ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి Covid-19 కోసం ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే, చాలా మంది ప్రజలు ఈ వ్యాక్సిన్ స్వీకరించారు. ఈ Covid-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో ఎవరైనా రిజిష్టర్ చేసుకోవచ్చు. అయితే, ఆన్లైన్లో Covid-19 వాక్సిన్ కోసం రిజిష్టర్ చేసే ముందుగా ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.
ఆన్లైన్లో జరిగే మోసాల గిరినుంచి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దేని గురించి ఎక్కువగా ప్రజలు సెర్చ్ చేస్తారో, ఆ విషయాన్ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా మోసాలు చేస్తుంటారు. అందుకే, కేవలం అధికారిక వెబ్సైట్ నుండి లేదా యాప్ నుండి మాత్రమే రిజిష్టర్ చేస్తున్నామా లేదా అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోండి. Covid-19 వ్యాక్సిన్ కోసం కేవలం https://www.cowin.gov.in/home అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే రిజిస్టర్ చెయ్యడం మంచింది.
ఇది సాధారణంగా మనందరికి తెలిసిన విషయమే. డబ్బులు ఎక్కువ ఇస్తే చాలు Covid-19 వ్యాక్సిన్ మీ వద్దకు వస్తుంది, అని ఎవరైనా చెబితే అస్సులు నమ్మకండి. ఎందుకంటే, ప్రస్తుతం ఈ వాక్సిన్ డోస్ లు చాలా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉండడం మరియు దీని సంబంధించి మొత్తం వివరాలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో బయట విడిగా లభించే ఛాన్స్ అస్సులు లేదు.
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ప్రపంచమే స్మార్ట్ ఫోన్. మోసగాళ్లు కూడా దీన్నే టార్గెట్ చేసుకుని యాప్స్ తీసుకొస్తున్నారు. Covid-19 వ్యాక్సిన్ రిజిష్టర్ యాప్ పేరుతో లేదా మరింకేదైనా పేరుతొ Covid-19 వ్యాక్సిన్ రిజిష్టర్ కోసం సహాయం చేసే యాప్స్ అంటూ ఏవైనా యాప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. Covid-19 వ్యాక్సిన్ రిజిష్టర్ గురించి వివరాల కోసం ఆరోగ్య సేతు యాప్ ని మాత్రమే సంప్రదించడం మంచిది.
Covid-19 వ్యాక్సిన్ రిజిష్టర్ ఎలా చెయ్యాలి
https://www.cowin.gov.in/home లేదా ఆరోగ్యసేతు యాప్ నుండి రిజిష్టర్ చెయ్యాలి
CoWIN పోర్టల్ హోమ్ పేజిలోకి వెళ్లాలి
ఇక్కడ కుడి వైపున పైన Register Your Self పైన నొక్కండి
ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP తో లాగిన్ అవ్వడం ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు.
మన ఐడెంటిటీని నిర్ధారించే ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటి కార్డు, PAN కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మరియు పెన్షన్ కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకదానిని రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించవచ్చు.
https://www.mohfw.gov.in/ అధికారిక వెబ్సైట్ నుండి మీకు సంభందించి దగ్గర్లో వున్నా Covid-19 వ్యాక్సిన్ కేంద్రం గురించి తెలుసుకోవచ్చు.
వాక్సిన్ రిజిస్టర్డ్ ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా లభిస్తుంది. కానీ, దీని కోసం కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఖచ్చితం చేసింది ప్రభుత్వం. అయితే, దీని కోసం ఎక్కువ డబ్బును చెల్లించ వలసిన పనిలేదు. కేవలం 250 రుపాయలు మాత్రమే వ్యాక్సిన్ కోసం చెల్లించాలి. ఇందులో, COVID 19 వ్యాక్సిన్ కోసం 150 రూపాయలు మరియు సర్వీస్ కోసం 100 రూపాయలుగా వుంటుంది.
COVID 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేస్కునే ముందుగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, కరోనా తో పాటుగా ఆన్లైన్ మోసాల భారిన పడకుండా జాగరత్త పడవచ్చు.