అన్ని టెలికాం సంస్థలు యూజర్స్ మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్నాయి.
జిఓ యొక్క ప్రైమ్ ఆఫర్ వచ్చాక జిఓ ను దెబ్బకొట్టేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి
JIO ఇక ఫ్రీ కాదని తెలుసుకున్న మిగతా టెల్కోలు తమ యూజర్స్ ని కోల్పోవటానికి సిద్ధముగా లేరు . అందుకే సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి.
ముందుగా ఎయిర్‌టెల్ ఆఫర్ చూస్తే ఎయిర్టెల్ రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా, అలాగే రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని మరింతగా తగ్గించేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయినట్లు సమాచారం.
తరువాత వొడాఫోన్ ఆఫర్ చూస్తే
ఇది రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా, రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని కూడా తగ్గించాలని వొడాఫోన్ యోచిస్తోందని సమాచారం .
తరువాత bsnl ఆఫర్ చూస్తే
ఇది కూడా మిగతా తీసిపోవట్లేదు . బీఎస్ఎన్ఎల్ రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటాని అందిస్తోందిజ అయితే జియో ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ కూడా డేటా ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది.
ఐడియా చూస్తే ఆఫర్ చూస్తే
ఇప్పుడు ఐడియా రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటాని అలాగే 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటాని ఉచితంగా అందిస్తోంది. దీంట్లో మరిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.