ముందుగా Z5 ప్రీమియం ఫోన్ చూద్దాం. దీనిలో 4K డిస్ప్లే ఉంది. అంటే 5.5 in మరియు 806PPi ఉన్న డిస్ప్లే లో 4K రిసల్యుషణ్ ఉంది. ఇప్పటి వరకూ రారాజు లా ఉన్న సామ్సంగ్ S6 లో 577PPi ఉంది. స్పెక్స్ పరంగా చాలా పెద్దది గా ఉంది Z5 ప్రీమియం పేపర్ పై చదవటానికి. మరి అవుట్ పుట్ పనితనం అంత ఉందా లేదా అని త్వరలో రివ్యూ లో చూద్దాం.
ఇది z5 ప్రీమియం బ్యాక్ గ్లాసీ ప్యానల్. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. కాని ఫింగర్ ప్రింట్ లను ఎక్కువ ఆకర్షిస్తుంది.
మూడు ఫోన్లకు గ్లాసీ బ్యాక్ ప్యానల్స్ ఉన్నాయి. కాని ప్రీమియం z5 కు ఎక్కువ రిఫ్లెక్టివ్ గ్లాసీ ఉంది.
మూడు మోడల్స్ కు సైడ్స్ లో మెటల్ ఫ్రేం ఉంది. Z5 మరియు Z5 కాంపాక్ట్ కు అల్యూమినియం ఉండగా Z5 ప్రీమియం కు స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేం ఉంది.
Z5 కు 5.2 in 1080P, Z5 కాంపాక్ట్ కు 4.6 in 720P డిస్ప్లే లు ఉన్నాయి.సిమ్ అండ్ sd కార్డ్ స్లాట్స్ వేరే వేరుగా సైడ్ లో ఉన్నాయి.
రైట్ సైడ్ వాల్యూమ్, పవర్ మరియు కెమేరా బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇదే మొదటి సారి సోనీ ఫింగర్ ప్రింట్ వాడటం.
క్రింద usb పోర్ట్ అలానే lanyard hole ఉన్నాయి. ఇవి ఓపెన్ గానే ఉంటాయి కాని వాటర్ ప్రూఫ్ తో వస్తాయి.
పైన ఉంది ఆడియో జ్యాక్ 3.5 mm. అలాగే మూడు మోడల్స్ IP68 సర్టిఫైడ్. అంటే వాటర్ మరియు డస్ట్ ప్రూఫ్ తో వస్తున్నాయి.
వెనుక 23MP కెమేరా ఆటో ఫోకస్, 5x జూమ్ మరియు phase detection తో వస్తుంది. దీనిలోని ISO లెవెల్స్ 12,800 ఉన్నాయి.
మూడు మోడల్స్ 4 కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. Z5 ప్రీమియం మాత్రం 3 కలర్స్ లో రానుంది.