మోడల్ ఏదైనా దానిలో ఉన్న ర్యామ్ యొక్క ఫ్రీ స్పేస్ తక్కువ ఉండటం వలన హాంగ్ అవుతుంది ఫోన్. ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉండటానికి.. మీరు వాడకుండా ఉన్న యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి, వాటిని రీసెంట్ యాప్స్ లిస్టు లోకి వెళ్లి క్లియర్ చేయాలి. మీరు exit లేదా బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన క్లోజ్ చేశాము అని అనుకుంటన్న యాప్స్ అన్నీ వెనుక రన్ అవుతాయి. (కొన్ని యాప్స్ క్లియర్ చేసినా మీకు కనిపించకుండా రన్ అవుతాయి) మరిన్ని indepth టిప్స్ కు క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయండి.
చాలా యాప్స్, మొబైల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంటాయి. ఇలా స్టార్ట్ అవటం వలన అనవసరంగా ఎక్కువ ర్యామ్, ఇంటర్నెట్ అండ్ బ్యాటరీ కూడా వెస్ట్. స్టార్ట్ అవకుండా ఉండటానికి Auto Start పేరుతో ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ ను use చేసి, డిసేబుల్ చేయాలి. చైనా బేస్డ్ కంపెనీలు, ఆసుస్ వంటి వాటికీ ఇంబిల్ట్ గా ఆటో స్టార్ట్ మేనేజర్ యాప్స్ ఉంటాయి.
ఆటో స్టార్ట్ లో పుష్ నోటిఫికేషన్స్ ఇచ్చే రెగ్యులర్ సోషల్ యాప్స్ అంటే వాట్స్ అప్, ఫేస్ బుక్, మెసెంజర్ వంటివి డిసేబుల్ చేయకండి. మీకు నోటిఫికేషన్స్ రావటం మానేస్తాయి. (ఆఫ్ కోర్స్ వీటి వలనే ర్యామ్ బాగా ఉపయోగించబడుతుంది. సో మీరు నిజంగా పుష్ నోటిఫికేషన్స్ పై ఆధారపడేంత గా వాటిని వాడుతుంటేనే, వీటిని ఆటో స్టార్ట్ లో enable చేసుకోవటం కరెక్ట్)
ఫోన్ హాంగ్ అవటానికి సాఫ్ట్ వేర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కూడా కారణం అవుతాయి. రెగ్యులర్ స్టాక్ os కాకుండా Custom os( custom UI కాదు) తో వచ్చే ఏ ఫోన్ అయినా హంగింగ్, క్రాషింగ్ అవుతుంది. ఫర్ eg oneplus లో ఉండే ఆక్సిజన్ os మరియు యుటోపియా లో ఉన్న Cyanogen os. చాలా బగ్స్ తో వస్తున్నాయి.
మీరు యాప్స్ ను sd లోకి మూవ్ చేస్తే మీ కార్డ్ ఎక్కువ క్లాస్ ఉన్నది అయితేనే యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. Class 10 sd కార్డ్ బెస్ట్. సో మూవ్ చేసుకోండి కాని రోజూ ఎక్కువ సేపు వాడే వాటిని చేయటం కన్నా రేర్ గా use చేసే వాటిని మూవ్ చేయండి.
యాంటి వైరస్, ఆటో క్లీనర్ యాప్స్ వలన మీకు జరిగే మేలు ఉంటుంది ఏమో కాని అవి తక్కువ ర్యామ్ కలిగిన ఫోన్లలో వాడితే ఫోన్ హాంగ్ అవుతుంది. కారణం సింపుల్. ఇలాంటి యాప్స్ ఎల్లప్పుడూ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. క్లియర్ cache వారానికి ఒక సారి సెట్టింగ్స్ – యాప్స్ లోకి వెళ్లి పైన రైట్ కార్నర్ లో ఉండే సెట్టింగ్స్ లోకి వెళ్లి చేయగలరు.
