స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

బై Soham Raninga | అప్‌డేట్ చేయబడింది Nov 12 2015
స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

ఇంట్లో కొత్త స్మార్ట్ టీవీ కొనే ప్లాన్స్ లో ఉన్నారా? అవసరం లేకపోయినా టీవీ లలో యాడ్స్  వెబ్ సైట్స్ లో ఆఫర్స్ చూస్తె అందరూ కొంటునట్టు ఉన్నారు, మనమూ కొనలేమో అని అనిపిస్తుంటుంది. అవసరం అయినా లేకపోయినా ఇంటికి కొత్త టీవీ తేవాలని ఉంది, కానీ ఏ సైజ్ లో కొనాలి, స్మార్ట్ or స్టాండర్డ్ టీవీ తీసుకోవాలా, 4K టీవీ అంటే ఏమిటి, 3D టీవీ తీసుకుందామా.. అని సందేహాలు మీకు రావటం సహజం.. సో ఇక రిలాక్స్ అవ్వండి. ఇక్కడ మీకు కంప్లీట్ స్మార్ట్ టీవీ బయింగ్ గైడ్ ను పొందిపరిచాము. ఏ టీవీ ఎందుకు కొనలో, అసలు ఏ టీవీ కొనలో తెలుసుకోవటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి, లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

ముందుగా స్క్రీన్ సైజ్ గురించి తెలుసుకుందాము..
టీవీ లలో first చూడవలసినది, స్క్రీన్ సైజ్..
1. మొదటి పాయింట్.. మీ బడ్జెట్ లో వీలైనంత పెద్ద స్క్రీన్ సైజ్ అండ్ లార్జ్ వ్యూయింగ్ distance ఉన్న టీవీ లను చూడండి. అయితే సైజ్ పెద్దది ఎంచుకుంటే కంపెనీలు కొన్ని ఫీచర్స్ ను తగ్గిస్తాయి. ఏ ఫీచర్ తగ్గినా ఫర్వాలేదు కాని మినిమమ్ పిక్చర్ క్వాలిటీ తగ్గే అంత compromise అవకూడదు.

2. మీరు ఇంట్లోని ప్రస్తుత టీవీ కన్నా కొంచెం పెద్ద సైజ్ టీవీ కొనాలని అని ఒక ఫిక్స్ అవుతారు. కాని మీరు ముందుగా ఫిక్స్ అయిన సైజ్ కన్నా పెద్ద సైజ్ టీవీ కొనటం మంచి ఐడియా. ఫ్యూచర్ లో తొందరగా అవుట్ డేట్ అవరు.
 

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

స్క్రీన్ సైజ్ VS Viewing distance
42 in కన్నా పెద్ద టీవీ తీసుకుంటే వ్యూయింగ్ distance పరిగణించాలి. ఇది బేసిక్ గా కంటెంట్ రిసల్యుషణ్ మరియు క్వాలిటీ పై డిపెండ్ అవుతుంది. HD 720P లేదా అంత కన్నా ఎక్కువ రిసల్యుషణ్ లో చూస్తున్న కంటెంట్ అయితే మీరు మినిమమ్ 5 అడుగుల దూరం ఉండాలి 50 in టీవీ కు. ఇక్కడ మీరు HD కంటెంట్(HD కంటెంట్ వేరు, HD టీవీ వేరు) అనే విషయం గమనించాలి. HD టీవీ లో మీరు చూసేది కూడా HD అయితేనే ఇది వర్తిసుంది. స్టాండర్డ్ డెఫినిషన్(SD) కంటెంట్ ను చూస్తున్నట్లయితే అదే 50in టీవీ పై pixelated అవుతుంది. అంటే తక్కువ క్వాలిటీతో వస్తుంది. 4:3 రేషియో లో వచ్చే SD చానెల్స్ ఇంకా worse గా ఉంటాయి 50in టీవీ లో. సో మీరు ఎక్కువుగా చూసే కంటెంట్ SD క్వాలిటీ లోనే ప్రసారం అయ్యే సందర్భాలు ఉన్నప్పుడు, 42 in కన్నా ఎక్కవు సైజ్ ఉన్న టీవీ తీసుకోవటం వలన పిక్చర్ క్వాలిటీ అండ్ టీవీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ను compromise అవటమే. HD టీవీ లు తీసుకునే ముందు మీ ఇంటిలో అంత రూమ్ స్పేస్ ఉందా లేదా అని ఆలోచించండి. 
బాటమ్ లైన్: మీ ఇంటి స్పేస్ మరియు మీరు ఎక్కువుగా చూసే చానెల్స్ HD ప్రసారాలు చేస్తున్నాయో లేదో చూసి, ఇస్తే ఏ డిష్ నెట్ వర్క్ లో ఎంత ప్రైస్ కు ఇస్తున్నాయి అన్నీ అవగాహన పొంది SD టీవీ నా లేక HD టీవీ నా అండ్ సైజ్ విషయలను పరిగణించాలి. అన్నీ బాగుంటే మినిమమ్ 1080P native రిసల్యుషణ్ సపోర్ట్ ఉండే టీవీ మంచిది.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

