సేల్ఫీ క్రేజ్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సామ్సంగ్ మరియ ఇతర కంపెనీలు సేల్ఫీ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే యోచనలో ప్రస్తుతం లేనట్లే. ఈ విషయంలో సోని ముందు వచ్చింది. గతంలో c3 ఫేబ్లేట్ తో సేల్ఫీ లవర్స్ కు నచ్చే ఫోన్ విడుదల చేసి ఇప్పుడు దాని తరువాతి మోడల్ గా c4 ను ఈ రోజు విడుదల చేసింది. అయితే ఈ c4 ఫేబ్లేట్ జూన్ నెల నుండి మార్కెట్ లోకి రానుంది.
1.7 మీడియా టెక్ MT6752 ఆక్టో కోర్ ప్రాసెసర్ మరియు 2 జిబి ర్యా మ్ పై పనిచేయనుంది సోని c4. ఇదే ప్రాసెసర్ Gionee Elife S7 మొబైల్ లో కూడా వాడటం జరిగింది.
ఇందులోని 5MP ఫ్రంట్ కెమేరా హై లైట్ గా చెప్పవచ్చు. అది కూడా ఫ్లాష్ తో వస్తుంది. సోనీ కొన్ని ఫోటో ఎడిటింగ్ ఫీచర్స్ ను కూడా ఇందులో ఏడ్ చేసింది.
C3 లో 8MP కెమెరాను వాడగా, ఇందులో 13MP రేర్ కెమేరా ను వాడటం జరిగింది.
5.5 అంగుళాల స్క్రీన్ తో వస్తున్న C4 లో నిజంగా వైడ్ వ్యూయింగ్ ఏంగిల్స్ ఉన్నాయి. డిస్ప్లే చాలా మంచి ఫీల్ ను ఇస్తుంది.
ఫోన్ బాడీ ప్లాస్టిక్ తో తయారు చేసారు. అయినప్పటికీ మంచి ప్లాస్టిక్ వాడింది సోనీ, మ్యాటి ఫినిషింగ్ వలన C4 బిల్డ్ మరియు డిజైన్ ఆకర్షణీయంగా ఉంది.
ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆధారిత సోని యూజర్ ఇంటర్ఫేస్ ఇందులో కనిపిస్తుంది. గూగల్ మేటేరియల్ డిజైన్ చాలా తక్కువుగా కనిపిస్తుంది.
ఎక్స్పిరియా Z3 మరియు Z3 కాంపాక్ట్ ఫోనుల్లో వాడిన రౌండ్ ఎడ్జెస్ C4 లో కూడా వాడటం జరిగింది.
147 గ్రాముల బరువు, 7.9 mm మందం కలిగి ఉంది C4.
16 జిబి ఇంటర్నెల్ స్టోరేజి మరియు 128 జిబి ఎక్స్పాన్డబల్ మైక్రో ఎస్డ్ స్టోరేజి.
సోనీ లాంటి బ్రాండ్ నుండి 2600 mah బ్యాటరీ రావటం ఆశ్చర్యంగా ఉంది. ఫెబ్లేట్ అనేసరికి ఏ కంపెని అయినా పెద్ద బ్యాటరీ కెపాసిటి ను ఇస్తాయి.
జూన్ నెలలో సోనీ C4 ను విడుదల చేయనుంది. అయితే దీని ధరను ఇంకా వెల్లడించలేదు. బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో ఫోన్ రానుంది.
ఎక్స్పిరియా C4 C3 కు మంచి అపగ్రేడ్ లా కనిపిస్తుంది. డిజైన్, బిల్డ్, కెమేరా విభాగాల్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.. కాని సోని ధర విషయంలో రాజీ పడి దాని స్టాండర్డ్స్ దిగితేనే, సోని C4 సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ.