రోజూ ఏదో ఒక న్యూస్ ఉంటుంది. అది టెక్నాలజీ కు సంబందించినది అయినా మరేదైనా. అయితే అవన్నీ టైమ్ కేటాయించి ఓపికగా చదివే అంత ఇంపార్టంట్ విశేషాలు కావు కాని జస్ట్ సింపుల్ గా హెడ్ లైన్స్ మాదిరిగా అన్నీ ఒకే చోట తెలుసుకుంటే ఎక్కువ సమయం కేటాయించానవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే కదా! సో ఇక్కడ సింగిల్ లైన్ షార్ట్ న్యూస్ స్టోరీస్ చూడండి.
Instagram లో అప్ లోడ్ చేసిన వీడియో లను ఎంత మంది చూసారు అనే ఆప్షన్ ఇస్తుంది కంపెని.
Huawei honor Holly 2 Plus ఫిబ్రవరి 15 మిడ్ నైట్ నుండి అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్ లో సేల్స్.
Qualcomm కంపెని Snapdragon 2100 chipset ను రిలీజ్ చేసింది. ఇది 4G wearables(స్మార్ట్ bands అండ్ వాచెస్ ) కు. అలాగే కొత్తగా 625, 435 and 425 SoC లను కూడా లాంచ్ చేసింది స్మార్ట్ ఫోన్స్ కు.
వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం గూగల్ స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ consoles అండ్ కంప్యూటర్స్ ఇలా దేని మీద అయినా రన్ అయ్యే VR(లెనోవో K4 నోట్ తో ఇచ్చిన హెడ్ సెట్ లాంటిది) హెడ్ సెట్ ను తయారు చేస్తుంది.