మీరు ప్రివెసీ ఎక్కువ కోరుకుంటారా? సెక్యురిటీ ఉండాలని ఈ రోజుల్లో అని అనుకునే వారి కోసం వారికి నచ్చే మంచి టెక్ గాడ్జెట్స్ ఇక్కడ పొందిపరిచాము. చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
RFID బ్లాకింగ్ Wallet & బ్యాక్ ప్యాక్
ప్రస్తుతం చాలా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ లో RFID టెక్నాలజీ వచ్చింది. కార్డ్ రీడర్ లో కార్డ్ ను పెట్టె అవసరం లేకుండా సింపుల్ గా కార్డ్ ను గాలిలో Wave చేస్తే చాలు. ఇది కొంచెం NFC లా ఉంటుంది కాని డిఫరెంట్. కాని దీని వలన కార్డ్స్ ఇన్ఫర్మేషన్ బాగా దొంగతనం అవుతుంది. సో ఇలాంటివి జరగకుండా RFID బ్లాకింగ్ wallet use అవుతుంది. 100 రూ నుండి స్టార్ట్ అవుతుంది దీని ప్రైస్. RFID పాస్ పోర్ట్ ఉండి దానిని బ్యాగ్ లో వేసి తిరిగే వారికి కూడా ఇదే ప్రాబ్లెం గా ఉంటే RFID బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి 5 వేల నుండి స్టార్ట్ అవుతున్నాయి.
సెల్ఫ్ destroying SSD హార్డ్ డ్రైవ్
5 సేకెండ్స్ లో హార్డ్ డ్రైవ్ ను సెల్ఫ్ విధ్వంసం చేసుకుంటుంది ఇది. సాధారణంగా sms పంపితే డేటా erase అయ్యేవి ఉన్నాయి కాని ఇది డేటా తో పాటు మొత్తం డ్రైవ్ కూడా destruct అవుతుంది. ప్రైస్ 99,500 రూ. అవును :) చాలా ఎక్కువ.
రేడియేషన్ బ్లాకింగ్ స్మార్ట్ ఫోన్ cases
రేడియేషన్ అనేది ఎవ్వరూ పట్టించుకోని విషయం కాని దీని ప్రమాదం ఊహించనది, తెలియనిది. సో కొంతమంది దీని పై చాలా శ్రద్ధ గా ఉంటారు. రేడియేషన్ ను బ్లాక్ చేయటానికి చాలా కేసెస్ ఉన్నాయి. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్ కు ఈ యాంటి రేడియేషన్ కేస్ లు 100 రూ నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్టు లో చెప్పేవి అన్నీ కొనే అవసరం సందర్భం లేకపోయినా ఇది కొంటే మీరు చాలా మంచి పని చేసినట్టే.
సెక్యూర్ స్క్రీన్ గార్డ్
మీరు పబ్లిక్(బస్, ట్రెయిన్, బస్ స్టాప్స్, కాలేజ్ )లేదా ఇంట్లో (ఫంక్షన్స్) ఉన్నప్పుడు sms లు చేస్తుంటే వెనక నుండి ఎవరో చూస్తుండే సందర్బాలు బాగా ఎదుర్కొంటున్నారా? అయితే Tech Armor 2 - Way ప్రైవెసి Ballistic గ్లాస్ స్క్రీన్ Protector వంటివి బాగా use అవుతాయి. ప్రైస్ - 1200 రూ. ఇక మీ వెనక నుండి ఎవరు మీ ఫోన్ చూస్తున్నా వారికీ ఏమి కనిపించదు. ఇందుకోసం బ్రైట్ నేస ఫుల్ గా పెట్టాలి.
వైర్ లెస్ Key ఫైండర్
మీరు సాధారణంగా ఏవైతే మరిచిపోతున్నారో వాటికి టాగ్స్ అని పిలవబడే వీటిని అటాచ్ చేస్తే, ఇక మీరు ఎప్పుడు మరిచిపోయినా వెంటనే మీ స్మార్ట్ ఫోన్ బీప్స్ ఇస్తుంది. ఎందుకంటే మీ ఫోన్ కు ఒక ట్యాగ్ అటాచ్ అయ్యి ఉంటుంది. మిగిలిన వాటిని వదిలి మీ స్మార్ట్ ఫోన్ టాగ్ దూరం గా వెళితే వెంటనే beep సౌండ్ చేస్తుంది. బ్లూ టూత్ కనెక్షన్ తో వర్క్ అవుతుంది. ఇది మీ pets, పిల్లలకు కూడా పెట్టవచ్చు.
ఫింగర్ ప్రింట్ బేస్డ్ లాక్స్
keys లేకుండా ఇప్పుడు లాక్ సిస్టంస్ వస్తున్నాయి. మీ ఫోన్ లో కేవలం 4 లేదా 6 డిజిట్ పాస్ కోడ్ ను ఎంటర్ చేస్తే ఇంట్లోకి వెళ్లిపోవచ్చు. కాని వీటి పై నమ్మకం లేని వారికీ ఫింగర్ ప్రింట్ సెక్యురిటీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సుమారు 10,000 రూ ఇవి. ఒకటే కాదు చాలా ఫింగర్ ప్రింట్స్ enable చేయవచ్చు.
వైర్ లెస్ హోమ surveillance
మీ ఇంట్లో దొంగలు పడతారు అనే భయాలు, సందర్భాలు ఉన్నాయా? జస్ట్ WiFi enabled సెక్యురిటీ కెమెరా ను పెడితే, మీ ఫోన్ లేదా లాప్ టాప్ నుండి హోమ ను మానిటర్ చేయగలరు. ఇందుకోసం ఇంటిలోని ఇంటర్నెట్ ను active గా ఉంచాలి అలాగే surveillance కెమెరా కు WiFi ను కనెక్ట్ చేయాలి.