స్మార్ట్ టీవి అని పిలవ బడే ప్రతీ టీవీ స్మార్ట్ కాదు..
స్మార్ట్ టీవీ ను కొనటం స్మార్ట్ బయింగ్ కాదు. ఆఫ్ కోర్స్ స్మార్ట్ టీవీ..ఎక్కువ వెబ్ కంటెంట్, వైర్ లెస్ కనెక్టివిటి వంటివి ఇస్తుంది కాని మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ టీవీ ను కూడా స్మార్ట్ టీవీ లా కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుసా? సాధరణ టీవీ కు క్రోమ్ కాస్ట్ dongle, ఆపిల్ టీవీ అండ్ గూగల్ ఆండ్రాయిడ్ టీవీ బేస్డ్ డివైజెస్ ను జస్ట్ HDMI పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసి స్టాండర్డ్ టీవీ ను స్మార్ట్ గా కన్వర్ట్ చేయవచ్చు. యూసర్ ఇంటర్ఫేస్, కంటెంట్ ఆప్షన్స్ అండ్ ఓవర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఈజీగా ప్రసుత మార్కెట్ లో ని స్మార్ట్ టీవీ ల కన్నా బెటర్ గా ఉంటాయి ఈ dongles తో. గూగల్ నేక్సాస్ ప్లేయర్ బేస్డ్ ఆండ్రాయిడ్ టీవీ లేదా ఆపిల్ టీవీ 6,000 రూ లోపే అందుబాటులో ఉన్నాయి ఆన్ లైన్ లో. 3,000 రూ క్రోమ్ కాస్ట్ చాలా ఈజీగా మీ స్మార్ట్ ఫోన్/లాప్ టాప్/PC నుండి టీవీకు కంటెంట్ స్ట్రీమింగ్ చేస్తుంది. ఇక బిగ్గర్ స్క్రీన్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా సెపరేట్ డివైజెస్ కోసం అమౌంట్ ఖర్చు పెడితే చాలా అనేది మీ ఇష్టం.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

4K రిసల్యుషణ్ అవసరమా?
4K టీవీ లు ఇప్పుడు మంచి ప్రైసెస్ లో ఉన్నాయి. కాని 4K కంటెంట్ ( ప్రసారం అయ్యే కార్యక్రమాలు లేదా మీ వద్ద ఉండే సినిమలు, వీడియోస్) ఉందా ప్రస్తుతం? అలాగే మీరు 4K టీవీ ను కొంటే అది మినిమమ్ 5 నుండి 8 ఇయర్స్ మార్చకుండా ఉండాలి. కాని 4K లేదా అల్ట్రా HD(UHD) ను కంప్లీట్ గా ఆనందించాలి అంటే మినిమమ్ 55 in టీవీ కావాలి. ఫర్ eg మీరు 42 in టీవీ కొనాలని అనుకుంటే 1080P LED టీవీ బాగుంటుంది. అదే 42 ఇంచెస్ లో 4K రిసల్యిషణ్ కోసం extra అమౌంట్ పెట్టి ఎంచుకుంటే, అది వెస్ట్ చేసినట్లు అవుతుంది.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

