు AI బ్యూటీ మోడ్ వంటి అనేక ప్రత్యేకమైన ఫిచర్లతో, ఈ కెమెరాలను అందించింది. 

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

2. ఇన్ఫినిక్ హాట్ 8 : Rs.6,999 

ఈ INFINIX HOT 8 స్మార్ట్ ఫోన్  ఒక 6.52 అంగుళాల HD+ IPS డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది . ఈ స్మార్ట్ఫోన్ను ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.0 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.

ఈ  HOT 8 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  13 మెగాపిక్సెల్ (f1.8) ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక లో లైట్ సెన్సార్ జతగా కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 8-MP AI కెమెరాని ఒక ఫ్లాష్ ని కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

3. VIVO U10 : Rs. 8,990 

ఈ వివో యు 10 ఒక పెద్ద 6.35-అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

4. రియల్మి 5 : Rs. 9,999

 రియల్మి 5 యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల మినీ-డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది, దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 89% గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోనుకు క్రిస్టల్ డిజైన్ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ను క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ కూడా రియల్మి 5 ప్రో మాదిరిగానే వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంది. ఇది 240fps స్లో-మో వీడియో, 190 డిగ్రీల వ్యూ ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

5. శామ్సంగ్ గెలాక్సీ M 30 : Rs.9,999 

శామ్సంగ్ గెలాక్సీ M 30 ఫోనుతో సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ పొందుతారు, ఈ మొబైల్ ఫోనులోని బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఈ ఫోన్‌లో 13 ఎంపి ప్రైమరీ సెన్సారుకు జతగా ఒక 5 ఎంపి డెప్త్ సెన్సార్‌మరియు ఒక 5 MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఉంటుంది. అంటే, ఈ ఫోన్‌లో మీరు ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతున్నారు మరియు ఒక పెద్ద 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

6. వివో జెడ్ 1 ప్రో : Rs.13,990

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

7. హానర్ 20 i : Rs.12,999

హానర్ 20i స్మార్ట్ ఫోన్,  ఈసిరిస్ యొక్క ప్రధాన ఫోన్‌ల రూపకల్పనతో వచ్చిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. వెనుక ప్యానెల్‌లో గ్రేడియంట్ కలర్ డిజైన్, అలాగే నిలువుగా అమర్చిన ట్రిపుల్ కెమెరా సెటప్పుతో అందించబడుతుంది. ఈ హానర్ 20i ను ఫాంటమ్ బ్లూ, ఫాంటమ్ రెడ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్స్ లో కొనవచ్చు. ఈ హానర్ 20 i ఫోన్ రూ .14,999 ధరలో 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ కలిగి ఉంది. ఇది AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 24MP + 8MP + 2MP కెమేరాలను కలిగి ఉంటుంది.  ఈ పరికరం యొక్క ప్రధాన కెమెరా AIS సూపర్ నైట్ షాట్లను తీయగలదు.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

8. VIVO Y15: Rs.12,990 

ఈ ఫోన్ యొక్క స్క్రీన్ పైభాగంలో ఒక వాటర్ డ్రాప్ నాచ్ ఇవ్వబడింది, దీనిలో ఒక సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పరికరాన్ని మీడియాటెక్ హెలియో పి 22 ఆక్టా-కోర్ SoC, 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో పరిచయం చేశారు. వివో వై 15 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఒక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండవ 8 మెగాపిక్సెల్ కెమెరా మరియు మూడవ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలగలిపిన, ట్రిపుల్ కెమేరా సేటప్పు ఇందులో ఉంటుంది. ఈ పరికరం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది, ఇది ఫేస్ అన్‌లాక్ కోసం కూడా పనిచేస్తుంది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

9. షావోమి Mi A 3 : Rs.12,999 

షావోమి మి A3 లో ఒక 6.08-అంగుళాల HD + AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది ఒక 7 వ తరం ఇన్ - డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 720x1560 p రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వాటర్‌డ్రాప్-నోచ్ డిజైన్‌తో 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది, ఇది 4GB / 6GB RAM శక్తితో మరియు 64GB / 128GB వంటి ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  3.5 హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంది, దీనిలో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 MP ప్రాధమిక సెన్సార్ ఉంటుంది. అలాగే, 118-డిగ్రీల వైడ్ యాంగిల్ f / 1.79 లెన్స్‌తో 8MP సెకండరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 MP కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4030mAh బ్యాటరీ మద్దతు ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.మరియు టైప్-సి యుఎస్‌బి పోర్ట్‌తో వస్తుంది.

చౌకధరలో వచ్చిన బెస్ట్ ట్రిపుల్ (3) మరియు క్వాడ్ (4) కెమేరా ఫోన్లు

10. శామ్‌సంగ్ గెలాక్సీ M 30s : Rs.13,999 

ఈ గెలాక్సీ M30s ఒక 6.4-అంగుళాల FHD + సూపర్ AMLOED డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఒపల్ బ్లాక్, సఫైర్ బ్లూ మరియు పెర్ల్ వైట్ వంటి కలర్ ఎంపికలలో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఇది సామ్‌సంగ్ వన్ UI స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 పై OS పైన పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది మరియు గేమింగ్ వినియోగదారుల కోసం, ఈ ఫోన్ గేమ్ బూస్టర్ ఫీచర్‌ను కలిగి ఉంది, ఇది AI ని ఉపయోగించి మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక వెనుక ప్యానెల్‌లో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంచబడింది.