మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Jun 12 2015
మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

చాలా ఇష్టపడి ఎక్కువ డబ్బులు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటాం, కాని రెండు నెలలో మరో కొత్త మోడల్ దింపి మళ్ళీ ఫోన్ కొనాలి అనే ఆశలు పుట్టిస్తాయి మొబైల్ కంపెనీలు. అయితే మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ కన్నా సిమిలర్ మరియు  బెటర్ అప్ గ్రేడ్ ఫోన్ ను కొనాలని అనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని క్లాసిక్ ఫేమస్ ఫోన్లకు అపగ్రేడ్ ఆప్షన్స్ లిస్ట్ చేశాము. చూడగలరు.  ఇవి వాటి పాత ఫోన్ కు ఎంత సిమిలర్ గా ఉన్నాయనే దానిపై తయారు చేయబడిన లిస్ట్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సామ్సంగ్ గేలక్సీ S3

గేలక్సీ S2 తరువాత కొన్ని నెలలు పాటు 2012 లో సక్సెస్ఫుల్ గా నంబర్ వన్ స్థానంలో ఉంది గేలక్సీ S3. 

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సామ్సంగ్ S3 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

మోటో x (2014)
ధర 21,999 రూ.
మోటో x సామ్సంగ్ s3 కి అన్ని విధాలుగా మంచి అపగ్రేడ్. కాంపాక్ట్ డిజైన్, ఫుల్ HD, స్నాప్ డ్రాగన్ 801 ప్రోసెసర్ దీని సొంతం. అలాగే ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా దీనికి ఎక్కువుగా ఉంటాయి. సామ్సంగ్ s3 కు ఇంతవరకూ లాలిపాప్ అప్డేట్ రాలేదు.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సామ్సంగ్ S3 కి రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గెలాక్సీ S6
ధర 39,000 రూ.
హై ఎండ్ బడ్జెట్ లో అప్ గ్రేడ్ అవుదామని చుస్తే కనుక ఇది తిరుగులేని ఆప్షన్. దీనిపై మా రివ్యూ ఇక్కడ చూడగలరు
 
మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

ఆపిల్ ఐ ఫోన్ 4S

ఇది ఇప్పుడు డబ్బా ఫోన్ లా అనిపించవచ్చు కాని, 2011, 2012 లో ఐ ఫోన్ 4S ఒక డ్రీమ్ ఫోన్ అందరికి.  తాజగా ఇప్పడు ఐ os 9 అప్డేట్ 4S మోడల్ కు కూడా సపోర్ట్ చేసేలా డిజైన్ చేసింది ఆపిల్. అయితే స్పెసిఫికేషన్స్ పరంగా చుస్తే దీని నుండి అపగ్రేడ్ అవ్వాలి.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

ఐ ఫోన్ 4S కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

ఐఫోన్ 6
ధర 43,500 రూ
ఐ ఫోన్ 6 బెటర్ స్క్రీన్, ప్రోసెసర్, కెమేరా లతో 4S కు మంచి కాంపాక్ట్ అపగ్రేడ్ మోడల్. 

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

ఐ ఫోన్ 4S కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సోనీ ఎక్స్పిరియా Z3 కాంపాక్ట్
ధర 32,000 రూ.
ఆపిల్ నుండి ఆండ్రాయిడ్ కు షిఫ్ట్ అవుదామని, అయితే 4S లాగే చిన్న సైజు లో ఉన్న ఫోన్ కావాలని అనుకుంటే, స్పీడ్ మరియు కన్ఫిగరేషన్ పరంగా కాంప్రమైజ్ అవకుండా దీనికి అపగ్రేడ్ అవచ్చు.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

నేక్సాస్ 4

గూగల్ నుండి అఫీషియల్ గా థర్డ్ పార్టీ బ్రాండ్ ల తయారీ లో వచ్చే నేక్సాస్ మోడల్ లో నేక్సాస్ 4 చాలా ఫేమస్. డిజైన్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా, రియల్ టైమ్ లో స్పీడ్ పరంగా ఇది రెండు సంవత్సరాలు పాటు తిరుగులేని డివైజ్ గా స్మార్ట్ ఫోన్ ప్రపంచానికి మకుటం లేని మహారాజు నేక్సాస్ 4 :)

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

నేక్సాస్ 4 కి మొదటి అపగ్రేడ్ ఆప్షన్

మోటో x(2014)
ధర 21,999 రూ.
నేక్సాస్ 4 కన్నా కొంచెం సైజ్ పెద్దది కాని ఎక్సలెంట్ ఫోన్ ఇది. నేక్సాస్ మాదిరి గా లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ను పొందే డివైజ్ మోటో x. 

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

నేక్సాస్ 4 కి రెండవ అపగ్రేడ్ ఆప్షన్

OnePlus వన్
ధర: 18,998 రూ.
పెద్ద సైజ్ ఫోన్ మీకు ప్రాబ్లెం కాకపొతే, ఇది అన్నీ విధాలుగా అన్ని లేటెస్ట్ హార్డ్వేర్ మరియు సాఫ్టవేర్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

బ్లాక్బెర్రీ బోల్డ్

క్లాసిక్ ఫోన్స్ గురించి ప్రస్తావించినప్పుడు కచ్చితంగా బ్లాక్ బెర్రీ మోడల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది బ్లాక్ బెర్రీ లో లాస్ట్ క్లాసిక్ ఫోన్ అని చెప్పవచ్చు. క్వార్టి కీ పాడ్ మరియు టచ్ స్క్రీన్ రెండు దీనిలో ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ అంతా టచ్ ఫోన్స్. కానీ బోల్డ్ 9900 కు ఉన్న క్వర్టీ మొత్తం బ్లాక్ బెర్రీ అన్ని క్వర్టీ ఫోనుల లో చాలా బెటర్ క్వర్టీ ఫోన్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

బ్లాక్ బెర్రీ బోల్డ్ 9900 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

బ్లాక్ బెర్రీ Q5
ధర 19,000 రూ.
మీకు ఇంకా క్వర్టీ ఫోనులను వాడాలని అనుకుంటున్నారా? అయితే బ్లాక్ బెర్రీ Q5 ఫాస్ట్ ప్రోసెసర్, మంచి స్క్రీన్, కలర్ ఆప్షన్స్ తో లభ్యమవుతుంది. Q10 ఉంది కాని అది కొంచెం కాస్ట్ ఎక్కువ.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

బ్లాక్ బెర్రీ బోల్డ్ 9900 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్
ఆపిల్ ఐ ఫోన్ 6
ధర: 43,500 రూ.
అవును బ్లాక్ బెర్రీ కి దీనికి చాలా తేడా ఉంటుంది. కాని బ్లాక్ బెర్రీ వలె కొంచెం స్టేటస్ ఉన్న బ్రాండ్ మరియు స్టాండర్డ్ డివైజ్ ను వదలని అనుకుంటే ఆపిల్ ఫోన్ మాత్రమే మీకు స్టాండర్డ్ ఫీలింగ్ ను ఇస్తుంది. ఇక os పరంగా చెప్పుకుంటే, అన్నీ విధాలుగా బ్లాక్ బెర్రీ కన్నా ఐ os చాలా బెటర్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

HTC వన్
HTC కంపెని ఫోనులు అంటే మొదట్లో ఐ ఫోన్ తరువాతి స్థానంలో ఉండేవి. ఈ బ్రాండ్ లో మొట్ట మొదటిగా వచ్చిన HTC one మోడల్ హై ఎండ్ సక్సెస్ఫుల్ డివైజ్ గా ఉండేది.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

HTC one కు మొదటి అప్ గ్రేడ్ ఆప్షన్

HTC M9+
ధర: 48,000 రూ.
సూపర్ లేటెస్ట్ ఫీచర్స్  మరియు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ దీని సొంతం. మీడియా టెక్ ట్రూ ఆక్టో కోర్ ప్రోసెసర్ బ్లేజింగ్ స్పీడ్ పెర్ఫార్మెన్స్ ను ఇస్తుంది.
దీని పూర్తి రివ్యూ ఇక్కడ చదవగలరు

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

htc one కు రెండవ అప్ గ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గేలక్సీ S6
ధర: 39,000
ముందు చెప్పుకున్నట్టు, ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోనుల్లో S6 డి బెస్ట్. ఒక విధంగా ఇది ఐ ఫోన్ 6 కన్నా మెరుగైన పెర్ఫార్మెన్స్ మరియు కెమేరా ను అందిస్తుంది. దీనిపై మా రివ్యూ ఇక్కడ చూడగలరు
 
మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

మోటోరోలా మోటో G

దీని గురించి చాలా మందికి తెలుసు, కారణం ఇది మోటోరోలా బడ్జెట్ ర్యాంజ్ లో దించిన గొప్ప స్మార్ట్ ఫోన్. మంచి స్క్రీన్, ప్రోసెసర్, మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ను అందుబాటు ధరలో దింపి రివల్యుషణ్ తెచ్చిన బ్రాండ్ ఈ మధ్య కాలంలో మోటోరోలా నే. అయితే దీనిని అపగ్రేడ్ చేసుకుందాం అనే ఆలోచన తప్పు అనలేము. ఎందుకంటే ఇది 2014 లో వచ్చినప్పటికీ ఇప్పుడు అదే కంపెనీలో చాలా అప్ గ్రేడేడ్ మోడల్స్ వచ్చేసాయి.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

మోటో G కు మొదటి అప్ గ్రేడ్ ఆప్షన్

Xiaomi మి 4i
ధర: 12,999 రూ.
మి 4i ప్రస్తుత బడ్జెట్ఫోన్ సెగ్మెంట్ లో దొరుకుతున్న ఫాస్ట్ ఫోన్. ఇది తీసుకోవటానికి కారణాలు.. కాంపాక్ట్ డిజైన్, మంచి కెమేరా. లేటెస్ట్ స్పెసిఫికేషన్స్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

మోటో G రెండవ అప్ గ్రేడ్ ఆప్షన్

ఆసుస్ జెన్ ఫోన్ 2
ధర: 12,999 రూ
మి 4i అంతగా ఇది చాలా మందికి పరిచయం లేదు, కారణం ఆసుస్ మోడల్స్ అన్నీ ఒకే పేరుతో ఉంటాయి, అలాగే Xiaomi కు ఉన్నంత పబ్లిసిటి మార్కెట్ దీనికి లేదు. అయితే మోటో G కు ఇది కూడా మంచి అప్ గ్రేడ్ మోడల్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

నోకియా లుమియా 1020

నోకియా డిస్ప్లే మరియు బిల్డ్ క్వాలిటీ లో చాలా మంచి స్టాండర్డ్స్ ను మెయిన్టెయిన్ చేస్తుంది అని అందరికీ తెలుసు. అయితే ఈ ఫోన్ తో అద్భుతమైన కెమేరా లను కూడా అందిస్తాది అని రుజువు అయ్యింది. లుమియా సిరిస్ లో ఈ మోడల్ బాగా పాపులర్. 40MP ప్యూర్ వ్యూ కెమేరా టెక్నాలజీ ఉంటుంది ఇందులో. అయితే ఇది కూడా అవుట్ డేటేడ్ అయ్యింది. 

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

1020 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

లుమియా 930
ధర: 29,000 రూ.
ఫాస్ట్ ప్రోసెసర్, ఫాస్టర్ 20MP ప్యూర్ వ్యూ కెమేరా, డిటేల్డ ఫోటోస్, గ్రేట్ లుక్స్ దీనీ ప్రత్యేకతలు.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

1020 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గెలాక్సీ S6
ధర: 39,000 రూ
 మీరు మొదవ సారి S6 ను అపగ్రేడ్ డివైజ్ గా చూపించటం గమనించి ఉంటారు. అయితే 1020 లాంటి మొబైల్ ను కొన్న వాళ్లు అదే బడ్జెట్ స్టాండర్డ్స్ లో ఫోన్ కొనాలని అనుకుంటారు అనే కారణం ఒకటి అయితే, ఇది నిజంగా హై ఎండ్ ఫోనుల్లో ది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది రెండవ కారణం. ఈ రెండు కారణాల వలన ఇది రిపీటెడ్ గా రికమెండ్ చేయబడుతుంది.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సోనీ ఎక్స్పిరియా Z

సోనీ ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో మొదటిగా వచ్చి సక్సెస్ఫుల్ గా రన్ అయిన డివైజ్ సోనీ ఎక్స్పిరియా డివైజ్. మంచి డిజైనింగ్ తో పాటు వాటర్ రెసిస్టెంట్ గా హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది Z.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సోనీ ఎక్స్పిరియా Z కు కుడా సామ్సంగ్ గేలక్సీ S6 ది only బెస్ట్ అప్ గ్రేడ్ మోడల్. సోనీ తరువాత దింపిన Z సిరిస్ మోడల్స్ కన్నా S6 టాప్ రికమెండెడ్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సామ్సంగ్ గేలక్సీ నోట్

సామ్సంగ్ ఫోన్ లలో నోట్ మరో క్లాసిక్ కాన్సెప్ట్. ఒక పక్క పెద్ద సైజు మొబైల్స్ పై కొంత మంది అయిష్టత చూపిస్తుంటే, సామ్సంగ్ నోట్ మాత్రం అందరికి నచ్చే విధంగా తయారీ అయ్యి విడుదల అయ్యింది.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

సామ్సంగ్ నోట్ కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్

సామ్సంగ్ గేలక్సీ నోట్ 4
ధర: 40,000 రూ.
అవును నాలుగు జెనరేషన్స్ తరువాతి మోడల్ ఇది. 5.7 in స్క్రీన్ తో బ్లేజింగ్ స్పీడ్ మరియు సరికొత్త ఫీచర్స్ తో నోట్ కు నోట్ 4 సరైన అపగ్రేడ్ ఆప్షన్.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

నోట్ కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

ఐ ఫోన్ 6 ప్లస్
ధర: 50,000 రూ.
నోట్ కాన్సెప్ట్ వలె, అంత పెద్ద సైజ్ లో అంటే స్టాండర్డ్స్ లో ఉండేది ఆపిల్ ఐ ఫోన్ 6 ప్లస్ మోడల్. దీని స్క్రీన్ సైజ్ 5.5 in అవటం వలన దీనిని సిఫార్సు చేస్తున్నాం నోట్ కు ఆల్టర్నేటివ్ అపగ్రేడ్ మోడల్ గా.
 
మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

లుమియా 520

ఇది విండోస్ ఫోనుల్లో సక్సెస్ అయిన వాటిలో ఒకటి. అందుకు ప్రధాన కారణం అందుబాటులోని ధర అని చెప్పవచ్చు. అయితే దీనికి కొన్ని అపగ్రేడ్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

520 కు మొదటి అపగ్రేడ్ ఆప్షన్ మోడల్

లుమియా 535
ధర: 7,000 రూ.
విండోస్ ఫోన్ అంటే మీకు ఇష్టం అయితే, అన్ని విధాలుగా 520 కన్నా బెటర్ గా ఇంప్రూవ్ అయిన డివైజ్, లుమియా 535.

మీ ఫోన్ పాతది అయ్యిందా? దానికి బెస్ట్ అప్ గ్రేడ్ ఫోన్ ఏంటి?

520 కు రెండవ అపగ్రేడ్ ఆప్షన్

మైక్రోమ్యాక్స్ యు యురేకా
ధర: 8,999 రూ.
విండోస్ ఏకో సిస్టం వాడి బోర్ ఫిల్ అయినవాళ్ళకి, ఆండ్రాయిడ్ పై నడుస్తున్న యు యురేకా మంచి స్పెసిఫికేషన్స్ తో కరెక్ట్ అప్ గ్రేడ్ మోడల్.