ఇండియన్, చైనీస్ అండ్ ఇతర దేశాల్లో తయారు అయ్యే అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీల సర్వీస్ సెంటర్స్ సమాచారం తెలుసుకోవటానికి మంచి యాప్ ఉంది. మరింత సమాచారం కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
యాప్ పేరు Mobile Service Center. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేయగలరు.
యాప్ డిటేల్స్:
4.1 star రేటింగ్ కలిగిన ఈ యాప్ సైజ్ 4.15 MB ఉంది. అంటే 2G ఇంటర్నెట్ లో 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేయగలరు.
యాప్ ఫీచర్స్:
1. బ్రాండ్ ఏదైనా ఏ దేశంలోని కంపెని అయినా, ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయితే చాలు, దాని సర్వీస్ సెంటర్ వివరాలు అందిస్తుంది.
2. అడ్రెస్, ఫోన్ నంబర్, ఈమెయిలు ఐడి వివరాలను అందిస్తుంది.
3. డిటేల్స్ ను offline లో కూడా సేవ్ చేయగలరు.
ఎలా పనిచేస్తుంది?
యాప్ డెవలపర్ టోటల్ సర్వీస్ సెంటర్స్ డేటా బేస్ ఎంటర్ చేయటం జరిగింది.
సో యాప్ ఓపెన్ చేయగానే ఫోన్ కంపెని, స్టేట్ ఎంటర్ చేస్తే ఆ స్టేట్ లో ఏ places లో సెంటర్స్ ఉన్నాయి లిస్టు చూపిస్తుంది. వాటిలో ఒకటి ఎంచుకుంటే, లాస్ట్ 4th ఆప్షన్ లో సర్వీస్ సెంటర్ ను ఎంచుకోవాలి. ఇప్పుడు క్రింద ఉండే Get Center Details బటన్ టాప్ చేసి అన్ని వివరాలు పొందుతారు.
ఫైనల్ టిప్:
మీరు కావలసిన సర్వీస్ సెంటర్స్ డిటేల్స్ ను ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఓపెన్ చేసి చూసుకునేలా offline మోడ్ ఫీచర్ ఉంది. Get Center Details బటన్ టాప్ చేసిన తరువాత వచ్చే సమాచారం పైన రైట్ సైడ్ cloud సింబల్ పై టాప్ చేస్తే పనిచేస్తుంది ఇది. అంటే మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేనప్పుడు సర్విస్ సెంటర్ కు మార్గ మధ్యంలో ఉన్నప్పుడు కూడా డిటేల్స్ చూడటనికి బెస్ట్ useful.