తక్కువ ఖరీదు 4K టీవీ లు కొత్త ఇబ్బందులు తేవచ్చు.
తక్కువ కు దొరికే 4K టీవీ లలో 4k కంటెంట్ ను 30Hz లో మాత్రమే ప్లే చేయగలిగే నాణ్యత లేని ప్యానల్స్ ఉంటాయి. ఇది వీడియో ప్లే బ్యాక్ ను సెకెండ్ కు 30Hz రిఫ్రెష్ రేట్ కు లిమిట్ చేస్తున్నట్లు. స్పోర్ట్స్ లేదా ఇతర ఫాస్ట్ మూవింగ్ కంటెంట్ ప్లే అవుతున్న చానెల్స్ లో ఇది బాగా అసహ్యంగా కనిపిస్తుంది. SD లేదా HD కంటెంట్ నే 4K రిసల్యుషణ్ లో ప్లే చేయటం అనేది కరెక్ట్ కాదు అసలు. ఎటువంటి LED టీవీ అయినా ఏ రిసల్యుషణ్ అయినా మినిమమ్ 50 నుండి 60Hz ఉండాలి రిఫ్రెష్ రేట్.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

3D ను పట్టించుకోకండి
3D ఫీచర్ extra కాస్ట్ తో వస్తే అనవసరం. ఎందుకంటే 3D కంటెంట్ దొరకటం కష్టం. 3D కంటెంట్ ను అందించే చానెల్స్ లేదా ఇతర సోర్సెస్ కానీ కూడా లేవు ప్రస్తుతం. పైగా 3D అనేది థియేటర్ లో చూస్తే మంచి ఎక్పిరియన్స్ ఇస్తుంది. ఏదో చెప్పుకోవటానికి లేదా ఒకటి రెండు సినిమాలు 3D లో చూడటానికి మీరు అదనంగా డబ్బులు ఖర్చుపెట్టాలా? ఆలోచించండి.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

Curved అండ్ OLED స్క్రీన్స్
OLED టీవీ లు కలర్స్, కాంట్రాస్ట్, బ్లాక్ లెవెల్స్ అండ్ రెస్పాన్స్ టైమ్ విషయలలో మంచి పిక్చర్ క్వాలిటీ ను ఇస్తాయి. మీ వద్ద ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే OLED టీవీ ను కొనవచ్చు. definite గా బెస్ట్ Visual ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. Curved స్క్రీన్స్ విషయానికి వస్తే ఇవి టెక్నాలజీ పరంగా అభివృద్ధి అని చెప్పుకోవాలి కాని మార్కెట్ లో అవసరం అయితే లేదు. కచ్చితంగా curved టీవీ లు మీ రూమ్ లుక్స్ ను రిచ్ గా మారుస్తాయి కాని మీకు బెస్ట్ మనీ value కలిగిన టీవీ లు కావాలనుకుంటే Curved లేదా OLED డిస్ప్లే లు కరెక్ట్ కాదు ప్రస్తుత ధరలు తో పోలిస్తే. OLED మంచివి అయినప్పటికీ అవి ఇంకా తగ్గాలిసి ఉంది. మరో రెండు సంవత్సరాలలో బాగా తగ్గుతాయి.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

సౌండ్
ఇప్పుడు టీవీ లు స్లిమ్ అండ్ లైట్ గా మారటం వలన సౌండ్ విషయం లో నాణ్యత ఉండటం లేదు. ఒక్క సోనీ w950c మోడల్ మినహా దాదపు అన్ని టీవీ లు ఇలానే ఉన్నాయి. మీరు టీవీ కు అదనంగా స్పీకర్స్ లేదా హోమ్ థియేటర్ ను అటాచ్ చేయలేకపోతే, కొనే షాపు లోనే టీవీ సౌండ్ క్వాలిటీ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. స్క్రీన్ పెద్దగా ఉండి ధర బాగున్నా, తరువాత poor సౌండ్ వలన ఎక్స్పీరియన్స్ అస్సలు నచ్చక బాధ పడతారు.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

