MOTO కొత్త ఫ్లాగ్ షిప్ సిరిస్ Z ను రిలీజ్ చేసింది US లో. ఇప్పటికీ Z సిరిస్ లో MOTO Z మరియు MOTO Z Force రిలీజ్ అయ్యాయి. రెండింటిలో స్నాప్ డ్రాగన్ 820 SoC. Z Force లో లార్జ్ బ్యాటరీ అండ్ బెటర్ కెమెరా ఉన్నాయి. మరిన్ని డిటేల్స్ అండ్ ఇమేజెస్ తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
Moto Z స్పెసిఫికేషన్స్..
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32/64GB
Camera: 13MP, 5MP
Battery: 2600mAh
OS: Android 6.0.1
ఫోన్ లో 5MP ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా తో 1080P వీడియోస్ ను కూడా రికార్డ్ చేయగలరు. ఈ రెండూ ఫ్లాగ్ షిప్ లో రెగ్యులర్ గా కనిపించే ఫీచర్స్ కావు.
MOTO X అండ్ MOTO G మోడల్స్ ఇవి. Z ఫోన్ చాలా స్లిమ్ గా ఉంది. కేవలం 5.5mm thin బాడీ. వెనుక కెమెరా మాత్రం బయటకు వస్తూ bump డిజైన్ లో ఉంది.
మొదటి సారి మోటోరోలా USB టైప్ C పోర్ట్ ను ఇవటం. మోటోరోలా కూడా 3.5mm ఆడియో జాక్ ను రిమూవ్ చేసి USB టైప్ C సింగిల్ పోర్ట్ లోనే ఆడియో, చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది.
Moto Z Force స్పెసిఫికేషన్స్..
Display: 5.5-inch, 1440p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 32/64GB
Camera: 21MP, 5MP
Battery: 3500mAh
OS: Android 6.0.1
Z Force లో పెద్ద బ్యాటరీ ఉండటం వలన కొంచెం మందంగా ఉంటుంది, Z మోడల్ కన్నా. 7mm. ఆఫ్ కోర్స్ ఇది కూడా స్లీమ్ బాడీ నే జనరల్ గా చూస్తే.
Z Force లో shattershield డిస్ప్లే ఉంది. ఇదే డిస్ప్లే ను కంపెని ఇంతకముందే Moto X Force లో పెట్టింది. అంటే క్రింద పడినా డిస్ప్లే పగలకుండా ఉంటుంది. multiple layers తో ఉండటం వలన డిస్ప్లే ఎన్ని సార్లు క్రింద పడిన బ్రేక్ అవ్వదు.
MOTO Z Force లో 21MP రేర్ కెమెరా ఉంది. Z అండ్ Z ఫోర్స్ రెండింటిలోనూ ఆప్టికల్ ఇమెజ్ stabilization (OIS) మరియు లేసర్ ఆటో ఫోకస్ ఉన్నాయి.
ఫోన్స్ బాగున్నాయి. వీటికి తోడూ కంపెని MOTO MODS పేరుతో modular స్మార్ట్ ఫోన్ కాన్సెప్ ను కూడా తీసుకు వచ్చింది. అంటే LG G5 లానే ఉంటాయి. మోటోరోలా తయారు చేసిన ఈ mods ను ఫోన్ కు తగిలించుకొని అదనంగా ప్రత్యేకమైన ఫంక్షన్స్ ను పొందగలరు. ఫోన్ కు వెనుక అడుగున contact pins పాయింట్ ఉంటుంది. దానికి కనెక్ట్ అవుతాయి mods.
మూడు మెయిన్ mods ఉన్నాయి. ఒకటి Incipio offgrid power pack పేరుతో వచ్చే సింపుల్ అదనపు బ్యాటరీ. రెండవది JBL SoundBoost. మూడవది మీ ఫోన్ ను 70 in టీవీ స్క్రీన్ సైజ్ లో గోడ పై మీ ఫోనులోని వీడియోస్ ను ప్లే చేసే projector.
ఇదే MOTO Z insta-share projector mod. ప్రొజెక్టర్ తో పాటి inbuilt గా బ్యాటరి కూడా ఉంటుంది. 70in లో image ను project చేసిన గంట తరువాత, ఫోన్ లోని బ్యాటరీ ను వాడుకుంటుంది MOD.