రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 30 2016
రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

మీరు స్మార్ట్ ఫోన్ కొనే ముందు బయట స్టోర్స్ లో మీకు నచ్చిన మొబైల్ "మంచిదా కాదా??" అని ఈ క్రింద విషయాలను పాటించటం ద్వారా చెక్ చేయవచ్చు.  అయితే  షాప్ కు వెళ్లేముందు ఇంటర్నెట్ లో ఏ సైటు లో అతి తక్కువ ధరకు వస్తుంది, ఫోన్ రివ్యూస్ మరియు బెంచ్మార్క్ టెస్ట్ స్కోర్స్ ను తెలుసుకొని వెళ్ళండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు.  ఆన్ లైన్ లో కన్నా తక్కువకి వస్తే తప్ప బయట కొనటం స్మార్ట్ బయింగ్ కాదు. మా రికమెండేషన్ ఆన్ లైన్ లో కొనటం మంచిది. మనీ పేమెంట్ పై సందేహాలు ఉంటే మీకు డెలివరీ అయిన తరువాత డబ్బులు కట్టే ఆప్షన్ పెట్టుకోవచ్చు కదా! 

రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

Display Test
1. గొరిల్లా గ్లాస్ డిస్ప్లేలు అయితే ఫోన్ టచ్ స్మూత్ గా ఉంటుంది. స్క్రాచేస్ కూడా రెసిస్ట్ చేస్తుంది.
2. డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఫోన్ స్క్రీన్ పై కంటెంట్ కనిపిస్తుందా లేదా చూడండి.
3. వీడియో ప్లే చేసి, మొబైల్ ను ఒక దగ్గర పెట్టి మీరు వేరియస్ యాంగిల్స్ నుండి చూడండి. ఎక్కడైనా కలర్ షిఫ్ట్ అవుతుంటే మంచిది కాదు.
4. డిస్ప్లే టెస్ట్ చేయటానికి షాప్ లో నెట్ ఉంటే, lagom.nl సైటు బ్రౌజర్ లో ఓపెన్ చేసి LCD టెస్ట్ చేయండి. 
5. యాప్స్ పై కాని మామూలగా కాని టచ్ ను వాడుతుంటే, టచ్ క్రింద డిస్ప్లే ఏమైనా smudge అవుతుందో లేదో గమనించండి.

రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

Build క్వాలిటీ
1. ఫోన్ బిల్డ్ క్వాలిటీ టెస్ట్ చేయటానికి మొబైల్ ను బెండ్ చేయకండి. క్లోజ్ గా ఫినిషింగ్ ఎలా ఉందో గమనించండి.
2. మొబైల్ కు screws ఉంటే, లూజ్ గా ఉన్నాయామో చూడండి.
3. Edges లో ప్రెస్ చేస్తున్నప్పుడు సౌండ్స్ ఏమైనా వస్తున్నయామో గమనించండి.
4. బ్యాక్ ప్లాస్టిక్ ప్యానల్ అయినట్లయితే, అది ఎటువంటి మేటేరియాల్ అనే విషయాన్ని తెలుసుకోండి.(ఇది నెట్ లో దొరుకుతుంది)
5. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ attract అవకుండా ఉంటే మంచిది.
6. స్లిమ్ స్లాట్స్ ఉంటే, తీసి చూడండి స్ట్రక్ అవుతుందేమో గమనించండి, చాలా వరకూ డెలికేట్ గా ఉంటున్నాయి.
7. బ్యాక్ ప్యానల్ రిమూవబాల్ అయితే, తీసి బెండ్ చేసి క్వాలిటీ చెక్ చేయండి.

రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

పెర్ఫార్మెన్స్
1. ఫోనులోని పెద్ద యాప్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి. ఎంత సేపటికీ ఓపెన్ అవుతున్నాయో గమనించండి. ఖచ్చితంగా ఫోన్ ఒక యూజర్ చేత వాడబడటం లేదు కాబట్టి లాగ్స్ ఏమీ చూపించదు. అందుకని యాప్స్ అన్నీ ఓపెన్ చేసి, అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతుండగా, కొత్త యాప్స్ ను ఓపెన్ చేసి ఓపెనింగ్ స్పీడ్ గమనించండి.
2.  కెమేరా ఓపెన్ చేసి, వీడియోను షూట్ చేయండి కొంత సేపు. ఇప్పుడు ఫోన్ వేడెక్కుతోందేమో గమనించండి. కొంచెం ఫర్వాలేదు కాని మరీ ఎక్కువుగా ఉంటే మంచిది కాదు. పైగా స్టోర్స్ లో AC కూడా ఉంటాయి. హిటింగ్ ప్రొసెసర్ పెర్ఫార్మెన్స్ ను తగ్గిస్తుంది.
3. స్టోర్ లో నెట్ ఉంటే(WiFi ఆన్ చేసి ఫ్రీ నెట్వర్క్స్ ను సర్చ్ చేయండి. ఏమైనా లాక్ అయిన wifi కనెక్షన్స్ కనపడితే, స్టోర్ లో పాస్వర్డ్ అడిగి చూడండి. లేక పొతే మీ దగ్గర ఉన్న 2G లేదా 3G నెట్ కనెక్షన్ ను wifi హాట్ స్పాట్ ద్వారా ఆ ఫోన్ కు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ ను ఏక్సిస్ చేయండి అందులో), SunSpider వంటి బెంచ్మార్క్ స్కోర్స్ ను బ్రౌజర్ లో రన్ చేసి పెర్ఫార్మెన్స్ ను చెక్ చేయండి. ఇంటర్నెట్ లో ఆ ఫోన్ యొక్క ఇలాంటి బెంచ్ మార్క్స్ టెస్టులు చూసుకోగలరు.

రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

కెమేరా
1. కెమేరా కు ఆటో ఫోకస్ ఉంటే మినిమమ్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ LED ఫ్లాష్, ఇది టార్చ్ లైట్ గా కూడా మీకు ఉపయోగపడుతుంది.
2. రికార్డింగ్ విషయానికి వస్తే మినిమమ్ HD రికార్డింగ్ ఉంటే బాగుంటుంది.
3. మీరు కొనబోయే ఫోన్ నుండి ఫోటో(బ్రైట్ కలర్స్ ఉన్న వాటిని తీయండి) ను తీసి, మీరు వాడతున్న ఫోన్ లోకి బ్లూటూత్ ద్వారా ట్రాన్సఫర్ చేసి మీ ఫోన్ డిస్ప్లే లో ఎలా కనిపిస్తుందో చెక్ చేయండి. ఆ ఫోనులో చెక్ చేయవద్దు. (ఇలా ఎందుకంటే, మీరు కొనబోయే ఫోన్ డిస్ప్లే కన్నా మీ దగ్గర ఉన్న ఫోన్ డిస్ప్లే గురించి మీకు ఎంతోకొంత తెలుసు కాబట్టి). ఇప్పుడు అదే ఇమేజ్ ను మీ సొంత ఫోన్ మరియు కొనబోయే ఫోన్ నుండి తీసి మీ సొంత ఫోనులో కు ట్రాన్సఫర్ చేసి, రెండింటికి తేడా చూస్తే మీకు కొనబోయే ఫోన్ యొక్క కెమేరా గురించి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా చేస్తే వైట్ బ్యాలన్స్ మరియు కలర్ రిప్రోడక్షన్ పై స్పష్టత రాదు కాని కెమేరా ఎలా ఉండ నుందో ఓవర్ ఆల్ గా తెలుస్తుంది. 
 

రిటేయిల్ స్టోర్ లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఇవి టెస్ట్ చేయాలి

బ్యాటరీ
ఒకసారి చార్జర్ ను డిస కనెక్ట్ చేయమని స్టోర్ పర్సన్ ను రిక్వెస్ట్ చేయండి. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ చెక్ చేసి, హై రిసల్యుషణ్ లో ఫోన్ తో 5నిముషాలు వీడియో షూట్ చేయండి. ఇప్పుడు బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ కు పడి పోయిందో చూడండి. హై ఎండ్ ఫోన్ అయితే 2 % కు మించి డ్రాప్ అవ్వకూడదు బ్యాటరీ,  10K లోపు ఖరీదు గల ఫోనులు 5 % వరకూ తగ్గవచ్చు. ఇంతకుమించి తగ్గితే మంచిది కాదు. గమనిక: ఈ ఆర్టికల్ కొద్ది కాలం క్రితం వ్రాసినది. సో ఏమైనా విషయాలు కొంచెం outdated గా అనిపించవచ్చు.