ఇండియాలో లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ టీవీలు లేదా స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే, ఇండియాలో లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ టీవీల గురించి ఈరోజు చర్చించనున్నాము. ఇటీవల Realme, Xiaomi, Oneplus మరియు Infinix వంటి మరిన్ని బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్ ని ఇండియాలో విడుదల చేశాయి. వీటిలో కొన్ని ఫోన్లు ఇంకా సేల్ కోసం అందుబాటులో కూడా రాలేదు. కానీ, కొత్త స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్లలో ఎటువంటి ఫీచర్లతో వచ్చాయి మరియు వాటి ధర వివరాలను కూడా తెలుసుకుందాం.
ధర: రూ.14,999
నిన్ననే మార్కెట్లోకి వచ్చిన ఈ Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP (4cm) మాక్రో సెన్సార్ మరియు 2MP B/W సెన్సార్ ఉన్నాయి.అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. డ్యూయల్ సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5GB వరకు వర్చువల్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లూటూత్ 5.1 మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
ధర: రూ.19,999
రియల్ మీ 9 5G SE ఫోన్ కూడా నిన్ననే మార్కెట్లోకి వచ్చింది మరియు ఇది 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. ఈఫోనే వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరావుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0, డ్యూయల్ 5G సపోర్ట్, 3.5mm జాక్, WiFi 6, బ్లూటూత్ 5.2, మొదలైన వాటితో వస్తుంది. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
ధర: రూ.11,999
రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD (2408x1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 180 టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ యునిసోక్ టైగర్ T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారంగా Realme UI R స్కిన్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాకి జతగా మ్యాక్రో సెన్సార్ మరియు B&W లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. ముందుభాగంలో 8ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 12వ తేదీ మద్యహ్నం 12 గంటలకి మొదలవుతుంది.
ధర: రూ.17,999
షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ రెడ్ మీ నోట్ 11 ప్రో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఇది DCI-P3 వైడ్ కలర్ గామట్ మరియు 1200 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. వెనుకవైపు, 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో & డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత MIUI 13 పైన నడుస్తుంది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
ధర: రూ.20,999
షియోమీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ లో Pro+ 5G కూడావుంది మరియు ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఇది DCI-P3 వైడ్ కలర్ గామట్ మరియు 1200 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. వెనుకవైపు, 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత MIUI 13 పైన నడుస్తుంది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
ధర: రూ.12,999
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. ఈ ఫోన్ 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.
ధర: రూ.14,999
ఈ POCO M4 Pro 4G ఫోన్ 6.4 అంగుళాల FHD+ AMOLED పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది. ఎం4 ప్రో 4G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.
ధర: రూ.11,999
ఇన్ఫినిక్స్ ఎక్స్3 యొక్క 32-అంగుళాల స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది మరియు ప్రస్తుతం Flipkart నుండి ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ HD-రెడీ IPS ప్యానెల్‌ను కలిగి ఉంది మరియు ఈ టీవీ విజువల్స్ EPIC ఇంజిన్ 3.0 ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా అందించబడ్డాయి. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, 122% sRGB కలర్ గాముట్, HDR10, HLG సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఆడియో పరంగా, ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవి 20W స్టీరియో స్పీకర్ లతో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ 1GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో 64-బిట్ Realtek RTD2841 (A55x4) క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 11OS పైన రన్ అవుతుంది మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తుంది.
ధర: రూ.15,990
నిన్ననే Blaupunkt తన సైబర్ సౌండ్ లైనప్ కు ఈ 40-ఇంచ్ HD-Ready (1366 x 768 పిక్సెల్స్) స్మార్ట్ టీవీ ని జోడించింది. ఈ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగివుంది మరియు HDR10 కంటెంట్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ఈ టీవీ 40W సౌండ్ అందించగల 2-స్పీకర్ యూనిట్స్ నుండి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అలాగే, స్పష్టమైన ఆడియో కోసం ఈ టీవీలలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్స్ జతచేయబడింది. ఇన్‌పుట్-అవుట్‌పుట్ ఎంపికల కోసం Chromecast, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు వున్నాయి. ఈ టీవీలు 1.4 GHz కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ టీవీలు 1GB RAM, 8 GB స్టోరేజ్ వస్తాయి మరియు Android TV (v9) సాఫ్ట్‌వేర్ పైన రాం అవుతాయి.
ధర: రూ.19,999
ఈ Infinix X3 టీవీ ప్రస్తుతం Flipkart నుండి ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ 43-అంగుళాల సైజులో FHD VA ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ టీవీ విజువల్స్ EPIC ఇంజిన్ 3.0 ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా అందించబడ్డాయి. అంతేకాదు, గరిష్ట బ్రైట్నెస్, 122% sRGB కలర్ గాముట్, HDR10, HLG సపోర్ట్ మరియు యాంటీ-బ్లూ రే ఎమిషన్ ఫిల్టర్ మొదలుకొని 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు చాలా ఫీచర్లను ఈ టీవీలు కలిగివుంది. ఈ స్మార్ట్ టీవిలో 36W స్పీకర్ అవుట్‌పుట్‌ను అందించింది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 1 మినీ YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45, మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్ లను కలిగివుంది. ఈ టీవీ 1GB RAM మరియు 8 GB స్టోరేజ్‌తో 64-బిట్ Realtek RTD2841 (A55x4) క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 11OS పైన రన్ అవుతాయి మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ తో వస్తాయి.
ధర: రూ.19,990
ఈ Blaupunkt Cybersound లేటెస్ట్ గా విడుదలయ్యింది మరియు Flipkart నుండి లభిస్తోంది. ఈ 43-ఇంచ్ FHD (1920 x 1080 పిక్సెల్స్) స్మార్ట్ టీవీ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగివుంది మరియు HDR10 కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ 40W సౌండ్ అందించగల 2-స్పీకర్ యూనిట్స్ నుండి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అలాగే, స్పష్టమైన ఆడియో కోసం ఈ టీవీలలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్స్ జతచేయబడింది. ఇన్‌పుట్-అవుట్‌పుట్ ఎంపికల కోసం Chromecast, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు వున్నాయి. ఈ టీవీలు 1.4 GHz కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ టీవీలు 1GB RAM, 8 GB స్టోరేజ్ వస్తాయి మరియు Android TV (v9) సాఫ్ట్‌వేర్ పైన రాం అవుతాయి.
ధర: రూ.16,499
Oneplus TV Y1S (32) HD రెడీ స్మార్ట్ టీవీ (1366x768) రిజల్యూషన్ వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీ Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీకి బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.
ధర: రూ.26,999
Oneplus TV Y1S (43) FHD స్మార్ట్ టీవీ (1920x1080) రిజల్యూషన్ వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీ Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీకి బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.