సోనీ చాలా ఎక్కువ గ్యాప్ తీసుకొని కొత్త డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ ఫోన్ ను ఈరోజు మార్కెట్ లోకి విడుదల చేసింది. దాని స్పెసిఫికేషన్స్ తో పాటు పిక్చర్స్ ను ఇప్పుడు చూద్దాం.
left సైడు ఉన్న మైక్రో usb ఛార్జింగ్ స్లాట్ ఈ ఫోన్ కు ప్రధాన ఆకర్షణ గా ఉంది. ఈ ఫోన్ 1.5 మీటర్లు వాటర్ డెప్త్ వరకూ వాటర్ లో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో usb పోర్ట్ ఓపెన్గా ఉంది. అది తడిసినా ఏమి కాదు, కాని తడిసిన usb పోర్ట్ లో చార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి.
5 అంగుళాల 720P డిస్ప్లే మంచి వ్యూయింగ్ ఏంగిల్స్ ను ఇస్తుంది. కాని మి 4i మరియు oneplus వన్ కు దగ్గరలో ఎక్కడా లేదు సోనీ aqua.
సోనీ యూజర్ ఇంటర్ఫేస్ తో లాలిపాప్ వెర్షన్ పై నడవనుంది ఈ ఫోన్.
దీనిలో 5MP ఫ్రంట్ కెమేరా ఉంది. ఇది సేల్ఫీ లవర్స్ కి బాగా నచ్చుతుంది.
వెనుక ఉన్న 13MP కెమేరా సోనీ స్టాండర్డ్స్ కు తగట్టుగా ఉన్నట్టుంది.
రౌండ్ కర్వ్స్ తో ఓవర్ ఆల్ గా లుక్స్ బాగుంది. వెనుక గ్లాస్(కాని పూర్తిగా ప్లాస్టిక్) లాంటి ఫినిషింగ్ తో వచ్చింది సోనీ aqua.
వాల్యుమ్, కెమేరా బటన్, పవర్ బటన్ మరియు మిక్రో ఎస్డి కార్డ్ స్లాట్ అన్నీ right సైడ్ అమర్చబడ్డాయి.
స్పీకర్ ఫోన్ క్రింద ఉంది, ఇది ట్రాఫిక్ లో ఉనప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు.
2400 mah బ్యాటరీ, 2జిబి ర్యామ్, 8జిబి స్టోరేజి, 32జిబి ఎక్స్పాన్డబల్ స్టోరేజి మరియు క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 615 SoC ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్.
అన్ని చూసాక సోని M4 aqua 10 వేల నుండి 15 వేల రూ. మధ్య ఉండే డివైజ్ లా కనిపిస్తుంది. 24,990 ధర చాలా ఎక్కువ. ఎందుకంటే ఇవే స్పెసిఫికేషన్స్ దిని కన్నా తక్కువ ధరలో కొంచెం సక్సెస్ఫుల్ బ్రాండ్ లలో వస్తున్నాయి.