గ్రే మార్కెట్ లో కొనటం కూడా మంచిది కాదు..
బాగా తక్కువకి వస్తున్నాయి అని అంత నమ్మకం లేని సోర్సెస్ అండ్ ఇతర గ్రే మార్కెట్ నుండి కొనటం కరెక్ట్ కాదు. టీవీ కొత్తదే, జెన్యూన్ బ్రాండ్ మోడలే కాని ఏదో ఒకటి రిపేర్ లో ఉంటుంది టీవీ లో. అది కొన్నాక తెలుస్తుంది. అప్పుడు చాలా బాధపడతారు. దానికి తోడూ, ఆ ఒక్క పార్ట్ ను రిపేర్ చేయటానికి చాలా ఖర్చు అవుతుంది. మోడరన్ టీవీ ఇప్పుడు ఎవరు పడితే వారు రిపేర్ చేయలేరు. సో వారెంటీ వచ్చే అఫిషియల్ గూడ్స్ సోర్స్ నుండే కొనండి.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

ఒరిజినల్ ప్రైస్ డ్రాప్ అండ్  రీ సేల్ 
టీవీ లకు మామూలగా ఎక్కువ టైమ్ పడుతుంది ఒరిజినల్ ప్రైస్ డ్రాప్ అవటానికి. స్మార్ట్ ఫోన్స్ అంత ఫాస్ట్ గా డ్రాప్ అవవు. సో మీరు ఈ లోపు దానిని సెకెండ్ హ్యాండ్ లో అమ్మదలుచుకున్నా.. మరీ తక్కువకి అమ్మే పరిస్తితులు రావు. ఒక వేల మీరు 2 ఇయర్స్ లో టీవీ ను సేల్ చేయ వలసి వస్తే, దాని ఒరిజినల్ ప్రైస్ లో 30% కన్నా ఎక్కువ ఆశించటం కరెక్ట్ కాదు. ఫ్లిప్ కార్ట్ అండ్ స్నాప్ డీల్ కొన్ని మంచి exchange డీల్స్ కూడా ఇస్తున్నాయి.

స్మార్ట్ టీవీ కొనటానికి మీరు Consider చేయవలసిన విషయాలు - టీవీ బయింగ్ గైడ్

50,000 వేల లోపు ఉన్న మంచి టీవీ లు..

1. 
Vu 55K160GAU - 55in డిస్ప్లే ఫుల్ HD, 1920 x 1080 P, 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్.
2. LG 40UF670T - 4K@60fps, లోకల్ dimming, అల్ట్రా HD(4k), 3840 x 2160P, 2HDMI అండ్ 1 USB పోర్ట్స్
3. LG 43LF6300 - రిచ్, ఎక్కవు కనెక్టివిటి ఆప్షన్స్, Web OS 2.0 పై రన్ అవుతుంది, ఫుల్ HD 1920 x 1080 P, స్మార్ట్ టీవీ, 3 HDMI పోర్ట్స్, 3USB పోర్ట్స్, wifi డైరెక్ట్, ethernet సపోర్ట్

 

1 లక్ష లోపు ఉన్న మంచి టీవీ లు..

1. Sony 50W900B - సూపర్ ఇమేజ్ క్వాలిటీ, రిచ్, గుడ్ సౌండ్, లోకల్ dimming, ఫుల్ HD 1920 x 1080 P, 3D అండ్ స్మార్ట్, 4HDMI అండ్ 3 USB పోర్ట్స్, బిల్ట్ in Wifi, Ethernet.
2. LG 49LF540A - తక్కువ ధర, IPS ప్యానల్, గ్రేట్ value, ఫుల్ HD 1920 x 1080 P, 2HDMI అండ్ 1USB పోర్ట్స్.
3. Samsung 48JU6470 - బిగ్ స్క్రీన్, UHD 4K టీవీ 3840 x 2160P, స్మార్ట్, 4HDMI అండ్ 3USB పోర్ట్స్.