గ్లోబల్ గా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో అనౌన్స్ అయిన తరువాత శామ్సంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ - S7 అండ్ S7 edge ను ఇండియాలో అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోనులు బెస్ట్ హార్డ్ వేర్ తో వస్తున్నాయి. మరింత depth గా డిటేల్స్ తో పాటు చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
శామ్సంగ్ S7 మోడల్ తో మొదలు పెడుదాం . ఇది 48,900 రూ లకు వస్తుంది.
Display: 5.1-inch, 2560 x 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0 Marshmallow
శామ్సంగ్ S7 ను true గా మెటల్ మరియు గ్లాస్ మెటల్ డిజైన్ ను అడాప్ట్ చేసింది. చూడటానికి S6 మోడల్ కు సిమిలర్ గానే ఉంది. చుట్టూ మెటల్ ఫ్రేమింగ్ ఉండగా పైన సిమ్ ట్రే ఉంది. దీనిలోనే sd కార్డ్ కూడా పెట్టుకోగలరు. హెడ్ ఫోన్ జాక్ అండ్ సింగిల్ స్పీకర్ గ్రిల్ ఫోన్ క్రింది భాగంలో వాటర్ ప్రూఫ్ తో వస్తున్నాయి.
S7 IP68 సర్టిఫికేషన్ తో ఒక గంట పాటు డస్ట్ అండ్ వాటర్ నుండి survive అయ్యేలా వస్తుంది. అలాగే 1.5 మీటర్ లోతులో 30 నిముషాలు పాటు వాటర్ లో ఉండగలదు.
సూపర్ అమోలేడ్ 5.1 డిస్ప్లే always on ఫీచర్ తో కలిగి ఉంది. కేవలం అవసరం అయిన పిక్సెల్స్ ను మాత్రమే always on లో on చేసి ఉంచటం వలన బ్యాటరీ theoretically గా సేవ్ అవుతుంది. దీనిని customise కూడా చేసుకోగలరు.
వెనుక గ్లాస్ బాడీ బాగుంది కాని ఫింగర్ ప్రింట్ లను బాగా ఆకర్షిస్తుంది. ఓవర్ ఆల్ గా curve edges వలన కంఫర్ట్ గా ఉంది.
ఇప్పుడు 56,900 రూ ప్రైస్ తో వస్తున్న bigger డిస్ప్లే మోడల్ గేలక్సీ S7 edge చూద్దాం..
Display: 5.5-inch, 2560 x 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32GB
Camera: 12MP, 5MP
Battery: 3600mAh
OS: Android 6.0 Marshmallow
కేవలం లుక్స్ ఒకటే కాదు ఎక్కువ content ను చూపిస్తూ మరింత useful గా ఉంది edge డిస్ప్లే.
S7 అండ్ S7 edge కు 5MP ఫ్రంట్ కెమేరా ఉంది. ఇది ఫf/1.77 aperture తో రావటం వలన మరింత depth అండ్ బెటర్ low లైటింగ్ ఫోటోస్ రావాలి.
రేర్ కెమేరా లో Lower మెగా పిక్సెల్ ఉంది - 12MP. అదే S6 లాస్ట్ మోడల్ లో 16MP ఉంది. అయితే 12MP బెటర్ క్వాలిటీ ఇవనుంది అని expect చేస్తున్నాము. వెనుక లెన్స్ bump కూడా చిన్నగా ఉంటుంది.
S7 edge కు కూడా ఫింగర్ ప్రింట్ మాగ్నెట్ ఉంది. ఇది లాస్ట్ మోడల్ S6 edge కన్నా పెద్ద గా ఉంటుంది.
నిన్నటి నుండి రెండు మోడల్స్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్. మార్చ్ 17 నుండి సేల్ అవనున్నాయి. ప్రీ బుక్ చేసుకున్న వారికీ సామ్సంగ్ VR హెడ్ సెట్ ఫ్రీ గా ఇస్తుంది కంపెని.