యాప్ ఏదైనా అది ఫోన్ లో రిసోర్సెస్ ను ఎక్కువుగా తీసుకుంటే అదే మీ ఫోన్ స్పీడ్ తగ్గటానికి ప్రధాన కారణం. ఇలాంటివి ఒక యాప్ కాదు కదా చాలా యాప్స్ ఉంటాయి. వాటిని గుర్తించి.. అవసరం అనిపిస్తే ఉంచాలి. లేదంటే Greenify వంటి యాప్ వాడి హైబర్నేట్ చేయాలి. ఇది కేవలం మీకు యాప్ తో use ఉన్నప్పుడే ఆ యాప్ ను రన్ చేస్తుంది. దీనిపై కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో.
మీరు ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్ వంటి విషయాలకు పెద్ద ఫ్యాన్ కాకపోతే, ఫేస్ బుక్, ట్విటర్, quora వంటి యాప్స్ ను బ్రౌజర్ లో కూడా వాడుకోగలరు. fb మెసెంజర్ కూడా మీరు డైలీ చాటింగ్ లు చేస్తేనే బెటర్, లేదంటే బ్రౌజర్ లో నుండి కూడా మెసేజింగ్ చేయగలరు. దీని వలన చాలా ఇంటర్నల్ స్టోరేజ్, ర్యామ్ అండ్ బ్యాటరీ మూడు సేవ్ అవుతాయి. UC, ఒపేరా బ్రౌజర్ లో అయితే ఫాస్ట్ గా యాక్సెస్ అవుతాయి సైట్స్. పుష్ నోటిఫికేషన్స్ మాత్రం వీటితో పాటు క్రోమ్ బ్రౌజర్ లో కూడా వస్తున్నాయి.
రోజు రోజుకీ ఆండ్రాయిడ్ లో కొత్త ఆప్షన్స్ అండ్ UI మార్పులతో అప్ డేట్స్ చాలా ఎక్కువుగా వస్తున్నాయి యాప్స్ కు. వీటి వలన యాప్స్ రిసోర్సెస్ పెరిగిపోతున్నాయి. భారీగా బ్యాక్ గ్రౌండ్ లో స్మార్ట్ ఫోన్ హార్డ్ వేర్ ను వాడుతున్నాయి. సల్యుషణ్ – అప్ డేట్ చేసుకుంటే ముందు మీకు అవసరం అయిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి చేసుకోండి. మీకు కావలసిన అవసరాలను తీర్చే యాప్స్ ను మాత్రమే ఎంచుకోవటం కరెక్ట్. అనవసరం మైన ఫీచర్స్ కారణంగా యాప్స్ MB సైజ్ పెరుగుతుంది కూడా. ప్లే స్టోర్ లో వాటిని వెతికి వాడుకోండి.
లాస్ట్ పాయింట్. మీ ఫోన్ లో 1gb ర్యామ్ ఉంటే సిస్టం హాంగ్ అవటం చాలా కామన్ అవుతుంది. అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ లో భారీగా రిసోర్సెస్ వాడే యాప్స్(fb, twitter, messenger) ఉండవు. వాళ్ళ వాడుక కూడా మినిమల్ గా ఉంటుంది.
మీరు కనుక ప్రస్తుతం ఫోన్ కొనే ఉద్దేశ్యం లో ఉంటే, పవర్ users (ఎక్కువ యాప్స్ ఇంస్టాల్ చేసే వారు, గేమ్స్ బాగా ఆడేవారు) కు 4gb ర్యామ్ అవసరం ఉంటుంది. నార్మల్ users కు 3gb అవసరం ఉంది. 2gb సరిపోతుంది, కాని ఫ్యూచర్ లో వచ్చే యాప్ అప్ డేట్స్ మరిన్ని ఆప్షన్స్ తో రిసోర్స్ hogs గా మారనున్నాయి. 3gb ర్యామ్ తో 9 వేల రూ లకు కూల్ ప్యాడ్ నోట్ 3 మంచి ప్రైస్ లో ఉంది.
రూటింగ్ చేసుకుంటే ర్యామ్ – హాంగ్ - స్పీడ్ వంటి విషయాలకు మంచి టిప్స్ ఉన్నాయి. ఫోన్ తో వచ్చే సిస్టం యాప్స్ ను uninstall చేయటం, greenify ను రూట్ మోడ్ లో వాడి పవర్ ఫుల్ ఆటో హైబర్నేషన్ చేయటం చేసుకోగలరు. రూటింగ్ పై కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చూడగలరు.